Category శీర్షికలు

పౌర నమోదు వల్ల ప్రయోజనం ఎంత?

పౌరనమోదు వ్యవస్థ భారతదేశంలో అందుబాటు లోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరుల అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. అనేక మంది ఎలాంటి…

చట్టాలంటే భయం లేదు!

మనదేశంలో చట్టాలంటే భయం లేదు. శిక్షలు పడతాయన్న భీతి కూడా లేదు. తప్పులు చేసినా.. తప్పించు కోవొచ్చన్న ధీమా ఉండడమే ఇందుకు కారణం. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరిదీ ఇదే భావన. కోర్టుల్లో కేసులు వేయడం..ఏళ్లతరబడి వాయిదాలు వేయడం చూస్తున్నారు. ఏ కేసులో కూడా గట్టిగా శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. గడ్డి…

ఎన్డీఏ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.…

తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేనా..?

సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఈ ఐదుగురు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేలా చూడాలి. ఎపికి చెందిన టిడిపి మంత్రులు ఎపి సమస్యలపై నిలదీసేందుకు వెనకాడక పోవొచ్చు. అలాగే సమస్యలు ప్రస్తావిస్తామని,…

పులుల సంరక్షణ చర్యలు ఫలితాలిస్తున్నాయా!?

ఇటీవల దేశంలోని పులుల సంఖ్య ముప్పయి శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి…

మామ ఒడిలో మనిషి!

చందమామరావే…జాబిల్లి రావే…కొండెక్కి రావే…గోగి పూలు తేవే….ఇవన్నీ చిన్నప్పుడు మనం అందరం అమ్మ నోటి నుండి విన్నాం. అయితే నిజంగా చందమామ రాదు. మనమే అక్కడకు వెళ్ళాలి. 1969 వరకూ ఇది ఒక స్వప్నం. కల నిజమైన వేళ : ‘‘మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు’’ చంద్రుని మీద కాలుమోపిన తర్వాత…

అదేంటో….నేను!

దురదృష్టాన్ని దూరం చేయలేకపోయినా అదృష్టాన్ని  ఊహిస్తూ బ్రతికేస్తున్నా! అదేంటో… నేను! నిజాన్ని చెప్పే దైర్యం రాకపోయినా అబద్ధాన్ని నమ్మే  స్థైర్యం అలవర్చుకున్నా! అదేంటో….నేను! వాస్తవంలో యాంత్రిక జీవనమైనా కలల్లో రంగుల ప్రపంచమే కనుగొన్నా! అదేంటో….నేను! లోకానికి నేను ఏమీ పట్టక పోయినా ప్రపంచానికి నేనే రాజని అనుకుంటున్నా! అదేంటో…నేను! ఎవ్వరికీ ఏమీ కాకపోయినా ఎవరో ఒకరికి…

ఆకు ఆదర్శం

రాలిపోయె ఆకు కు చెట్టుకు పేగు ఋణాను బంధం పచ్చదనపు పర్వం తో ఋతువు లలో ఊగి తూగి ఇతరుల సంతోషం తన సంతోషంగా తన అమ్మచెట్టును ఆనందం లో తడిపి తను నేల రాలి పోదా… బతికింది పన్నెండు మాసలే బలే బాగ బతుకు తుంది బలే బాగ రాలి పోతుంది… పుట్టక నుండి…

కథ క్లైమాక్స్ దాటిందని.. !

రేపు వుంటుందో..రేపు వుంటానో అనే భయాంధకారంలో దేశం రాజధాని నడిబొడ్డున పొగమంచులో మనమంతా బ్రతకడమెంటీ? మన ఆలోచనలు కాంతి వేగంతో ఆధునిక సాంకేతిక రూపంతో జాబిల్లి పై జాతర చేస్తుంటే అవనిపై ఆక్సిజన్ అందక ఆయువుదీపాలు ఆరిపోవడమెంటీ? భౌతిక దూరమే బ్రతుకు శాస్త్ర నియమంగా పాటిస్తూ కనిపించకుండా మాస్క్ లో మనల్ని దాచుకోవడమెంటీ? రుతుపవనాల గమనాల…