సెంటిమెంట్ నిద్ర లేపిన ఆంధ్రా మీడియా

పదేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్‌ రాజకీయాలగ్నీ రాజుకుంది.. అధికార ప్రతిపక్షాల రాజకీయ క్రీడలో తెర పైకి తెలంగాణ ప్రాంతీయ వాదం వచ్చింది.. తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ తెలంగాణ అన్న భావోద్వేగం సజీవంగా ఉంటూనే ఉంటుంది. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం దాటిన ఆ భావోద్వేగం ప్రజల్లో  ఉన్నప్పటికీ,  రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టారు..కానీ ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్‌ను వదులుకోలేదు.కాలే కడుపుతో అయిన ఉంటారు కానీ తెలంగాణ అన్న భావోద్వేగాన్ని ఎప్పటికీ విడిచిపెట్టారు. పదేళ్లు తెలంగాణలో సెంటిమెంట్‌ ఎక్కడ పెద్దగా చర్చకు లేదు..తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ కలిసి మెలిసి తెలంగాణా అభివృద్ధి లో  భాగస్వామ్యమయ్యారు..ప్రాంతీయ భేద భావనే తెలుగు ప్రజల మధ్య రాలేదు. సీమాంధ్ర పార్టీలు వేరు సీమాంధ్ర ప్రజలు వేరు..రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం రాజకీయ లబ్ది కోసం సెంటిమెంట్‌ను వాడుకున్నారు, కానీ ప్రజల్లో ఎప్పుడు అలాంటి భావన కనిపించలేదు.
గత కొద్ది రోజులగా తెలంగాణలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతీయ అస్థిత్వాన్ని, రాజకీయ పార్టీలు తట్టిలేపుతున్నాయి..నిప్పుపై నివురు తొలగిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు..దీని తోడు కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ సెంటిమెంట్‌పై అత్యుత్సహం ప్రదర్శిస్తూ సెంటిమెంట్ తుట్టేను కదుపుతున్నాయి..ప్రజల భావోద్వేగాలను రెచ్చగోట్టేలా వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ పై  రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు చర్చించుకుంటున్న టైంలో సీమాంధ్ర మీడియా గా చెప్పబడుతున్న కొన్ని మీడియా సంస్థలు అగ్ని ఆజ్యం పోసినట్లు తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టేలా ప్రసారాలు చేయడంతో తెలంగాణ సెంటిమెంట్‌ అగ్గి రాజుకుంది.దీనికి రాజకీయ పార్టీలు ఎంత కారణమో. సోకాల్డ్ మీడియా కూడా అంతే కారణం. బాధ్యతగా ఉండాల్సిన మీడియా అదుపు తప్పి విశృంఖలంగా వ్యవహరిస్తూ ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ మరో వర్గాన్ని, మరో ప్రాంతాన్ని మరో రాష్ట్రాన్ని కించర్చేలా వార్తలు ప్రచారం చేయడంతో రాష్ట్రాల మధ్య ప్రాంతీయ చిచ్చు రాజేశాయి.
బకనచర్ల ప్రాజెక్ట్‌తో తెలంగాణలో సెంటిమెంట్ రాజుకుంది. తెలంగాణ నీటి  ఏపీ దోచుకుపోతుందని నీళ్లపై నిప్పులు పుట్టాయి..సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ప్రతిపక్షం ఏడాదిన్నరగా మాట్లాడుతున్న ప్రజలు పట్టించుకోలేదు. కానీ బనకబచర్ల విషయంలో రేవంత్‌  చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు ఆలోచనలోపడ్డారు.విపక్షాలు చేసే ఆరోపణల్లో నిజం ఉందని నమ్మే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణపై సీమాంధ్ర పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న ఆరోపణలకు అద్దం పట్టేలా సీమాంధ్ర మీడియా రాతలు రాయడంతో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తం ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గోదావరి నీళ్ల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం కూడా గ్రామాల్లో ప్రజలను ఆలోచింపజేస్తుంది.
