మార్చిలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఏడాది పొడవునా చదివిన విద్యా ర్థులకు, వారి భవి ష్యత్తు మీద కొండంత ఆశ పెట్టు కున్న తల్లిదం డ్రులకు కీలక సమ యం ఆస న్నమైంది. రాసే పరీక్షలు విద్యా ర్థుల భవితవ్యాన్ని తేల్చ నున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. కొంత మేరకు ఒత్తిడి కూడా ఉపయోగ పడుతుంది. అయితే ఎట్టి పరిస్థితులలో అనవసరమైన ఒత్తిడికి గురి కాకూడదు. పరీక్షల సన్నద్ధత సమ యంలో కొన్ని మెళకువలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఇప్పటికే చాలా పాఠశాలల్లో సిలబస్ పూర్తయినందున 80 శాతం సమయం పునఃశ్చరణకు, మిగిలిన 20 శాతం సమయం కొత్త అంశాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రోజంతా ఒకే సబ్జెక్టును చదవకుండా వివిధ సబ్జెక్టులు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది విద్యార్థులు గ్రూపు సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ లాంగ్వేజెస్ నిర్లక్ష్యం చేస్తారు.అలాకాకుండా రెంటికి సమ ప్రాధాన్యం ఉండేట్టు చూసుకోవాలి.
పరీక్షల సమయంలో ఆహారము, నిద్ర, వ్యాయామానికి తగిన పాధాన్యతనిస్తుండాలి. ప్రతిరోజు ఒకే సమ యానికి పోషక విలు వలు కలిగిన ఆహారం తీసుకోవడం అలవాటు చేసు కోవాలి. జంక్ ఫుడ్‌కు దూ రంగా ఉం డాలి. తాజాపండ్లు, డ్రై ఫ్రూట్స్, పాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిద్రకు ఖచ్చితంగా 7 నుంచి 8 గంటల సమయం కేటాయించాలి. ఒక గంట సమయం చదివిన తరువాత మెదడుకు 5 నిమిషాలు విరామం ఇవ్వడం ద్వారా తిరిగి ఉత్సాహంతో చదవగలుగుతారు . కొద్దిసేపు సూర్యకాంతిలో నడక, పచ్చని మొక్కల మధ్య నడవడం లాంటివి చేయాలి. టీవీ,మొబైల్స్, సోషల్ మీడియాకు కొంత కాలం దూరంగా ఉండాలి.
సిలబస్ ఎక్కువగా ఉన్న సబ్జెక్టు తో పాటు గణితం, ఇంగ్లీష్ లపై విద్యార్థులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. పరీక్షల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల మీద ఆధార పడకూడదు. ఒకరితో పోల్చుకుంటూ చదవడం అసలు చేయరాదు. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను నోటు పుస్తకంలో రాసుకోవాలి. పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు టిక్ చేసుకుంటూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి సబ్జెక్టుకు కనీసం 5 మోడల్ ప్రశ్నపత్రాలను ప్రిపేర్ కావడం చేయాలి. ఒంటరిగా చదవడం కంటే ఇద్దరు ముగ్గురు బృందంగా చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
సందేహాలనుఉపాధ్యాయులు, తోటి స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. బొమ్మలు, మ్యాపుల ద్వారా ఎక్కువ మార్కులు పొందవచ్చు. అదే విధంగా వర్తమాన విషయాలపై కూడా అవగాహన కల్గి ఉండాలి.ఈ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు రాస్తే మంచి మార్కులు పొందవచ్చు. అదే విధంగా అనవసరమైన ఆకర్షణలకు దూరంగా ఉండాలి.వివాదాలకు దూరంగా ఉండాలి.పరీక్షా కేంద్రాల గురించి ముందే తగిన సమాచారం తీసుకోవాలి. ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా వుండాలి.పరీక్ష అంటే జీవితానికి అగ్ని పరీక్ష కాదు. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని నిరుత్సాహ పడకుండా మన ప్రయత్నాన్ని కొనసాగించాలి.
చెన్న మాధవుని రామరాజు
విశ్రాంత మండల విద్యాధికారి రెగ్యులర్
9441967100





