ముఖమంతా సెగలైనా
లోపల భీకర వర్షం

బొట్టు చప్పుడు లేకుండా
భారీ వరద ఊపిరిని తాకేలా

దారుల్ని మింగేసిన నదిపై
చినుకు ఈతను చూస్తుంటే

ఏ క్షణంలో ఏ పదం
పెదవులను పగులగొట్టుకుని

ముక్కలవుతుందో
లోపలి నిజం అనిపిస్తుంది

ఎన్నో యేళ్ళగా
గేట్లు తెరవని ఆనకట్టలా అతడు

ఒళ్ళంతా నెర్రెలుబారి
విశాలమైన బీడులా ఆమె

-శ్రీ సాహితీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *