“తమిళ పార్టీలన్నీ, ప్రజలందరూ ఏకమైన తమ భాషా అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. తెలంగాణ, కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం హిందీని బీజేపీ బలవంతంగా రుద్దే కుట్రలపై మౌనంగా ఉంటున్నాయి. కనీసం కేంద్రం తీరును ఖండించడం లేదు. తమిళనాడు, మరాఠలు చేస్తున్న పోరాటంతో కళ్లు తెరవడం లేదు..భాషా, ఆత్మగౌరవంతోనే తెలంగాణ ఏర్పడిందన్న అవగాహన లేకుండా,. తెలంగాణ అస్థిత్వం పై భాషా పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు.కర్ణాటకలో హిందీ భాషా ఆధిపత్యంతో కన్నడ అస్థిత్వం ప్రమాదంలో పడుతున్న స్పృహ లేకుండా వ్యహరిస్తున్నారు. ఇక ఏపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే వరకూ హిందీ భాషాపై, కేంద్రంపై ఊగిపోయినా పవన్ , అధికారంలోకి రాగనే కొత్త రాగం ఎత్తుకున్నారు.తెలుగు అమ్మ భాషా, హిందీ పెద్దమ్మ భాషా అంటూ సినిమా డైలాగ్స్ కొట్టుతున్నారు..అమ్మ భాషను ఉత్తరాది రాష్ట్రాలు నేర్చుకోనప్పుడు పెద్దమ్మ భాషాను తెలుగు ప్రజలు ఎందుకు నేర్చుకోవాలన్న ప్రశ్నిసమాధానం ఇవ్వడం లేదు.”
వన్ నేషన్, ఒకే భాషా దేశం లక్ష్యాన్ని చేరకునేందుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంది. 2047లోపు టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు పదేళ్లుగా ప్రజలను అటు వైను నడిపించేందుకు పాలన పరమైన నిర్ణయాలు తీసుకుంటుంది..ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే భాషా చివరి అఖండ భారత్ అన్న హిడెన్ ఎజెండాతో ముందుకు కాషాయ పార్టీ సాగుతుంది.అందుకోసం దేశ ప్రజలను మానిసికంగా సిద్దం చేస్తుంది. వన్ నేషన్ వన్ టాక్స్ తో రాష్ట్రాల ఆర్థిక అధికారాలు హరించింది..రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చి, లౌకికవాదాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది..దేశాన్ని మత దేశంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంది..యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ ఆర్ సీ , సీఏఏ వంటి చట్టాలను తీసుకువచ్చింది.వోటర్ల సవరణ పేరుతో కోట్లాది మంది వోటు హక్కును రద్దు చేసి ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే కుట్రలు కాషాయ పార్టీ చేస్తుంది.
ప్రపంచం టెక్నాలజీతో వేగంగా దూకుపోతు గ్లోబల్ విలేజ్‌గా మారింది.మనిషి ఏకంగా స్పెస్‌కు ఎర్త్‌కు అప్ ఆండ్ డౌన్ చేసే స్థాయికి సాంకేతికత వచ్చింది.కానీ, ఇండియాలో కాషాయ పార్టీ హిందీ భాషాను ప్రజలపై రుద్దుతూ వారి ఆలోచన విధానాలు ఎదగకుండా..బావిలో కప్పలో ఉండేలా చేస్తున్నారు..ప్రపంచ జ్ఞానాన్ని సంపాందించేందుకు ఏ భాషానైనా నేర్చుకోవచ్చు..విజ్ఞానికి, జ్ఞానానికి హద్దులు, ఎల్లలు లేనట్లే నేర్చుకోవడానికి కూడా హద్దులు, ఎల్లలుండవు. భాషా మనిషిని పరిపూర్ణ మానవునిగా మార్చుతుంది..భాషా మనిషిని చైతన్యవంతం చేస్తుంది..భాషా అస్థిత్వాన్ని గుర్తిస్తుంది, ఆధిపత్యాన్ని ధిక్కరిస్తుంది.అదే సమయంలో భాషా ఇతరులపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.అంతేకాదు భాషా ప్రాంతీయవాదాన్ని బలపర్చుతుంది. జాతీయవాదాన్ని బలోపేతం చేస్తుంది.దేశం రాష్ట్ర సమాఖ్య..రాష్ట్రాలు తెగలు, అనేక జాతుల సమాఖ్య.భిన్న జాతలు, భిన్న తెగలు, భిన్న భాషాల సమాగ్ర రూపం భారత్..భిన్నభాషల సమ్మిళితం భారత్..రాజ్యాంగంలో 22 అధికార భాషలను కేంద్రం గుర్తింపు పొందిన భాషాలున్నాయి.హిందీకి ప్రత్యేక గుర్తింపు ఏదీ లేదు.
దేశాలు అభివృద్ది చెందేందుకు మాతృ భాషాతో పాటు అవసరమైన అన్ని భాషాలు నేర్చుకుంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన భాషాను నేర్చుకోవాలని ఎంకరేజ్ చేస్తున్నాయి..కానీ, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను NEPతో కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజలపై భాషా యుద్దాన్ని ప్రకటించింది.ఖచ్చింతంగా హిందీ నేర్చుకోవాలని, హిందీ తప్పని సరిగా అమలు చేయాలని రాష్ట్రలపై ఒత్తిడి చేస్తుంది.హిందీని కంపల్‌సరిగా అమలు చేయాలని,లేకపోతే కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావని, మిడ్ డే మీల్స్, సర్వశిక్ష అభియాన్ సహా కేంద్ర పథకాల్లో వచ్చే నిధుల్లో కోత విధిస్తామని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తుంది..
ఒకే దేశం, ఒకే భాషా, ఒకే ఎన్నికతో పాటు ఒకే అధ్యక్షుడు అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ అడుగులు వేస్తుంది..వన్ నేషన్ వన్ టాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో రాష్ట్రాల రాజకీయ , ఆర్ధిక హక్కులను కేంద్రం హరిస్తుంది.రాష్ట్రాల అధికారాలను గుప్పిట్లో పెట్టకున్న కేంద్రం. సౌత్ రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం కులం, మతంతో పాటు భాషాను బీజేపీ అస్త్రంగా మార్చకుంటుంది.సౌత్‌పై భాషా యుద్దానికి దిగింది.అధికారాలను కేంద్రీకరించి దక్షిణాది రాష్ట్రాలపై భాషా కత్తిని వేలాడదీస్తుంది. వాస్తవానికి ఉత్తరాదితో పోల్చితే సౌత్ రాష్ట్రాల్లో భాషా ,సంస్కృతిక,.మతోద్యమాలు వచ్చాయి.ఉత్తరాది సంస్కృతికి, దక్షిణాది సంస్కృతి విభిన్నం అని నిరూపించాయి..ఏకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పడ్డాయి..ఆ భాషా, సంస్కృతిక ఉద్యమాలే దేశంలో సౌత్ రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రత్యేక అస్థిత్వంగా నిలిపింది..అలాంటి అస్థిత్వంపై హిందీతో దాడి చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.
భాషా ఆధిపత్య అంటే ఒక రాజకీయ ఆధిపత్యమే..రాజకీయ ఆధిపత్యం భాషా పునాదుల్లో ఉంటుంది..భాషా తానంటానే ఒంటరిగా రాదు..భాషాతో పాటు దాని సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వస్తాయి..అవి ఇతర రాష్ట్రాల్లో, తెగల భాషాపై ,వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్కృతిపై ఆదిపత్యం చెలాయిస్తుంది..స్థానిక ప్రజల జీవితాను ప్రభావితం చేస్తుంది..పీడనకు అణిచివేతకు గురిచేస్తుంది. భాషాధిపత్యం భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీస్తుంది..స్థానిక ప్రజలను సంస్కృతినీని డామినెట్ చేస్తుంది. హిందీనీ బలవంతంగా ప్రజలపై రుద్దం వల్ల ప్రజల భాషా కనుమరగవుతుంది. అనేక ప్రాంతీయ మాతృ భాషాలు కాలగర్భంలో కలిసిపోతాయి.ఇప్పటికే ప్రపంచీకరణ వల్ల దేశంలో అనేక లోకల్ భాషాలు కనిపించడకుండా పోయాయి…ఇప్పుడు ఉత్తరాది హిందీ భాషా దేశం మొత్తం రుద్దడం వల్ల దేశ ప్రజల్లో కాస్తో కూస్తో అస్థిత్వంలో ఉన్న ప్రాంతీయ భాషాలు, వాటి పునాదుల మీద నిర్మితమైన రాష్ట్రాల ఉనికి ప్రశ్నార్థంగా మారుతాయి.
భారతదేశం సమాఖ్య వ్యవస్థ..లౌకిక దేశం..దేశంలో ఏ భాషాకు ప్రత్యేక ప్రధానత లేదు.ఏ భాషాను తక్కువ చేసి చూసే అవకాశం లేదు..దేశంలో అన్ని భాషాలు ఒక్కటే.ఇప్పుడు హిందీని దేశంపై రుద్దం వెనుక కాషాయ పార్టీ దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలున్నాయి. నియంతృత్వ దేశాల్లోగా భారత్‌లో కూడా ఒకే దేశం ,ఒకే భాషా విధానాన్ని తీసుకువచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థను అధ్యక్ష తరహా వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.హిందీని ఖచ్చింతంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలంటే అది ఖచ్చితంగా లౌకకివాదానికి విరుద్దమే..మత జాతీయవాద ముసుగులో సెక్యులరిజంపై భాషా పేరుతో దాడి చేయడమే అవుతుంది..ప్రజలు ఏ భాషా మాట్లాడాలన్నది వారి ఇష్టం..ఇది రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక హక్కు. అంతేకాదు రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చు చేసే కుట్రలో భాగమే హిందీ భాషాను నిర్భంధంగా అమలు చేయడం..సెక్యులర్ విధానాలు రద్దు చేసే కుట్రలో భాగంగా చూడాలి..ఎప్పడి నుంచో రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్నీ తొలగించేందుకు సంఘ్, కాషాయ పార్టీ ప్రయత్నం చేస్తుంది.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వన్ నేషన్ వన్ భాషా అమలు చేస్తుందన్న చర్చ ఉంది.
బీజేపీ ప్రజలపై హిందీ భాషాను రుద్దుతుంటే ఉత్తరాదిలో వోట్లు సీట్ల కోసం ఉత్తరాది పార్టీలు మౌనంగా ఉంటున్నాయి.అయితే సౌత్ లో తమిళనాడు, మరాఠ్వాడలో హిందీని వ్యతిరేకిస్తున్నాయి..హిందీ భాషాతో తమ అస్థిత్వంపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టుతున్నాయి. మహారాష్ట్రలో హిందీ భాషా వ్యతిరేకోద్యమాన్ని మరాఠ ప్రజలు ముమ్మరం చేశారు.తమిళులు ఎప్పటి నుంచో హిందీని, హిందీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు..గో బ్యాక్ హిందీ నినాదాన్ని దశాబద్దకాలంగా ఎత్తుకున్నారు.తమిళ పార్టీలన్నీ, ప్రజలందరూ ఏకమైన తమ భాషా అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. తెలంగాణ, కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం హిందీని బీజేపీ బలవంతంగా రుద్దే కుట్రలపై మౌనంగా ఉంటున్నాయి. కనీసం కేంద్రం తీరును ఖండించడం లేదు. తమిళనాడు, మరాఠలు చేస్తున్న పోరాటంతో కళ్లు తెరవడం లేదు..భాషా, ఆత్మగౌరవంతోనే తెలంగాణ ఏర్పడిందన్న అవగాహన లేకుండా,. తెలంగాణ అస్థిత్వం పై భాషా పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు.కర్ణాటకలో హిందీ భాషా ఆధిపత్యంతో కన్నడ అస్థిత్వం ప్రమాదంలో పడుతున్న స్పృహ లేకుండా వ్యహరిస్తున్నారు. ఇక ఏపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే వరకూ హిందీ భాషాపై, కేంద్రంపై ఊగిపోయినా పవన్ , అధికారంలోకి రాగనే కొత్త రాగం ఎత్తుకున్నారు.తెలుగు అమ్మ భాషా, హిందీ పెద్దమ్మ భాషా అంటూ సినిమా డైలాగ్స్ కొట్టుతున్నారు..అమ్మ భాషను ఉత్తరాది రాష్ట్రాలు నేర్చుకోనప్పుడు పెద్దమ్మ భాషాను తెలుగు ప్రజలు ఎందుకు నేర్చుకోవాలన్న ప్రశ్నిసమాధానం ఇవ్వడం లేదు.
అదే సమయంలో భాషా అస్థిత్వాలపై ఏర్పడిన తెలంగాణ వంటి రాష్ట్రాల ఉనికి ప్రమాదంలో పడేసే కుట్రలు కాషాయ పార్టీ చేస్తుంది.మహారాష్ట్రలో మరాఠీలు, తమిళనాడులో తమిళు లు హిందీభాషాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు పోరాటం చేయకపోతే తెలంగాణ అస్థిత్వం, తెలంగాణ యాస భాషా కాలగర్భంలో కలిసిపోయి ఉత్తరాది హిందీ భాషా, దాని సంస్కృతి తెలంగాణలో కోరలు చాస్తుంది..ఒక్క తెలంగాణలోనే కాదు భాషా, సంస్కృతి, అస్థిత్వ పునాదులపై ఏర్పడిన రాష్ట్రాల ఉనికి ప్రమాదంలో పడుతుంది.
-తోటకూర రమేష్





