prajatantra_news

prajatantra_news

బిఆర్‌ఎస్‌ ‌హయాంలో వేల ఫోన్ల ట్యాపింగ్‌

‌సిట్‌ ‌ముందు ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న వాంగ్మూలం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్‌ ‌పాలనలో వేల ఫోన్లు ట్యాప్‌ ‌చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ‌ఖూనీ చేసిండని ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న విమర్శించారు. గురువారం ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా తీన్మార్‌ ‌మల్లన్న స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డ్ ‌చేశారు. విచారణ…

ఓఎంసీకి శ్రీలక్ష్మి అనుమతి ఇచ్చారు : సీబీఐ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: పరిశ్రమల శాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి 2006 మే 17న బాధ్యతలు స్వీకరించాక ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి లీజు అనుమతులు లభించాయని సీబీఐ తెలంగాణ హైకోర్టులో వాదించింది. ఆ కేసులో 6వ నిందితురాలైన శ్రీలక్ష్మి లీజులను మంజూరు చేసేందుకు ముడుపులు డిమాండ్‌ చేశారని తెలిపింది. ఆమె దాఖలు చేసిన డిశ్చార్జి…

భారీ వర్షం.. నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్‌మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌…

ఇది చేత‌ల ప్ర‌భుత్వం

– ఇందిరా మహిళా శక్తి  ఆత్మవిశ్వాసానికి నిదర్శనం – రూ 4.85 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ – ఇందిరమ్మ పాలనలో  పేద ప్రజలకు భరోసా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం/ ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు సింగరేణి ఉన్నత…

కెసిఆర్‌ ‌కుటుంబం కడుపునిండా విషమే

– దిల్లీకి వెళ్లకుండా ఫామ్‌హౌజ్‌కు వెళ్లాలా – కేంద్రంతో చర్చించకుంటే సమస్యలకు పరిష్కారమెలా? – పక్క రాష్ట్ర సిఎంతో చర్చలు జ‌రిపితే త‌ప్పేంటి? – తుమ్మడిహట్టికోసం ‘మహా’ సిఎంతో మాట్లాడుతా – కేంద్రమంత్రికిషన్‌ ‌రెడ్డి ప్రణాళికతో రావాలి – మీడియాతో  సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై17: కేసీఆర్‌ ‌కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని…

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

– డబుల్‌ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వంలో మోసం – ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్‌ మెదక్‌, ప్రజాతంత్ర, జూలై17: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మెదక్‌లో గురువారం జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు…

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం భేటీ

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జులై 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రేవంత్‌ వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. సుమారు గంటసేపు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై…

హెచ్‌సీఏ అక్రమాలు.. కేటీఆర్‌, కవితపై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు

హైదరాబాద్‌, జులై 17: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు గురువారం సీఐడీ అధిపతి చారుసిన్హాను కలిసి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొంతమందిపై ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్‌, కవిత హస్తం ఉందని వారు ఆరోపించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌ రావు గెలిచిన వెంటనే…

మహిళల ఆర్థిక స్వావలంబనే మా లక్ష్యం

– ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే లింగ భేదం సమస్య నివారణ – స్వయం సహాయక సంఘాలతో 2,000 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి – లింగ సమానత్వం సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష సమస్య…

సనత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని సనత్‌నగర్‌ సమతనగర్‌లోని డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌ గోదాములో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆరు ఫైరింజన్లు, ఒక రోబోట్‌ సహాయంతో మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్‌ ప్లేట్స్‌, డిన్నర్‌ సెట్స్‌ ప్యాకింగ్‌ వస్తువులు ఉండడంతో అవి…