Category Shoba

భావి సారథి

అంతరంగం అంతు చిక్కని అనంత పారావారమై, బంధాలకు,అనుబంధాలకు నెలవైన నెలత, ఆత్మీయతానురాగాలనందించే అమృతకలశం. ఆమె… కుటుంబసభ్యుల సేవలో రేయింబవళ్లను ఒకటిగా చేసి, వారిని జాగృతంచేసే చైతన్యకిరణం, ఆశయాల తీరం చేర్చే నావ, తలపుల వినీలాకాశంలో స్వేచ్ఛగా విహరింపచేసే విహంగం. నవ్యచరితలు లిఖించుటకై ద్విగుణీకృతమైన పట్టుదలతో, మొక్కవోని దీక్షతో, సర్వం తానై, సకలానికి నెలవై, విశ్వవిపంచిjైు నిశ్శబ్దాన్ని…

ఆమె…

ప్రపంచంలో ప్రేమ పలురూపాల్లో  పలుపాత్రల్లో కనిపించే బలమైన బంధం స్త్రీ. ప్రతి ఒక్కరి బతుకులో కొండంత గొప్పగా ఊహించని ఆధారం కోరని వరంగా  కురిసే ఆనందం.. అమ్మ, అక్క, చెల్లి,భార్య, పాత్ర ఏదైనా జీవితంలో ఘనమైన ప్రేమకు ‘‘ఆమె’’ నిజరూపం. (మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా…) -శ్రీసాహితి 9704437247

మణి దీపం

మహిళే కదిలింది మహిమే చూపింది మహిలోన ప్రగతికి బాటే తానైనది ధరణే ధన్యమయ్యింది పుడమే పులకించింది మీ పాదాల ప్రణమిల్లి మీ ఘనతనే చాటింది తొలికోడి కూత కన్నా యల కోయిల పాట కన్నా ముందే నిద్దుర లేచే మహిళే కదరా మిన్నా ఇలలో అందమైనది కళకే కళ తెచ్చింది వసుధకే ఒక వరమై వసంతాలు…

గుప్పెడు మెతుకులకై వెతుకులాట…

కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ    ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల  వరదలు, ఈదురు…

గుల్దస్తా

పాటల సేద్యం హిందుస్థానీ సురాగం శ్రవణానందం కవితా శిల్పి తేనెచిలికే కలం సాహిత్య ఖని సినీ జగత్తు పాటల తోటమాలి పూల సుగంధం గుల్జార్‌ కవిత్వం వసంత గులాబీలు ఓ జ్ఞాన పీఠం -రేడియమ్‌, 9291527757

అలసట

అలసిపోయావా నేస్తం సోలిపోయావా నేస్తం ఆలోచనలు తక్కువైపోయి ఆవేశాలు ఎక్కువైపోయి ఊహలు మిగిలిపోయి వాస్తవాలు తేలిపోయి కలలు కరిగిపోయి కోరికలు పెరిగిపోయి కన్నీళ్లు ఇంకిపోయి భావాలు పెగలక నిర్లిప్తత చేరాక శూన్య మస్తిష్కంలో అనాశక్తి మేఘం అవరించిందా? నిరాశక్త తాపం దాపురించిందా? అయితే అది ప్రశాంతత కాదు అది స్వాంతత కాదు వచ్చే తుఫానుకు సంకేతం!…

గుండెల్లోని భావాగ్ని…

నవ్యత వైపు వేసే ప్రతి అడుగూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కాలానుగుణమైన మార్పులను స్వీకరించి ముందుకు సాగడం కవిత్వ లక్ష్యం, లక్షణం కావాలి. బలీయమైన భావనాశక్తితో వస్తువు, విషయ నిష్టత, శబ్ద శక్తి కలిగి రమణీయమైన శైలితో వెలువడే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. నవనవోన్మేషమైన తాత్త్విక సంయోజనా నిపుణతను కలిగిన కవి రమణీయాక్షర  పరిమళాలను అద్ది ఉదాత్తమైన…

వొరలోంచి తీసిన కరవాలం…

ఒక్క కవితతోనే.. ఒక్కసారే.. వాడి బతుకు ఉడుకెత్తాలి.. వీడిజీవనం మొలకెత్తాలి -అని ప్రఖ్యాత కవి రావిరంగారావు కవిత్వం కావాలి అన్న తన కవితలో వెల్లడిరచారు. నిజమే… కవిరాసే కవితలో మంటలు, పంటలే కాదు మంచు పర్వతాల సొగసులు, అగ్నిపర్వతాల జ్వాలలు కనిపించాలి. మొత్తానికి పూలనిప్పులా కవిత్వం ఫరిడవిల్లాలి. చరిత్ర శిరసు మీద అజేయ శిఖరమై పాతుకుపోవడమే/…

ఓ రాహీ…రుక్‌ జానా నహీ !

మనిషంటేనే ఒక లయగతిక ప్రతీక జీవితమంటేనే చలనశీలం దేహం కదులుతుంటేనే ప్రాణం కాపురం చేస్తున్నట్టు ఊపిరుంటేనే ఉనికికి చిరునామా నడక మనిషి శ్వాస ఆగక నడవడమే మన అస్తిత్వం పయనం దారిలో పట్టుతప్పి ఎదురు దెబ్బలెన్ని తగిలినా పడిపోకుండా సాగటమే జీవితం నడకలేని మనిషి జీవితం ఎపుడైనా ఊహించగలమా? తప్పటడుగులతో మొదలై బుడి బుడి నడకలుగా…