Category సాహిత్యం-శోభ

దీనబాంధవ్‌..‌జగ్జీవన్‌ ‌రామ్‌

సుపరిపాలనా దక్షుడు సకలగుణ సంపన్నుడు సామాజిక విప్లవకారుడు స్వతంత్య్ర సమరవీరుడు అతడే.. పొలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌ ‌బెస్ట్ ‌పార్లమెంటీరియన్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అం‌తరాల వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు సాంఘీక దురాచారాల మీద యుద్ధం ప్రకటించిన యోధుడు స్వేచ్ఛా స్వాతంత్రం కోసం సమరమ్ము సాగించిన వీరుడు హరిత విప్లవోద్యమానికి అండగా నిలిచిన ఆతిరథుడు…

శుభకృతకు స్వాగతం

సంతోష సంరంభ సూచిక సమైక్య జీవన సుమమాలిక సంస్కృతి,సంప్రదాయ వేదిక యుగానికి ఆది ఉగాది వేడుక శుభకృత నామ నవ వత్సరిక చైత్ర శుక్ల పాడ్యమి వేళా ప్రాతఃకాల తలస్నానాలు నూతన వస్త్రాలంకరణలు వేలాడే మామిడి తోరణాలు బంధు, మిత్రుల సందళ్ళతో ప్రతి మనసు మధురరసడోలా ప్రతి తనువు తన్మయత్వజోలా వేప పువ్వుల సౌరభాలు కోకిలమ్మల…

కోటికాంతుల ఉగాది

సప్తవర్ణాల నూతన సోయగాలతో హరితకాంతులు వెదజల్లగా.. నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లు.. సేను సెలక..కొండాకోన బృందావనమై వనమంత పులకింతమై ఊగే లతల వయ్యారంలో.. సన్నజాజి కన్నెతీగలు పూలజల్లులు కురిపించగా.. మామిడితోరణాలతో ప్రతిగడప శోభించగా.. శిశిరానికి వీడ్కోలు పలుకుతూ.. నవ వసంతానికి స్వాగతమిడుతూ.. కాలమనే రథంపైఎక్కి ఉరకలేస్తూ వచ్చేస్తుంది ఉగాది. చేదు జ్ఞాపకాలన్నింటిని ఎండిన ఆకుల్లా రాల్చి..…

యుగ యుగాల ఉగాది పర్వం

చైత్ర శుక్ల పాడ్యమి సృష్టి కి అంతం అదే రోజు యుగం ఆరంభం ఆ రోజే యుగాదిగా పరిగణం అదే కాల క్రమేణా ఉగాదిగా ప్రాచుర్యం. ఈ ఉగాది పర్వదినం నాడే వసంత ఋతువు ప్రారంభం అదే నేటి రోజుకు మరో విశేషంనూతన సంవత్సరం ఈనాటినుండే ప్రారంభం. పెద్దవారి ఆశీర్వాదం ఇష్ట దేవుడి ఆరాధనం మనసుకుకలిగించు…

పేరు నిలుపుకో…

చైత్ర మాసపు ఉషస్సులా, ఆనంద భాగ్యాలనిచ్చు వసంతవాహినిలా, ప్రజల మదిన రమ్యభావమలర ఆత్మీయతానురాగాల్ని ఆకాంక్షల భావాల్ని పెనవేసుకుంటూ తెలుగునేల వైభవం వెలిగేలా సంస్కృతీ సంప్రదాయాలు సందడి చేస్తుంటే, విచ్చేస్తున్నజి తెలుగువారి షడ్రుచుల సంతోషాల సారధీ ఓ శుభకృత్‌! ఊహలకు సరికొత్త ఊపిరినిస్తావని నీ కోసం తెలుగు లోగిళ్లు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాయి. బతుకుల్లో బాకులు దూసిన గతవత్సరపు…

శుభముల శుభకృతు

సకల జనుల సంతోషాలకు శుభ సూచకమై వస్తున్నది శుభకృత్‌ ‌నామ దారి ఉగాది శిశిరం రాలుస్తున్న ఆకులు ఉక్రెయిన్‌ ‌రష్యా యుద్ధం లో కూలుతున్న దేహాల శ్వాసలు మొండి ఆశల మోడులు పచ్చని చిగురుల పందిళ్లు వేసి కోయిలలను ఆహ్వానిస్తున్నవి యుద్ధంలో అలసి జెలన్స్కి పుతిన్లు కోయిలల మధ్యమ స్వరాలులు విని శాంతి చర్చలు జరుపుచుండిరి…

అమ్మ పాటల్ని

ఏ చరిత్రా చెప్పలేదు నాకు యుద్ధం చేయమని ఏ పురాణమూ ఇతిహాసమూ నేర్పలేదు సరైన పాఠం ఎముకల దారిలో మృత్యువు భుజాన్ని ఆసరాగా తీసుకుని గడిచిన గతాన్ని శాంతి వచనాల్లా వల్లేవేస్తూ ఎదురుచూసే గుమ్మాలకు రేపటి తోరణాలు కడుతూ కోల్పోయిన కడుపులకు సర్ది చెప్పుతూ అరణ్యరోదనల పర్వంలో ఎన్ని పాత్రలో సజీవదహనం చేయబడ్డవి ఇంకా వారి…

దుఃఖ దీపం

తనువులోని రక్తాన్నంత చమురుగా పోసి ఒంట్లోని నరాలన్నింటిని వత్తులుగా పేని.. జీవితపు ఆశలను ప్రమిధలుగా చేసి.. ఎదలో రగులుతున్న కష్టాలను.. నిప్పురవ్వలుగా రాజేసి వెలిగించిన దీపం.. బలంగా వీస్తున్న గాలి తాకుల్లకు ఊగిసలాడుతూ కన్నీరు కారిస్తుంది. ఉహాలనే ఆధారాలకు వ్రేలాడుతున్న వెలుగులన్ని.. కాలం విసిరిన కత్తుల వేటకు తెగిపడుతున్నాయి. నిశీధి కమ్ముకున్న నల్లని ఆకాశంలో.. తారలన్నీవెలుగుపూలు…

ఆశాగీతి

చైత్రమాసపు ఉషస్సులా జగతిని మైమరపించే వసంతభామినిలా పచ్చని చిగురుటాకుల పావడాకట్టి కబరిపై మల్లెలు సింగారించి మధుపములు మంజులనాదం చేస్తుండగా చిరునగవులొలికిస్తూ హంసలా అడుగులేస్తూ మధుమాసపు కోకిలలు పంచమంలో స్వాగతగీతం పాడుతుండగా తెలుగు వెలుగు నేనని షడ్రుచుల సమ్మేళనం నేనేనంటూ మమతానురాగాలను పెనవేసుకుంటూ అందరి ఆశలు ఈడేర్చగ వసంత సంతకం చేస్తూ శుభాలిచ్చుటకై శుభముఖంతో వేంచేస్తున్న వయ్యారిభామ…