prajatantra News

prajatantra News

మూసీ పునరావాస మహిళా సంఘాలకు చేయూత

రూ.3.44కోట్ల నగదు చెక్కుల పంపిణీ నిర్వాసితులకు అండగా ఉంటామన్న మంత్రి మంత్రి సీతక్క ‌మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు…

ఉత్సాహంగా సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీలు

CM Cup 2024 torch relay rallies with excitement

పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న యువ క్రీడాకారులు నాగర్ కర్నూల్,  వనపర్తి జిల్లా కేంద్రాల్లో యువ క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడా ర్యాలీలు నిర్వ‌హించారు.  శుక్రవారం  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన టార్చ్ రిలే కార్యక్రమంలో కలెక్టర్ బి.సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ లు ముఖ్యఅతిథిలు గా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కబడ్డీ, వాలీబాల్, ఫుట్…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

ఇళ్ల మంజూరులో సాయం అందించండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వ గృహ నిర్మాణ శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీతో భేటీ పేద‌ల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి వీలైనంత వ‌ర‌కు స‌హాయం అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్ , స‌మాచార పౌర సంబంధాల…

సుప్రీమ్‌’ ‌చరిత్రలో మరో కొత్త అధ్యాయం

ఇక లైవ్‌ ‌స్ట్రీమింగ్‌లో కేసుల విచారణ ప్రత్యేక యాప్‌ ‌ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు  ‌సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై ‘సుప్రీమ్‌’‌లో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్‌ ‌స్ట్రీమింగ్‌ ‌చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.…

అపరిచితుడిలా మాట్లాడుతున్న రేవంత్‌

మూసీపై రోజుకో మాటతో ప్రజల్లో గందరగోళం మూసీని మురికికూపంగా చేసిన ఘనత కాంగ్రెస్‌దే మూసీలో వరదలు వొచ్చినా..నీళ్లునిలిచే ప్రసక్తే లేదు పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌18: ‌మూసీ సుందరీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ.. అపరిచితుడిలాగా మారిపోయాడని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు.…

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలి

ఫ్యాక్టరీతో వొచ్చే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ‌తా.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నిర్మల్ జిల్లా దిలావ‌ర్ పూర్ మండలం దిలావ‌ర్ పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను నిలిపివేయాల‌ని ప్రొఫెస‌ర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజాగళం పేరుతో దిలావ‌ర్ పూర్ మండల కేంద్రంలో…

దేవాదాయ భూముల పరిరక్షణ కు పకడ్బంది చర్యలు..

బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరి గుట్ట దేవాలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం భద్రాచలం దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూ సేకరణ కు రు.60 కోట్లు : మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ భూముల పరిరక్షణలో భాగంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలోని పలు ఆలయాల అభివృద్ధి వివరాలు, భక్తులకు కల్పిస్తున్న వసతుల వివరాలు, దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చేపడుతున్న చర్యల వివరాలు తెలుపుతూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని వివరించారు. దేవాదాయ భూములను సర్వే చేసి సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు 34 వేల 92 ఎకరాల దేవాదాయ భూములకు జియో ట్యాగింగ్ చేయడం జరిగిందని అన్నారు. 57 శాతం దేవాదాయ భూములను ధరణిలో నిక్షిప్తం చేయడంతో పాటు ఇతరలు ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు లేకుండా చర్యలు తీసుకున్నమన్నారు. ఆలయాల అభివృద్ధి... రాష్ట్రంలోని ప్రముఖ ఆలాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరి గుట్ట దేవాలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం చేస్తున్నామన్నారు. దాతల చే సేకరించిన 15 కోట్ల విరాలాలతో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. దీనివలన రోజుకు సూమారు 2500 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందించే వీలు కలుగుతుందని అన్నారు. అదే విధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలినడక భక్తులకు ఎండ నుండి ఉపశమనం కల్పించేందుకు షెడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూ సేకరణ చేసెందుకు 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటితో పాటు వేములవాడ, భాసర వంటి ప్రముఖ ఆలయాల అభివద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అన్ని దేవాలయాల వెబ్ సైట్ లను ఒకే గొడుగుకిందకు తీసుకు వచ్చి దేవాదాయ శాఖ సమగ్ర వెబ్ సైట్ ను తయారు చేయబోతున్నామన్నారు. త్వరలో దేవాదాయ శాఖ యాప్ ను ఏర్పాటు చేయడంతో పాటు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా భక్తులు తమకు ఇష్టం వచ్చిన దేవాలయాల వివరాలు స్థల పురాణాలు తెలుసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం... గత 15 సంవత్సరాలుగా బదిలీలు లేకుండా ఒకే చోట పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ భారీగా భదిలీలు చేపట్టమన్నారు. దేవాదాయ శాఖలోనే ఇది రికార్డు అన్నారు. ప్రెసిడెన్,యల్ ఆర్డర్ 2018 వచ్చిన తర్వాత జోనల్ సిస్టమ్ ప్రకారం సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరించుకున్నామని అన్నారు. చాలా రోజులగా దేవాదాయ శాఖలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని తెలిపారు.

 బ్రహ్మోత్సవాల నాటికి యాదగిరి గుట్ట దేవాలయ గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం భద్రాచలం దేవస్థానం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా భూ సేకరణ కు రు.60 కోట్లు : మంత్రి కొండా సురేఖ  దేవాదాయ శాఖ భూముల పరిరక్షణలో భాగంగా స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా…

రైతు సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.

Thummala Nageshwar Rao

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.   రైతు సంక్షేమం అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం  వికారాబాద్ జిల్లా మార్పల్లి  మండలం  వ్యవసాయ మార్కెట్ యార్డ్  నూతన  వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి కార్యవర్గ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని

Adani Group of Companies Chairman Gautam Adani met Chief Minister Revanth Reddy

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్  రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.

బిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ అస్తిత్వ పార్టీ

mla harish rao

ఇది కెసిఆర్‌, ‌కెటిఆర్‌దో కాదు…తెలంగాణ ప్రజలది కాంగ్రెస్‌ ‌పాలనలో దోపిడీ పెరిగింది బిజెపి మత రాజకీయాలు చేస్తోంది బిఆర్‌ఎస్‌ ‌సమావేశంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు ‌రేవంత్‌ ‌రెడ్డి ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు.. ఈ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బంద్‌ అయితే.. సమాజం తరపున కొట్లాడడం బంద్‌ అయితే.. పేద ప్రజల…