దీప్తి సిర్ల
తెలుగుసాహిత్యంలో ఎల్జీబీటీక్యూ అంశాలపై రచనలు చాలా తక్కువ. ఈ విషయంలో రచయితలు, పాఠకుల అవగాహనస్థాయి దాదాపు ఒకేలా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే, ఎల్జీబీటీక్యూ సమూహాలతో పరిచయం, సంభాషణ రెండూ లేకపోవడం వల్ల వారి అనుభవాలు సాహిత్యంలో ప్రతిబింబించలేదు. కులవివక్ష, పేదరికం, లింగ ఆధారిత హింస వంటి అంశాలపై సాహిత్యం వచ్చినా, ఎల్జీబీటీక్యూ వ్యక్తులు కూడా మార్జినలైజేషన్ ఎదుర్కొంటారనే విషయం గతంలో రచయితలు పెద్దగా గుర్తించలేదు.
క్వీర్నెస్ ని కేవలం జెండర్, లైంగికతకు పరిమితం చేసిచూడటం, పితృస్వామ్య సమాజంలో జెండర్ అవగాహన లోపించడం, సమలైంగికత్వం చట్టవిరుద్ధంగా ఉండటం వంటి కారణాలు దీనికి ఆటంకాలు. ఎవరైనా రాసినా ఆ రచనలను “బోల్డ్” లేదా “వివాదాస్పదం” లేబుల్స్‌తో చూడటం వల్ల అవి ప్రధానస్రవంతి సాహిత్యంలో ఇంకా చోటు సంపాదించలేదు. సినిమాలు, ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ అంశాలపై కొంత పురోగతి కనిపిస్తున్నా, సమాజంలో స్టిగ్మా ఇంకా తొలగలేదు.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల