మోదీ నుంచి తాజాగా ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్టన్ వరకూ ఆర్ఎస్‌ఎస్ బ్యాగ్ గ్రౌండ్ ఉంది..ప్రత్యేక్షంగా సంబంధాలున్నాయి.ప్రధాని మోదీ వయస్సుపై ఆర్ఎస్‌ఎస్ చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం సృష్టించాయి.ఏకంగా ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వెళ్లాల్సిన పరిస్థితి వొచ్చింది.చివరికి పంద్రాగస్ట్ రోజున ఎర్రకోట వేదికపై నుంచి ఆర్ఎస్‌ఎస్‌ను ప్రధాని మోదీ కీర్తించాడంటే ఆ సంస్థ ప్రభావం అటు ప్రభుత్వంలో ఇటు సమాజంలో ఎంత ప్రభావితం చేస్తూ ప్రజల్లో పాతుకుపోతుందో అర్ధం చేసుకోవచ్చు.
బీజేపీ రాజకీయ వ్యూహాలు అంత ఈజీగా అంతుపట్టవు..పార్టీ పదవుల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వరకూ అన్నింట్లోనూ కాషాయ పార్టీ నిర్ణయాలు అనుహ్యంగానే ఉంటాయి..ఎవ్వరి అంచనాలకు అందకుండా ఎంపికలుంటాయి..పార్టీ పదవులే కాదు..సీఎం, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా, రాజ్యాంగ పదవుల ఎంపికలో ఆశ్చర్యకమైన నిర్ణయాలే ఉంటాయి.
బీజేపీ ఏది చేసిన..ఏ ఎంపికలు చేసిన అందులో రెండు వైపుల పదునున్న కత్తిలా వ్యూహాలుంటాయి..పార్టీ విస్తరణ..మత రాజకీయాలను రైలు పట్టల్లా ఉంటాయి..ఏ కాలంలో అధికారం అండతో పార్టీని మతాన్ని గ్రౌండ్‌లోకి తీసుకువెళ్లుతుంది.ప్రత్యార్థి పార్టీలను నిర్వీర్యం చేయడం..మతం పేరుతో ప్రజలను విభజించి, వోట్ల పోలరైజేషన్ చేయడమే బీజేపీ స్ట్రాటజీ..రెండు సీట్ల నుంచి 200కు పైగా సీట్లకు చేరడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే.
2014లో అనూహ్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి రేస్‌లోకి మోది తెరపైకి వచ్చారు.అప్పటి నుంచి ఆ పరంపర కొనసాగుతుంది.వార్డ్ నెంబర్ నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్‌ఎస్ చెప్పిందే ఫైనల్..బీజేపీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలాన్న నాగ్ పూర్ నుంచి ఆదేశాలు రావాల్సిందే.తెరపైకి ఎవ్వరికి తీసుకురావాలన్న వారికి తెరవెనుక ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ సిద్దం చేసింది.అంతేకాదు,కీలక పదవుల్లో ఆర్ఎస్ఎస్‌లో పని చేసిన అనుభవం ఉండాల్సిందే.వారికే బీజేపీలో పదవులు దక్కుతాయి.
మోదీ నుంచి తాజాగా ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్టన్ వరకూ ఆర్ఎస్‌ఎస్ బ్యాగ్ గ్రౌండ్ ఉంది..ప్రత్యేక్షంగా సంబంధాలున్నాయి.ప్రధాని మోదీ వయస్సుపై ఆర్ఎస్‌ఎస్ చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం సృష్టించాయి.ఏకంగా ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వెళ్లాల్సిన పరిస్థితి వొచ్చింది.చివరికి పంద్రాగస్ట్ రోజున ఎర్రకోట వేదికపై నుంచి ఆర్ఎస్‌ఎస్‌ను ప్రధాని మోదీ కీర్తించాడంటే ఆ సంస్థ ప్రభావం అటు ప్రభుత్వంలో ఇటు సమాజంలో ఎంత ప్రభావితం చేస్తూ ప్రజల్లో పాతుకుపోతుందో అర్ధం చేసుకోవచ్చు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖండ్ ఊహించని రాజీనామా తర్వాత కొత్త ఉపరాష్ట్రపతి ఎంపికపై అనేక ఊహగానాలు వచ్చాయి.చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి.కేంద్రంలో కీలక మంత్రి పదవుల్లో ఉన్న వారి పేర్లు వినిపించాయి.కానీ సంఘ్ ఆదేశాలతో అనుహ్యంగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్టన్ పేరు తెరపైకి బీజేపీ తీసుకువచ్చింది.సీపీ రాధాకృష్టన్‌నుకు బలమైన సంఘ్ నేపథ్యం ఉంది.ఆర్ఎస్‌ఎస్ అగ్రనేతల ఆశ్వీర్వాదాలున్నాయి.సంఘ్‌లో పలు స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించారు.ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తెరపైకి తీసుకువచ్చింది . బీజేపీ,ఆర్ఎస్ఎస్ ఎవరిని తెరపైకి తీసుకురావాలన్న తాత్కాలిక ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యంలో తీసుకువస్తాయి.ఎక్కడ సంఘ్, బీజేపీ బలహీనంగా ఉందో అక్కడ బలపడే ఉద్దేశ్యంతో పార్టీ పదవులైనా, సంఘ్ పదవులైనా అస్త్రంగా ఎంచుకుంటుంది.
తాజాగా ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణణన్‌ను తెరపైకి తీసుకురావడంతో బీజేపీ దాని మాతృసంస్థ సంఘ్ దీర్ఘకాలిక లక్ష్యాన్ని పెట్టుకుంది..2047కు దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుంది.ఆలోపు దేశాన్ని లౌకికదేశం నుంచి మత రాజ్యంగా మార్చే ప్రయత్నాలు గత దశబ్దాకాలంగా వేగంగా సంఘ్ పని చేస్తుంది.మతానికి అధికారం తోడవ్వడంతో వ్యూహాలకు పదును పెట్టుతుంది.నూతన విద్యా పాలసీ,వన్ నేషన్ వన్ ఎలక్షన్..NRC, CAA వంటి చట్టాలతోపాటు రాజ్యాంగంలో మత రాజ్యానికి అడ్డుగా ఉన్న అన్ని చట్టాలను సవరణ గత 10 ఏళ్లుగా బీజేపీ చేస్తుంది.చట్టాలే కాదు.చట్టాల పేర్లు, ఆర్మీ ఆపరేషన్లు ఇలా అన్నింటిని మతంతో లింకుపెట్టతుంది.
ఉత్తరాదిలో సంఘ్ పాతుకుపోతుంది.ఇప్పుడిప్పుడే సౌత్‌లో పాతుకుపోయే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.మతం రాజకీయాలతో పాటు మతం పునాదుల మీద బలంగా నిలబడ్డ బీజేపీ ఉత్తరాదిలో అధికార గుత్తాధిపత్యం సాధించింది.నార్త్‌లో కాషాయ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది.అయితే సౌత్‌లో బీజేపీ ఎంట్రీ ఏళ్ల తరబడి సాధ్యం కావడం లేదు.ఎన్ని ప్రయత్నాలు చేసిన సంఘ్ దక్షిణాదిలో పుంజుకోవడం లేదు.సౌత్ రాష్ట్రాలు సంఘ్ అఖండ భారత్,మత రాజ్యా లక్ష్యానికి కొరకరాని కొయ్యాగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన సంఘ్ ముఖ్యనేత,బీజేపీలో కీలక లీడర్‌గా ఉండి.ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్న సీపీ రాధాకృష్టాణన్‌ను తెరపైకి తీసుకువచ్చింది.దీంతో సౌత్‌లో ఎంట్రీలో భాగంగా బీజేపీ మరో అడుగు వేసింది.సీపీ రాధాకృష్ణన్ బీజేపీకి సౌత్‌లో కీలక నేత.తమిళనాడులో బీజేపీకి బలమైన లీడర్.2003–2006 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు.అద్వానీ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 93 రోజులు రథయాత్ర చేశారు.దాదాపు అన్ని నియోజకవర్గంలో 19 వేల కి.మీ రథయాత్ర చేశారు.
సీపీ రాధాకృష్ణన్ కోయంబత్తురూలో జన్మించడం,రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే కమ్యూనిటీలో పుట్టడం,డీఎంకే, ఏఐడీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీలున్న రెండు సార్లు ఎంపీగా గెలిచి తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. అంతేకాదు,సీపీ రాధాకృష్ణన్‌ను తమిళనాడు మోదీ గా పిలుచుకుంటారు. ఎప్పటి నుంచో తమిళనాడులో అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి సీపీ రాధాకృష్ణన్ ఆయుధంగా మార్చుకుంది.తమిళనాడులో ఆయనకున్న పలుకుబడికి అధికారం,పదవిని జోడించి వచ్చే ఎన్నికల్లో బలపడే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి అక్కడ రాజకీయ లబ్దిపొందాలని చూస్తుంది.తమిళనాడు పార్టీలు కూడా సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే అవకాశం తక్కువే .దీంతో గెలుపుకు నల్లేరు మీద నడకే అవుతుంది. 2029 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ సీపీ రాధాకృష్ణన్‌ను రంగంలోకి దింపింది..సౌత్‌లో రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో పాటు మరోసారి కేంద్రంలో పవర్ నిలుపుకునేందుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంది.ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలపై పట్టున్న సీపీ రాధాకృష్ణకు ఉపరాష్ట్రపతి పదవి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.
ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం గవర్నర్ వ్యవస్థను అస్త్రంగా మార్చుకుంది.చాలా రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకుని కుట్ర రాజకీయలు చేసింది.సీపీ రాధాకృష్ణపై కూడా ఆరోణలున్నాయి.మహారాష్ట్రలో శివసేన, ఎన్సీసీ చీల్చడంలో పాటు కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి సహకరించారని ఆరోపణలున్నాయి.అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ, పుదుచ్చేరికి ఇంచార్జ్ గవర్నర్‌గా పని చేశారు.అంతకుముందు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో సౌత్‌లో బీజేపీ బలం పెంచుకుంది.కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.సీపీ రాధాకృష్ణన్ రాజకీయ నేపథ్యాన్ని గమనించినట్లైతే.సౌత్‌పై ఆధిపత్యం కోసమే బీజేపీ తెరపైకి తీసుకువచ్చిందని స్పష్టం అవుతుంది.
అంతేకాదు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ బద్దమైన అన్ని అడ్డంకులను బీజేపీ ఒక్కొక్కటి అధికమిస్తుంది. 2029లో జమిలి ఎన్నికలతో పాటు పాటు సౌత్ రాష్ట్రాలే టార్గెట్ గా జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్న రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతి చేయడంతో భవిష్యత్‌లో తమ పని సులువైతుందన్న అభిప్రాయంలో బీజేపీ ఉంది. తమిళనాడులో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా.2029 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రంలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది.తమిళనాడు నుంచి, సౌత్ నుంచి అబ్దుల్ కలాం తర్వాత మళ్లీ సీపీ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే అని ప్రచారం చేసుకునే ప్రయత్నం కాషాయ పార్టీ చేస్తుంది.
ఏది ఏమైనా సౌత్‌లో అధికారం కోసం బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది.ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక్షంగా పరోక్షంగా కూటములు కట్టుతుంది.కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ కావడం లేదు.ఇప్పుడు సీపీ రాధాకృష్ణన్ ఆస్త్రం పని చేస్తుందో లేదో వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు నిరూపిస్తాయి. అంతేకాదు బీజేపీ తీసుకువచ్చిన ఉప రాష్ట్రపతులందరూ అవమానకర రీతిలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. వెంకయ్య నాయుడి నుంచి నిన్నటి ధన్ ఖడ్ వరకూ అదే జరిగింది.సీపీ రాధాకృష్ణన్ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందా.లేక రాష్ట్రపతిని చేసి సౌత్‌లో బలం పుంజుకునే ప్రయత్నం చేస్తుందా..2027 తర్వాత స్పష్టత వస్తుంది..అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన సౌత్ లో అధికారంలోకి రావడం కత్తిమీద సామే కాదు..అసాధ్యం కూడా.
–తోటకూర రమేష్





