క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బుధవారం భేటీ అయ్యారు. ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డిని గోపీచంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయమని కొనియాడారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి తనవంతు సహకారం అందిస్తానని పుల్లెల గోపీచంద్ హామీ ఇచ్చారు.



