prajatantra_news

prajatantra_news

యుద్ధప్రాతిపదికన రహదారుల పునరుద్ధరణ

– 1291 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు – మరమ్మతుల కోసం రూ.375 కోట్లు అవసరం – పంచాయతీరాజ్‌ నష్టంపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ విభాగానికి సంబంధించి దెబ్బతిన్న రహదారులు, భవనాలకు సంబంధించిన వివరాలను అధికారులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…

సభలు సజావుగా జరిగేలా చూడాలి

– అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలి – ఉన్నతాధికారులతో స్పీకర్‌ గడ్డం సమావేశం – రేపటినుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి(Assembly, Council) సమావేశాలు శనివారం నుండి ప్రారంభం కానున్న నేపధ్యంలో సభ నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో…

శభాష్‌ సీతక్క..

– జోరు వానలోనూ ముంపు ప్రాంతాల పరిశీలన – ప్రయాణంలోనూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్‌ – సహాయక చర్యలపై అధికారులకు కీలక సూచనలు – మంత్రి చొరవను మెచ్చుకుంటున్న కామారెడ్డి ప్రజలు కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారీ వర్షాలు కురుస్తున్న వేళ వెరవకుండా ప్రజలతోపాటు నిలబడి వారి బాధలు పంచుకునేందుకు కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి…

సీఎంను కలిసిన ఒవైసీ బ్రదర్స్‌

– ఉలాద్‌-ఉన్‌-నబీ జూలూస్‌కు అనుమతివ్వాలని వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) , ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ(ఒవైసీ బ్రదర్స్‌), మర్కజీ మిలాద్‌ జులూస్‌ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని (CM Revanth Reddy)ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా నగర పరిధిలోని పురాతన…

యూరియాపై ఫలిస్తున్న రాష్ట్రం ప్రయత్నాలు

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: కేంద్రం నుంచి జరగాల్సిన యూరియా సరఫరా గురించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో 21,325 మెట్రిక్‌ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకోనున్నదని వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.…

సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈమేరకు మరో ఏడు నెలలు అంటే 2026 మార్చి 31వరకు…

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ 

– సాహసంతో నదుల్లోకి దిగి పునరుద్ధరిస్తున్న సిబ్బంది – దక్షిణ డిస్కం పరిధిలో నేలకూలిన 1357 విద్యుత్‌ స్తంభాలు – ఖరాబైన ట్రాన్స్‌ ఫార్మర్లు 280 హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగష్టు 28: వరద కారణంగా పలు సబ్‌ స్టేషన్లలో నీరు చేరడం, విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినడం వలన పలు గ్రామాల్లో విద్యుత్‌ పంపిణి వ్యవస్థ స్తంభించింది.…

ప్రజారోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి

– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అదేశించారు. భారీ వర్షాల ప్రభావిత జిల్లాల వైద్య శాఖ అధికారులతో…

ఆర్‌అండ్‌బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Komatireddy Venkat Reddy

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి – మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బి అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాల…

అధికారుల సమన్వయంతోనే గట్టెక్కాం

– కామారెడ్డి వరద పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష – జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…