గత కొద్ది రోజులగా తెలంగాణలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతీయ అస్థిత్వాన్ని, రాజకీయ పార్టీలు తట్టిలేపుతున్నాయి.. నిప్పుపై నివురు తొలగిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు..దీని తోడు కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ సెంటిమెంట్‌పై అత్యుత్సహం ప్రదర్శిస్తూ సెంటిమెంట్ తుట్టేను కదుపుతున్నాయి..ప్రజల భావోద్వేగాలను రెచ్చగోట్టేలా వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ పై  రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు చర్చించుకుంటున్న టైంలో సీమాంధ్ర మీడియా గా చెప్పబడుతున్న కొన్ని మీడియా సంస్థలు అగ్ని ఆజ్యం పోసినట్లు తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టేలా ప్రసారాలు చేయడంతో తెలంగాణ సెంటిమెంట్‌ అగ్గి రాజుకుంది.దీనికి రాజకీయ పార్టీలు ఎంత కారణమో. సోకాల్డ్ మీడియా కూడా అంతే కారణం. బాధ్యతగా ఉండాల్సిన మీడియా అదుపు తప్పి విశృంఖలంగా వ్యవహరిస్తూ ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ మరో వర్గాన్ని, మరో ప్రాంతాన్ని మరో రాష్ట్రాన్ని కించర్చేలా వార్తలు ప్రచారం చేయడంతో రాష్ట్రాల మధ్య ప్రాంతీయ చిచ్చు రాజేశాయి.   
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కూడా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా,  సీమాంధ్రకు అనుకూలంగా ఉందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారు.సర్కార్ కు  తోడు సీమాంధ్ర మీడియాగా ముద్రపడ్డ  సంస్థల రాతలు ఉండటంతో తెలంగాణ సెంటిమెంట్‌  భగ్గుమంది. నిప్పుపై ఉప్పు చల్లినట్లు ఏదో పోలిటికల్  ఎజెండా పెట్టుకున్న సదరు మీడియా “తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా..?” తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించడంతో ఆ మీడియా తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుందని తెలంగాణ సమాజం మళ్లీ ఏకం అయింది. .ప్రజల్లో బీఆర్ఎస్‌పై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ‌ ఆ మీడియా పెట్టిన ఒక్క హెడ్  లైన్‌తో మొత్తం తెలంగాణ సమీకృతమైంది. పార్టీలకు అతీతంగా మళ్లీ జై తెలంగాణ అని గొంత్తేలా, ఆ మీడియా చేసింది..గో బ్యాక్‌ సీమాంధ్ర మీడియా అనే డిమాండ్ పుట్టింది.అది నినాదంగా మారింది..బీఆర్ఎస్‌పై గానీ, కేసీఆర్ కుటుంబంపై ఎన్ని విమర్శలు చేసిన, పుంఖాను పుంఖాలుగా కథనాలు రాసిన ప్రజలు లైట్‌ తీసుకున్నారు.కానీ, తెలంగాణ బీఆర్ఎస్‌ జాగీరా..? అన్న ఒక్క హెడ్‌ లైన్‌తో మళ్లీ తెలంగాణలో నిప్పు రాజుకుంది.
పార్టీలకు అతీతంగా తెలంగాణ, తెలంగాణల ప్రజల జాగీరే అని గర్జిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ కోసం కొట్లాడిన కోట్లాది ప్రజలది, అందులో బీఆర్ఎస్‌ పార్టీ కూడా ఉందని, తెలంగాణ ముమ్మాటికీ  తెలంగాణ ప్రజల జాగీరే. తెలంగాణ కోసం కొట్లాడిన బీఆర్ఎస్‌ జాగీరు కూడా..ఒక్క బీఆర్ఎస్‌ మాత్రమే కాదు.తెలంగాణ కోసమే పుట్టిన అనేక పార్టీలది కూడా..అంతేకానీ తెలంగాణకు బతుకోచ్చిన,వ్యాపారం చేసేందుకు వచ్చిన వారిది కాదని, సీమాంధ్ర పార్టీలది అస్సలు కాదని కుండబద్దలు కొట్టి చెపుతున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో పురుడు పోసుకున్న పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ఆత్మగౌరవం కాబోదని  ప్రజలు ప్రకటిస్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఆంధ్ర  ఆత్మగౌరవం,  తప్పా తెలంగాణ ఆత్మగౌరవం కాదన్నట్లు వ్యవహరిస్తుంది..మీడియా కూడా  తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా రాతలు రాయిస్తుంది..నిజానికి తెలంగాణలో ప్రతిపక్షం కంటే ఎక్కువ, తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగెట్టేలా సీమాంధ్ర మీడియా తన రాతలతో ప్రాంతీయ భావోద్వేగాలకు ఆజ్యం పోస్తుంది..సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా టైటిల్  పెట్టినందుకు బీఆర్ఎస్‌ సదరు మీడియాకు రుణపడి ఉండాలి.
.నిజానికి సీమాంధ్ర మీడియా ఇవాళ ఇంతలా తెలంగాణ జాగీరా అని రెప్పిపోవడానికి గతంలో బీఆర్ఎస్  ప్రోత్సహాం కూడా లేకపోలేదు .ఇవాళ ఆంధ్ర మీడియా వద్దు తెలంగాణ మీడియా ముద్దు అన్న బలమైన తెలంగాణ ప్రజల  ఆకాంక్ష రాష్ట్రం వచ్చిన కొత్తలోనే వచ్చింది. కానీ అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ తెలంగాణ వాదుల డిమాండ్ ను పెద్దగా పట్టించుకోలేదు..వెరిసి ఆంధ్ర మీడియాను ప్రోత్సహిస్తూ   తెలంగాణ మీడియాపై ఆకాంక్షలు విధించారు లేదా నిర్లక్ష్యం చేసారు, ..తొండ ముదురి ఊసరవెల్లి అయినట్లు  ఇప్పుడు సోకాల్డ్ ఆంధ్ర మీడియా తెలంగాణపై విషం చిమ్ముతుండటంతో కళ్లు తెరిచారు.
.అనేక పోరాటాలతో, ప్రాణత్యాగాలతో తెలంగాణ పురుడు పోసుకుంది..ఇక సెంటిమెంట్ రాజకీయాలకు తావులేదని ప్రజలు భావించారు.కానీ ఇప్పుడు ఆంధ్ర మీడియా ఇలాంటి రాతలు రాయడంతో మళ్ళీ తెలంగాణ ప్రజలు పునరాలోచనలో పడ్డారు..తెలంగాణ ఏర్పాటుకు పడ్డ పురుటి నొప్పుల గురించి ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు.  మరోవైపు చంద్రబాబుకు, రేవంత్ కు లబ్ది చేయాలి రాసే క్రమంలో తెలంగాణ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను  మళ్ళీ రెచ్చగొట్టేలా రాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక  సెంటిమెంట్ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న టైం లో కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి రాతలు రాయడంతో మళ్ళీ తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌ను, తెలంగాణ ఏర్పాటు భావోద్వేగాలకు గుర్తు చేసుకుంటున్నారు.. గతాన్ని తవ్వి తీస్తు ఉద్యమ గాయాలు గుర్తు చేసుకుంటున్నారు.
.తెలంగాణ ఎలా వచ్చింది.?..తెలంగాణ కోసం ఎవరూ కొట్లాడారు.? ఎవరు త్యాగాలు చేశారు.?. ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు చేసింది ఎవరు.?.ఉద్యమకారులను హేళన చేస్తూ, అమరుల త్యాగాలను కించపరిచేలా రాతలు రాసిందెవరు.?.తెలంగాణ  ఏర్పాటును అడ్డుకున్నదెవరు.?..తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రాయాని చెప్పిందెవరూ..? ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు.ఇప్పుడు ఎందుకు మళ్ళీ సీమాంధ్ర మీడియా సీమాంధ్ర పాలకులు తెలంగాణపై ఎందుకింత అక్కసుతో కుట్రలు చేస్తున్నారు..? తెలంగాణ ఎవరి జాగీరీ, తెలంగాణ వాళ్లదా..? ఆంధ్ర వాళ్లదా..? చర్చించుకుంటున్నారు. తెలంగాణపై సీమాంధ్ర మీడియా, సమైక్యవాదులు చేస్తున్న వరుస దాడిని గమనిస్తున్న  ప్రజలు బీఆర్ఎస్ లేకపోతే  సీమాంధ్ర పార్టీల చేతితో తెలంగాణ కుక్కులు చింపిన ఇస్తారు అవుతుందన్న అభిప్రాయానికి వచ్చారు..ఇలాంటి రాతలు రాయడంతో మళ్ళీ తెలంగాణకు బీఆర్ఎస్/ టీఆర్ఎస్ శ్రీ రామ రక్షా అన్న అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *