సర్వాంతర్యామి.. ఈ-సాఫ్ట్ ‌వేర్‌ (ఆర్టిఫీషియల్‌ ఇం‌టెలిజెన్స్-AI)

‘‘‌పొద్దున్నే లేచి మొబైల్‌ ‌చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని..? ఫేస్‌ ఐడీ అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్‌ ‌ప్రింట్‌ అయితే వేలిని తాకించి అన్లాక్‌ ‌చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్‌ ‌ను  ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం కానీ ఆ కాసేపట్లో ఫోన్‌ ‌లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా?’’

నిత్యనూతనం…విజయానికి సోపానం. ఇదే, మనిషికైనా… మనిషిని సృష్టించిన టెక్నాలజీకైనా వర్తించే ప్రథమ సూత్రం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఔపోసన పడితేనే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ప్రస్తుత డిజటల్‌ ‌యుగంలో ఏఐ వినియోగమూ అదే తరహాలో ముందుకెళ్తోంది. విప్లవాత్మక మార్పులతో వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇందుగలదందు లేదని సందేహం వలదన్న మాట ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌కు  సరిగా సరిపోతుంది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అడుగడుగునా ఏఐ మన వెన్నంటే ఉంటుంది. విద్య నుంచి వైద్యం, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో విస్తరించి ప్రపంచ రూపురేఖలను మారుస్తోంది. ప్రపంచం ఏఐ వెంట పరుగులు పెడుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలు ఏఐ పై తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏఐ లో భారత్‌ ‌ప్రపంచ అగ్రగామిగా ఎదగాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం పలు కీలక చర్యలు తీసుకుంటోంది

పొద్దున్నే లేచి మొబైల్‌ ‌చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని..? ఫేస్‌ ఐడీ అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్‌ ‌ప్రింట్‌ అయితే వేలిని తాకించి అన్లాక్‌ ‌చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్‌ ‌ను  ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం కానీ ఆ కాసేపట్లో ఫోన్‌ ‌లోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్‌  ‌తెరిచేందుకు వాడే ఫేస్‌ ఐడీ ఎదురుగా ఉన్న ముఖాన్ని త్రీడీలో చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కన్పించకుండా దానినుంచి 30వేల ఇన్ఫ్రారెడ్‌ ‌చుక్కలు ముఖం మీద పడి ఫొటో తీస్తాయి. వెంటనే మెషీన్‌ ‌లెర్నింగ్‌ ‌కి సంబంధించిన ఆల్గోరిథమ్స్ ‌రంగంలోకి దిగి అప్పటికే ఫోన్‌ ‌లో స్కాన్‌ ‌చేసి స్టోర్‌ ‌చేసి పెట్టిన మన ఫొటోనీ ఇప్పుడు తీసిన ఫొటోనీ పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి. దాన్నిబట్టి అన్లాక్‌ అవ్వొచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోన్‌ . ఈ ‌పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్(ఏఐ)‌తోనే.

ఇక, ఫోన్‌ ‌తెరవగానే సోషల్‌ ‌మీడియా ఆప్స్ ‌లోకి వెళ్లడం చాలామందికి అలవాటే. ఫేస్బుక్‌, ‌ట్విటర్‌, ఇన్స్టా.. ఎందులోకి వెళ్లినా అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్టు చేసేవన్నీ మనకు కన్పించడం అసాధ్యం, వాటిల్లోనుంచి కొన్ని మాత్రమే కన్పిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫొటోలను చూస్తామో దాన్నిబట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే కనపడేలా చేయడం వెనక ఉన్నది కృత్రిమమేధే. అంతేకాదు, ఈ సోషల్‌ ‌మీడియా వేదికలకు వర్చువల్‌ ‌రియాలిటీ హంగులద్ది ‘మెటావర్స్’‌గా మన ముందుకు తేవడంలోనూ కీలకపాత్ర దానిదే..

వెలుతురు కోసం బల్బుల అవసరం లేకుండానే.. తక్కువ ఇంధనంతో పనిచేసే పరికరాలు రాబోతున్నాయి. వీటి ద్వారా గోడలే వెలిగిపోతాయి. అంతేనా ఇంట్లో అక్కడక్కడా ఉన్న సెన్సర్లు ఇంట్లోని వ్యక్తుల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటాయి. ఏం కావాలో చెబితే చాలు.. ఏఐ తో అనుసంధానమైన రోబోలు చకచకా వండేస్తాయి. ఇంకా వంటగదిని శుభ్రం చేసి పెడతాయి. ఇదంతా సినిమాటిక్‌ ‌గా  అనిపిస్తున్నా మరికొన్ని సంవత్సరాలలో రాబోతున్న స్మార్ట్ ఇళ్లలో.. రోజూ కన్పించే దృశ్యాలు ఇవే. ఆధునిక సాంకేతికత కారణంగా బల్బుల నుంచి గోడల దాకా ఇళ్లన్నీ ఇంటర్నెట్‌ ఆధారిత సెన్సర్లు, పరికరాలతో స్మార్ట్ ‌గా మారిపోబోతున్నాయి.

ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (ఏఐ), ఇం‌టర్నెట్‌ ఆఫ్‌ ‌థింగ్స్ (ఐఓటీ) తదితరాల్లో వేగవంతమవుతున్న పరిశోధనల ఫలితంగా.. మన ఇంట్లోని వస్తువులు యజమానుల, వినియోగదారుల అవసరాలు, అలవాట్లను అర్థం చేసుకొని… తదనుగుణంగా జీవనాన్ని స్మార్ట్ ‌గా  మారుస్తున్నాయి. ఇంటిని శుభ్రం చేసుకోవటం, వంట వండటం లో యంత్రాలు ఉపయోగపడే కాలం వొచ్చేసింది. వీటన్నింటికి మించి.. ఇంట్లో అమర్చిన సెన్సర్లు మన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ మనల్ని అప్రమత్తం చేస్తుంటాయి. అవసరమైన సాయం చేస్తుంటాయి. ఇక బాత్‌ ‌రూమ్‌ ‌లో సెన్సర్లు.. మలమూత్రాల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తునే ఉంటాయి. ప్రత్యేకంగా బయటికెళ్లి పరీక్షించాల్సిన అవసరం లేకుండానే! మందులు సరిపోయేన్ని ఉన్నాయో లేదో… సరిగ్గా సమయానికి వేసుకుంటున్నారో లేదో అప్రమత్తం చేస్తుంటాయి.

ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు: దేశంలోని ఏఐ మార్కెట్‌ 2022-2027 ‌నాటికి 25 నుంచి 35 శాతం వరకు వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 నాటికి దేశంలో ఏఐ నైపుణ్యం కలిగినవారి డిమాండ్‌ 6-6.5 ‌లక్షల నుంచి 12.5 లక్షలకు పెరుగుతుందని ఓ నివేదిక అంచనా వేసింది. ఇప్పటికే పలు సంస్థల్లో గత సంవత్సరంలో ఇండియాలోని పలు సంస్థల్లో 43 శాతం మంది ఏఐని ఉపయోగించారు. దాదాపు 60శాతం మంది ఉద్యోగులు, 71శాతం లు ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌నైపుణ్యాలను పొందడం ద్వారా తమ కెరీర్‌ ‌లో అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు భారతీయులు కనీసం ఒక డిజిటల్‌ ‌నైపుణ్యాన్ని నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏఐకు అవసరమైన స్కిల్స్: ‌జావా, మ్యాథ్స్, ‌స్టాటిస్టిక్స్, ‌మిషన్‌ ‌లెర్నింగ్‌ ‌టెక్నాలజీ స్కిల్స్ ‌వంటి కోర్సులు ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌కి అవసరం అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.

గ్లోబల్‌ ఏఐ ‌పవర్‌ ‌హౌస్‌ ‌గా భారత్‌: 2030 ‌నాటికి ఇండియా గ్లోబల్‌ ఏఐ ‌పవర్‌ ‌హౌస్‌ ‌గా మారుతుందని డెలాయిట్‌ ‌సౌత్‌ ఏషియా టెక్‌ అం‌డ్‌ ‌ట్రాన్స్ఫార్మేషన్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సతీష్‌ ‌గోపాలయ్య అన్నారు. ఒక మిలియన్‌ ‌కు పైగా అత్యంత నైపుణ్యం కలిగిన టెక్‌ ‌ప్రొఫెషనల్స్ ‌తో  భారత్‌ ‌నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ-కామర్స్: ఈ ‌కామర్స్ అం‌తా నడిచేది ఏఐతోనే. ప్రకటనలతో వినియోగదారుని ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి వెబ్సైట్‌ ‌ద్వారా వర్చువల్‌ ‌షాపింగ్‌ అనుభూతిని కలిగించి, వస్తువు కొనగానే వేర్హౌస్‌ ‌నుంచి వినియోగదారు ఇంటివరకూ చేరవేయడం,

కర్మాగారాలు: ఏఐతో పనిచేసే స్మార్ట్ ‌కెమెరాలు పరిశ్రమల్లో ప్యాకేజింగ్‌ ‌దశలోనే క్వాలిటీ కంట్రోల్‌ ‌బాధ్యతలు చేపడుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తికి ఉండే లక్షణాలన్నీ ముందుగానే వీటికి ఫీడ్‌ ‌చేయడంతో ఏ కాస్త తేడా ఉన్నా దాన్ని వెంటనే వేరు చేయడం ద్వారా ఇవి పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి తోడ్పడుతున్నాయి.

మానవ వనరులు: కృత్రిమమేధతో పనిచేసే ‘హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్’ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యోగ ప్రకటన దగ్గర్నుంచీ సరైన అభ్యర్థి ఎంపిక వరకూ అడుగడుగునా ప్రత్యేక సాఫ్ట్ ‌వేర్‌  ‌వినియోగిస్తున్నారు.

బ్యాంకింగ్‌: ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతానుంచి మరో ఖాతాకి డబ్బు బదిలీ చేయాలంటే ఒక పూట పని. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోనుతో నిమిషంలో ఆ పని చేసేస్తున్నాం. పని ఎంత సులువైందో అక్రమాలకు అవకాశమూ అంతగా పెరిగింది.

ఇన్వెస్ట్మెంట్‌: ‌పెట్టుబడుల రంగంలో, వెల్త్ ‌మేనేజ్మెంట్‌ ‌కంపెనీల్లో రోబో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్వేర్‌ ‌సేవల రూపంలో ఉండే ఇవి ముందుగా కస్టమర్‌ ‌ని  పలు ప్రశ్నలు వేస్తాయి. వయసూ ఆసక్తులూ ఆదాయమూ అప్పులూ రిస్క్ ‌తీసుకోగల ధైర్యం ఏపాటి ఉందీ లాంటివన్నీ అందులో ఉంటాయి

సాగుకి సాయం: కంప్యూటర్‌ అం‌టే ఏమిటో తెలియని రైతుకీ ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఏఐతో సాధ్యమైంది. విదేశాల్లో ఇప్పటికే ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండా వాటంతటవే నాట్లు వేస్తున్నాయి, నీళ్లు పెడుతున్నాయి, కలుపు తీస్తున్నాయి, ఎరువులు వేస్తున్నాయి, కోతలు కోస్తున్నాయి. పంటని పైనుంచి పర్యవేక్షించడం, క్రిమిసంహారకాలను చల్లడం లాంటి పనులను డ్రోన్‌ ‌లు  చేస్తున్నాయి. హైడ్రోపోనిక్స్, ‌వర్టికల్‌ ‌ఫార్మింగ్‌ ‌లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అయితే అచ్చంగా ఆటోమేటెడ్‌ ‌సాగు చేస్తున్న సంస్థలూ ఉన్నాయి. అంటే అక్కడ పనులన్నీ మనుషుల సాయం లేకుండా ప్రోగ్రామ్‌ ‌చేసిన యంత్రాలే పూర్తిచేస్తాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాల్లో మేతకు వెళ్లే పశువులకు వాటి చెవుల వెనకాల అగ్గిపెట్టె సైజు పరికరం అమర్చి ఉంటుంది. సౌరశక్తితో పనిచేసే ఆ పరికరం ఆధారంగా పశువు ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి మేత తిన్నదీ తదితర సమాచారాన్నంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతాడు.

మానవాళికి ముప్పు తప్పదా.. ఏజీఐ అభివృద్ధిపై అనేక సందేహాలున్నాయి. ఏజీఐ రోబోలు వొస్తే, మన ఉద్యోగాలపై, వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఏజీఐ మానవ విలువలను కలిగి ఉంటుందని, సమాజ శ్రేయస్సు, అభివృద్ధికి పాటుపడుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ఆర్టిఫీషియల్‌ ‌జనరల్‌ ఇం‌టెలిజెన్స్ ‌గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవాళి గోప్యత, భద్రతకు ముప్పు ఉండకూడదంటే, బలమైన భద్రతా ప్రమాణాలతో ఏజీఐను రూపొందించాలని, ఏజీఐపై మానవ పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని సూచిస్తున్నారు.

ఏజీఐ టెక్నాలజీ భవిష్యత్లో చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు వొచ్చే సాంకేతిక సమస్యలను, అడ్డంకులను అధిగమించడానికి, సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఏజీఐ ఉపయోగపడవచ్చని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని వల్ల పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు వొస్తాయని చెబుతున్నారు. అంతేకాదు శాస్త్రీయ ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయడంలో ఏజీఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమూ పొంచి ఉంది:ఈ స్మార్ట్ ‌పరికరాలతో సౌకర్యాలతో పాటు.. ప్రమాదమూ పొంచి ఉంది. అదే సైబర్‌ ‌సెక్యూరిటీ! కెమెరాలు, సెన్సర్లలాంటి పరికరాలతో.. హ్యాకర్లూ ఇంట్లోకి సులభంగా దూరిపోయే అవకాశాలు లేకపోలేదు. సెన్సర్లలో రికార్డయ్యే డేటాను కాపాడుకోవటం ఓ సవాలు. కాబట్టి.. స్మార్ట్ ఇళ్ల సక్సెస్‌ అం‌తా.. ఈ గాడ్జెట్ల తయారీలో సైబర్‌ ‌భద్రతకిచ్చే ప్రాధాన్యతను బట్టి ఉంటుందన్నది నిపుణుల మాట
– ప్రొఫెసర్‌  ‌క్రిష్ణా సామల్ల
ఫ్రీలాన్స్ ‌జర్నలిస్ట్, 9705890045

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *