prajatantra_news

prajatantra_news

రాజకీయ నాయకుల భాష మారాలి

– అభివృద్ధ్దిని దెబ్బతీస్తున్న ఉచిత పథకాలు – మండలి చైర్మన్‌ గుత్తి సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 21: రాజకీయ నాయకులు మాట్లాడే భాషను వింటున్న ప్రజలు చీదరించు కుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకతీతంగా ప్రతి నాయకుడు…

హెచ్‌సిఎ అక్రమాల్లో కేటీఆర్‌, కవిత

తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ‌కార్యదర్శి గురువారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ప్రమేయముందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్‌ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని, చాలామంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా…

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే రికార్డు

– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: రేషన్‌ కార్డు అంటేనే ఆహార భద్రత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం…

పరిశ్రమల అవసరాలకనుగుణంగా శిక్షణ

–  ఏటీసీలపై సమీక్షలో సీఎం సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌(ఏటీసీ)ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై కార్మిక శాఖ…

కొత్తగా 681 మంది డయాలసిస్‌ పేషెంట్లకు పెన్షన్లు

మంజూరు ఫైల్‌ పై సంతకం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్‌ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం వారికి చేయూత పెన్షన్లు అందిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కొత్తగా గుర్తించిన 681 మందికి ‘సెర్ప్‌’ ద్వారా…

సూర్యాపేటలో జ్యువెల్లరీ షాపు లూటీ

18 కేజీల బంగారం అపహరణ? దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, జు 21 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ జువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. పట్టణంలో ఎంజి రోడ్డులోని సాయి సంతోషి నగల దుకాణంలో సుమారు 18 కేజీల బంగారాన్ని, లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. రోజుమాదిరిగానే యజమాని తెడ్ల కిశోర్‌…

సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సభలో విపక్షాలు ప్రస్తావించదలచిన అంశాలపై మాట్లాడేందుకు తనను అనుమతించడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులను మాట్లాడేందుకు అనుమితిస్తూ విపక్ష నేతగా ఉన్న తనను అనుమతించకపోవడం…

సానిక ఎన్నికల్లో మెజారిటీ మనదే

– రేవంత్‌కు పాలన చేతకాకే ఈ దుస్థితి – బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ ముఖ్య నాయకుల సమావేశంలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 21: స్థానిక ఎన్నికలపై సర్వే చేయిస్తే మొత్తం 31 జిల్లా పరిషత్‌లలో 16 నుంచి 18 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని తేలిందని, ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని మాజీ…

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడిరది, పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత నోటీస్‌ ఇస్తే ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చిద్దామని ప్రతిపక్షాలకు…

ఢాకాలో కుప్పకూలిన శిక్షణ విమానం

కళాశాల భవనంపై కూలడంతో ఒకరి మృతి ఢాకా, జులై 21: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఎఫ్‌`7 జెట్‌ ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో మైల్‌ స్టోన్‌ పాఠశాల, కళాశాల భవనంపై సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం…