-గిరి ప్రసాద్ చెలమల్లు
ఆకలి తాండవిస్తుంది
నిరుద్యోగం పేట్రేగిపోతుంది
ద్రవ్యోల్బణం రెక్కలొచ్చి ఎగురుతుంది
సామాజిక బహిష్కరణల తంతు యథావిధిగా
గూడు కోసం పడని పాట్లు లేవు
ఇవేవీ పరిష్కరించలేనప్పుడు
మతం పడగలిప్పుతుంది
ఇరుగుపొరుగు రాజ్యాల్లో
ఏలికలంతా కొట్లాటలకు సిద్ధం
అంతర్గతసమస్యలకి ఆజ్యంపోస్తూ
బ్రతికిస్తుంటుంది
తాము గద్దెపై కూర్చునుటకు
మనిషిని మనిషిగా గుర్తించలేని మతాలే
ఉన్మాదాన్ని పెంచి పోషిస్తాయి
వేదికల మీద శాంతి గీతాలాపన
భావోద్వేగాలతో ఆటలాడే క్రీడాకారులే ఏలికలు!
యుద్ధాలు నేలను ప్రజలను చెరబడుతుంటే
రాజ్యం తన ఉనికిని చాటుకుంటుంది
అగ్రరాజ్య అత్యవసరమైనప్పుడు క్షిపణులే పేలతాయి
తెల్లని పావురాలకి రెక్కలున్నా ఎగురనీయరు
నిరుద్యోగం పేట్రేగిపోతుంది
ద్రవ్యోల్బణం రెక్కలొచ్చి ఎగురుతుంది
సామాజిక బహిష్కరణల తంతు యథావిధిగా
గూడు కోసం పడని పాట్లు లేవు
ఇవేవీ పరిష్కరించలేనప్పుడు
మతం పడగలిప్పుతుంది
ఇరుగుపొరుగు రాజ్యాల్లో
ఏలికలంతా కొట్లాటలకు సిద్ధం
అంతర్గతసమస్యలకి ఆజ్యంపోస్తూ
బ్రతికిస్తుంటుంది
తాము గద్దెపై కూర్చునుటకు
మనిషిని మనిషిగా గుర్తించలేని మతాలే
ఉన్మాదాన్ని పెంచి పోషిస్తాయి
వేదికల మీద శాంతి గీతాలాపన
భావోద్వేగాలతో ఆటలాడే క్రీడాకారులే ఏలికలు!
యుద్ధాలు నేలను ప్రజలను చెరబడుతుంటే
రాజ్యం తన ఉనికిని చాటుకుంటుంది
అగ్రరాజ్య అత్యవసరమైనప్పుడు క్షిపణులే పేలతాయి
తెల్లని పావురాలకి రెక్కలున్నా ఎగురనీయరు




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల