prajatantra_news

prajatantra_news

రేవంత్‌లో అపరిచితుడు

– ఓసారి రెమో.. మరోసారి రామ్‌లా కనిపిస్తాడు – కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గొప్పలు – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాల్సిందే – లింగంపేట ఆత్మగర్జన సభలో కేటీఆర్‌ కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 25: సీఎం రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

ప్రధాని మోదీనే అవమానిస్తారా..

– పొన్నంనో, మహేశ్‌ గౌడ్‌నో సీఎం చేస్తారా – సీఎం వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25: రేవంత్‌ రెడ్డికి ఆస్కార్‌ అవార్డు కాదు.. భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి.. నోబెల్‌ ప్రైజ్‌ కాదు, గోబెల్స్‌ ప్రైజ్‌ ఇవ్వాలి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సెటైర్లు వేశారు. శుక్రవారం…

బెంగాల్‌ ‌తీరం దాటిన వాయుగుండం

నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25:  వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్‌ ‌తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చియ వాయువ్య దిశగా కదిలి ఉదయం బెంగాల్‌-‌బంగ్లా తీరాలను దాటిందని వాతావరణశాఖ తెలిపింది. సాగర్‌ ‌ద్వీపానికి 80 కిలోటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రాబోయే 24గంటల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ ‌దుగా వాయువ్య, పశ్చిమ దిశగా…

అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి

– ఎవరూ హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లొద్దు – ఆగస్టు మొదటి వారంలో పచ్చదనం స్పెషల్‌ డ్రైవ్‌ – పీఆర్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, జూలై 25: గ్రామాల్లో పచ్చదనం-స్వచ్ఛదనం పెంచేలా ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

–  స్వల్పంగా పెరిగే అవకాశం భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 25 : అల్పపీడనం కారణంగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న బారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం ఉదయం 6గంటలకు 21 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 26 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గత 15 రోజులు…

ఐదోరోజూ సాగని పార్లమెంట్‌

Parliament sessions

– విపక్షాల నిరసన – సోమవారానికి వాయిదా పడ్డ ఉభయ సభలు న్యూదిల్లీ, జూలై 25: పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు వరుసగా ఐదవరోజు శుక్రవారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. దీంతో సభ సోమవారానికి వాయిదా పడ్డాయి. బీహార్‌ ‌ప్రత్యేక వోటర్ల జాబితా ఎస్‌ఐఆర్‌ ‌పై ప్రతిపక్షాలు నిరసన చేపడుతుంటే..చర్చ జరిపేందుకు అనుమతిని ఇవ్వకుండా…

మామునూరు ఎయిర్‌పోర్టులో కదలిక

–  భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే భూములు కేటాయించలేదని ఆరోపణలు వచ్చాయి. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి…

రాజస్థాన్‌లో ఘోర దుర్ఘటన

– పాఠశాల కూలి ఏడురుగురు మృతి జయపుర,జూలై25:రాజస్థాన్‌  ‌లోని ఝాలవర్‌ ‌లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝాలవర్‌ ‌జిల్లా మనోహర్‌ ‌థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో…

అశ్లీల కంటెంట్‌ ‌యాప్‌లపై నిషేధం

– కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరిక న్యూదిల్లీ,జూలై25: అశ్లీల కంటెంట్‌ని ప్రసారం చేస్తున్న యాప్‌లపై కేంద్రం కొరడ ఝుళిపించింది. ఉల్లు, ఎఎల్‌టిటి సహా 24 యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. 24 యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ…

చిత్తశుద్ది ఉంటే బిసి బిల్లు ఆమోదింపచేయండి

–  బిజెపి నేతలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై25: బీజేపీ అగ్రకుల పార్టీ అని, బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఆ పార్టీ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆక్షేపించారు. బిసిలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే బిల్లును ఆమోదించేలా ఒత్తిడి తేవాలన్నారు. బిల్లును ఆమోదించాలని కేంద్రం, భాజపా…