Category ముఖ్యాంశాలు

జర్నలిస్ట్ అ‌క్రిడిటేషన్‌ ‌కార్డుల మంజూరుపై కసరత్తు

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టో బర్‌ 26 : ‌రాష్ట్రంలోని వర్కింగ్‌ ‌జర్నలిస్టులకు అక్రిడి టేషన్‌  ‌కా ర్డుల మంజూ రుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శ కాల ను రూపొం దించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ…

పోలీసుల ఆందోళనల వెనక కుట్ర!

పోలీసు ఉన్నతాధికారుల అనుమానం ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన రాష్ట్ర డిజిపి జితేందర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌26: ‌తెలంగాణ పోలీస్‌ ‌బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై పోలీస్‌ ‌శాఖ గుర్రుగా ఉంది.  విధులను బహిష్కరించడం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్‌ ‌శాఖ భావిస్తోంది. ఈ…

రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్ల ఆందోళనలు

ప్రత్యక్ష నిరసనల్లో కుటుంబాలతో సహా పోలీసులు వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాల్లో రోడ్డెక్కిన ఖాకీలు ఇబ్రహీంపట్నం, మంచిర్యాలలో ఫ్యామిలీల ధర్నా ఆందోళనలతో మిన్నంటుతున్న బెటాలియన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌రాష్ట్రంలో ఏక్‌ ‌పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన పోలీసులే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. వరంగల్‌ ‌జిల్లా మమూనూరు…

కొడంగల్‌ ‌నుంచే రేవంత్‌ ‌పతనం

BRS working president KTR said that the rebellion has started

కాంగ్రెస్‌ ‌నేతలు పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక తిరుగుబాటు మొదలైందన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది రేవంత్‌ ‌రెడ్డి కొడంగల్‌ ‌నియోజకవర్గం పర్యటనలో ఉండగానే.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎంకు షాకిచ్చారు. పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…

కేసీఆర్ కుటుంబంపై చర్యలకు సర్వత్రా డిమాండ్..

కమీషన్ల కోసమే కాళేశ్వరం  నిర్మాణం అన్నికేసులపైనా ముమ్మ‌ర‌ విచారణ అవినీతి నేతలను ఎవ‌రినీ వొదిలే ప్రసక్తే లేదు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది కేబినేట్‌ ‌విస్తరణ అధిష్ఠానం, సిఎం చూస్తారు త్వరలోనే పార్టీ పునర్‌వ్యవస్థీకరణ మీడియాతో ఇష్టాగోష్ఠిలో  పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ‌కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని ప్రపంచానికంతా తెలిసిందని,…

తనిఖీలు లేకుండానే మేడిగడ్డకి సబ్‌స్టాన్షియల్‌ ‌పత్రం

కాళేశ్వరం కమిషన్‌ ‌ముందు  సిఈ సుధాకర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌26 : ‌కాళేశ్వరం కమిషన్‌ ‌ముందు చీఫ్‌ ఇం‌జినీర్‌ (‌సీఈ) సుధాకర్‌రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ఆయన్ను విచారించింది. డీపీఆర్‌ ‌తయారీ పనులను నామినేషన్‌ ‌పద్ధతిన వ్యాప్కోస్‌కు అప్పగించినట్లు సుధాకర్‌రెడ్డి కమిషన్‌కు తెలిపారు. తనిఖీలు లేకుండానే…

రాష్ట్ర‌ అభివృద్ధిలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి

ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్25 : రాష్ట్ర‌ అభివృద్ధిలో ప్ర‌తిఒక్క‌రూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, గవర్నర్ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ప్రముఖులు, కళాకారులు రచయితలు, క్రీడాకారులతో గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ ముఖాముఖి స‌మావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా ప్రాముఖ్యత‌, సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివ‌రించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య లాగే తాను పర్యావరణ వేత్తగా తన కెరీర్ ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన మన అందరిలో ఉండాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్ చాలా బాగుందని, కొత్తగూడెం జిల్లాలో పాఠశాలల్లో మెడిసినల్ మొక్కలు పెంచుతున్నారని, ఖమ్మం జిల్లాలోను ఇది అమలు చేయాలని గవర్నర్ సూచించారు. ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందని, సార్ నాథ్ లాగా బౌద్ద స్థూపం అభివృద్ధి కావాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ టూర్ చాలా బాగున్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలతో పిల్లలు పాఠ్య పుస్తకాల కంటే మెరుగ్గా నేర్చుకుంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ఎడ్యుకేషన్ టూర్ నిర్వహించాలని గవర్నర్ సూచించారు. ప్రకృతి విపత్తులను మ‌నం ఆపలేమని, విపత్తుల సమయంలో ప్రాణ నష్టం జ‌ర‌గ‌కుండా ప్రజలకు చేపట్టిన పునరావాస చర్యలు, బాధితుల‌కు పరిహారం అందజేసి ఆదుకున్న విధానం అభినందనీయమని గవర్నర్ కొనియాడారు. వ‌ర‌ద‌ల్లో ప్రజలు కోల్పోయిన‌ ఆధార్ కార్డు, పాన్ కార్డు, చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను అందించేందుకు క్యాంప్ లు నిర్వహించ‌డంపై పట్ల కలెక్టర్ ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో యువకులైన కలెక్టర్లు ఉండటం అదృష్టమని, వారి నాయకత్వంలో జిల్లాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని అన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు అధికంగా ఉన్న‌ డెంగ్యూ, అనిమియా కేసులను తగ్గించామన్నారు. జిల్లా ఖమ్మం ద‌వాఖానాలో ఉచిత‌ వైద్య పరీక్షలకు డయాగ్నొస్టిక్ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శాంపిల్స్ కలెక్షన్ కోసం పీహెచ్‌సీల వద్ద సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్జికల్ క్యాన్సర్ ముందుగానే గుర్తించి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు. జిల్లాలో 1512 ప్రభుత్వ పాఠశాలల్లో 1,53,967 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 31 కోట్లతో పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్ఫూర్తితో మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో 20 వేల మంది మహిళా సంఘాల సభ్యులతో ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో రాబోయే మూడేళ్ల‌లో మిర్చి సాగు విస్తరణకు, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మిర్చి చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికంగా ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ పామ్ సాగవుతోంద‌ని అన్నారు. వనజీవి రామయ్య మాట్లాడుతూ చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం లభించే విధంగా ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కలు పెంచుతున్నామని అన్నారు. నంది అవార్డు గ్రహీత కవి దేవేంద్ర మాట్లాడుతూ బాల కార్మికులపై రాసిన గీతానికి నంది అవార్డు 2003 సంవత్సరంలో లభించిందని తెలిపారు. సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా కళాకారుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న నాటక రంగ సంస్థలకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చంద్రమోహన్ మాట్లాడుతూ,1870 వరద ప్రభావిత కుటుంబాలకు గవర్నర్ అందించిన నిధులతో సహాయం అందించామని అన్నారు. అనంతరం అంతర్జాతీయ క్రీడాకారిణీ పవిత్రా చారీ, అంతర్జాతీయ సెయిలర్ పి. అఖిల్, స్టేజీ ఆర్టిస్ట్ తాటి కొండల నరసింహా రావు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు కవి ప్రసెన్ సాహిత్య, సీనియర్ ఆర్టిస్ట్ ఎన్. రవి, కవి మువ్వా శ్రీనివాస రావు, వ్యాఖ్యాత, తెలుగు టెక్స్ట్ బుక్ రచయిత కన్నెగంటి వెంకటయ్య, కవి, ఫైవెర్ అప్ ఫ్రంట్ అవార్డు గ్రహీత ఇబ్రహీం నిర్గున్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పీసర ప్రభాకరరెడ్డి, సీనియర్ డ్యాన్స్ మాస్టర్ ఆచార్య ఎస్. మాధవరావు లతో గవర్నర్ కు తాము సంబంధిత రంగాల్లో అందిస్తున్న సేవల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిఇఓ సోమశేఖర శర్మ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ లో అధికారులు ప్ర‌ముఖుల‌తో ముఖాముఖి ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్25 : రాష్ట్ర‌ అభివృద్ధిలో ప్ర‌తిఒక్క‌రూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, గవర్నర్ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ బుర్ర…

రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా కోసం దరఖాస్తు చేసుకోవాలి

విదేశాల్లో 28 మంది జగిత్యాల జిల్లా వాసులు మృతి? జగిత్యాల జిల్లాకు రూ.1.40 కోట్లు కేటాయించిన ప్రభుత్వం   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 25:  గ‌ల్ఫ్ బాధితులు రూ.5ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా కోసం జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్ట‌ర్‌ బిఎం వినోద్ కుమార్, కాంగ్రెస్‌ ఎన్నారై సెల్ కన్వీనర్…

ఎలాంటి బాంబులకైనా భయపడేది లేదు..

KTR's response to Ponguleti's comments

పొంగులేటి వ్యాఖ్యలపై కెటిఆర్‌ ‌స్పందన ‌దీపావళికి ముందే బాంబులు పేలుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవ్వరూ దీనికి భయపడరని అన్నారు. అయన పై జరిగిన ఈడీ రైట్స్ ‌కావచ్చని ఎద్దేవా చేశారు. లేదా సీఎం రేవంత్‌ ‌రెడ్డి బావమర్దికి సంబంధించిన కేసులు కావన్నారు. ఎం చేస్తారో చేసుకోండని చెప్పారు. ఈ చిట్టి నాయుడు…