ఆ నేనే ఈ నేను

నీ నీడలో నే నిస్సత్తువగా కొడిగట్టిన సామర్థ్యంతో మిణుకు మిణుకుమనే దీపంలా బంగారు పంజరంలో గాజు బొమ్మలా… నా ప్రతిభకు సంకెళ్లు పడ్డాయి నా స్వరం మూగబోయింది, బంధనాల బందీనై కట్టుబాట్ల భారంతో నే వంగిపోతున్నా నే పాతాళం లోకి కుంగి పోతున్నా నా లోపల్లోపల కాగే ఆలోచనల సలసల పెరుగుతూ బలానికి, ధైర్యానికి సరిహద్దులు…








