ఇండియా కాంట్‌ బ్రీత్‌..! 

“అరావలి నుంచి హైదరాబాద్‌, బస్తర్‌ నుంచి బెంగాల్‌ వరకూ, హిమాలయాల నుంచి హిందు సముద్రం వరకూ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంతో ఆప్పటి వరకూ దిల్లీకే పరిమితం అయిన వాయు కాలుష్యంతో దేశం మొత్తం గ్యాస్ చాంబర్‌గా మారుతుంది. .కేంద్రం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రజా పోరాటలు ఒక్క మార్గం..ప్రజలు చైనత్యమై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే తప్ప ఇండియా వాయు కాలుష్యం నుంచి బయటపడే అవకాశం లేదు..ఇప్పటికే దిల్లీలో ఇండియా కాంట్ బ్రీత్‌ ఉద్యమం మొదలైంది. అది దేశవ్యాప్తంగా వస్తేనే తప్ప దేశంలో కేంద్రం విధ్వంసం ఆగదు..ఇప్పటికే ఫ్రీగా ప్రకృతిలో లభించే నీరును ఇవాళా కొనుగోలు చేసే పరిస్థి ఏర్పడింది..కేంద్రం విధ్వంసం ఇలాగా కొనసాగితే గాలిని కూడా కొనుకునే పరిస్థితి వస్తుంది.”
చరిత్రలో భూమి కోసం, నీళ్ల కోసం, ఆధిపత్యం కోసం పోరాటాలు జరిగా..ల్యాండ్, వాటర్‌ కోసం అయితే ఏకంగా యుద్దాలే జరిగాయి..తాజాగా ఇప్పుడు పీల్చే గాలికి యుద్దం జరిగే పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయి..ఊపిరి కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితిని పాలకులు తీసుకువస్తున్నారు.అణు యుద్దాలు, ఆర్థిక యుద్దాలు ముగిసి స్వేచ్చమైన గాలి కోసం పోరాటం చేయల్సిన వస్తుంది. .దేశంలో ఆయువునిలుపుకునేందుకు ఇప్పుడు ప్రాణ వాయువు కోసం ప్రజలు పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.దేశంలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, ఫైనాన్షియల్ ఎకానమీ వ్యవస్థ దేశం ఆయువు తీస్తున్నాయి..ప్రజలకు సహజంగా లభించే నీరు, గాలి ఇప్పుడు వ్యాపార వస్తువైంది. ఇప్పటికే నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విస్తరించింది.తాజాగా గాలి వ్యాపారం ట్రెండ్ నడుస్తుంది..ప్రజలకు ఫ్రీగా సులభంగా లభించాల్సిన పంచభూతాలు ఇప్పుడు ఆర్థిక మార్కెట్ లో ఆంగడి సరుకుగా మారింది. .
కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు 2.0తో దేశం ఊపిరి పోతుంది..అభివృద్ది ముగుసులో విచ్చలవిడిగా ప్రకృతిని విధ్వంసం చేస్తుంది. రాజకీయ గుత్తాధిపత్యం కోసం బీజేపీ, ఆర్ధిక గుత్తాధిపత్యం కోసం బడా వ్యాపారులు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారు. ప్రభుత్వం, బడా వ్యాపారులు పరస్పరం సహకరించుకుంటూ రైలు పట్టాల్లా ముందకు సాగుతూ ప్రజల బతుకులను పట్టాల కింద నలిపేస్తున్నాయి. .ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆర్థిక యుద్దాలు తారా స్థాయికి చేరడంతో భారత్‌లో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం 2.0 ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు చేస్తు, వ్యాపారులకు దోచిపెడుతున్నారు..మేమిద్దరం మాకు ఇద్దరు అన్నట్లు అదానీ అంబానీ, మోడీ షాలు దేశాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టుతుంది..దోపిడీ దారులను పెంచిపోషిస్తూ దోపిడీని ఎంకరేజ్‌ చేస్తున్నారు. .2.0 ఆర్ధిక సంస్కరణల అమలు నేపథ్యంలో ప్రజలకు , ప్రకృతికి రక్షణగా ఉన్న చట్టాలను గత దశాబ్దా కాలంగా రద్దు చేస్తుంది..కొన్నిటిని వ్యాపారులకు అనుకూలంగా సవరణలు చేస్తుంది. రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్‌లో అటవి రక్షణ, ఆదివాసులకు రక్షణగా ఉన్న సెక్షన్స్‌ను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది.కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా సవరణలు చేసింది..
అడవులను రక్షించే ఆదివాసులు, ఆడవిపై ఆధారపడి ఉన్న మూల వాసులను కేంద్రం రకరకాల ఆఫరేషన్లతో మట్టుబెట్టుతుంది. .కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజల ఊపిరి తీసే విధానాలు అమలు చేస్తుంది..ప్రజల ఆయువును తీసే చట్టాలను తీసుకువస్తుంది..ప్రాణవాయువు దొరక్క జనాలు గిలగిల కొట్టుకునే విధానాలు అమలు చేస్తుంది..కార్పొరేట్ల దోపిడీ నిరంతంగా కొనసాగేందుకు అటవి చట్టాలు, ఖనిజాల రక్షణ చట్టాలు, పీసా, ప్రకృతి రక్షణ చట్టాలు బీజేపీ వ్యూహత్మకంగా రద్దు చేస్తుంది. .ఇప్పటికే కేంద్రం షెడ్యూల్‌ 5కి సవరణలు చేసింది.మైనింగ్‌ చట్టాలను కంపెనీలకు అనుకూలంగా మార్చేసింది.దీంతో దక్షిణ బస్తర్‌లో మైనింగ్ కోరలు చాస్తుంది..ఖనిజ సంపద దోపిడీ పెరిగింది.
లక్షల ఏకరాలు కార్పొరేటట్ కంపెనీలకు అప్పగించి జల సహజ భూగర్భ ఖనిజాలతో పాటు విలువైన సంపదను బడా కంపెనీలు దోచుకుంటున్నాయి.ఇందు కోసం లక్షల ఎకరాల్లో కోట్ల చెట్లను నరికేస్తున్నారు..పచ్చిని అడవిని విధ్వంసం చేస్తూ ఏడారిగా మార్చుతున్నారు. ప్రజల సంపద, ప్రకృతిని కాపాడుతున్న వారిని ఎరివేసే ప్రక్రియను వేగవంతం చేసింది. .తాజాగా ఆరావలిలో మైనింగ్‌కు అనుమతి ఇస్తూ కేంద్రం దేశ ప్రజల మరణ శాసనం రాసింది..పునాతనమైన ఆరావలి పర్వతాల నిర్వచనమే మార్చివేసింది..ఆరావలిలో బడా కంపెనీల మైనింగ్‌ కోసం, ప్రకృతి, ప్రజల సందప దోపిడి కోసం దేశం నుటిదిపై మరణ శాసనం రాసింది. ఏకంగా ఆరావలి పర్వతానికి ఉండే డెఫినేషన్‌ కేంద్రం మార్చేంది..చివరి కోర్ట్‌లు కూడా ప్రభుత్వాలు తానా అంటే తందానా అంటున్నాయి. .
ఇప్పటికే దిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారింది..ప్రజలు ప్రాణవాయువకు బదులు విషాన్ని పిల్చుతున్నారు. ఇండి కాంట్ బ్రీత్‌ పరిస్థితులు హస్తినాలో కనిపిస్తున్నాయి.ఇప్పుడు ఆరావలి పర్వతాల్లో మైనింగ్‌ అనుమతి ఇవ్వడమే కాదు, ప్రకృతి విధ్వంసానికి పర్వం ఎత్తును నిర్వచనం మార్చేసి దేశాన్ని విషవాయువుల్లో ప్రజలను బందిస్తున్నారు.ఇది ఒక రకంగా హత్యల కంటే దారుణమైంది. .అభివృద్ది ముసుగులో దేశాన్ని విష వాయువులతో కేంద్రం నింపేస్తుంది..మైనింగ్‌లు, ప్రాజెక్ట్‌ల పేరుతో ప్రజలు విషాన్ని పీల్చుకునే పరిస్థితి తీసుకువచ్చారు..అరావలి నుంచి హైదరాబాద్ వరకూ..బస్తర్‌ నుంచి బెంగాల్‌ వరకూ..తూర్పు కనుముల నుంచి పచ్చిమ కనుముల వరకూ..హిమాలయాల నుంచి హిందు మహసముద్రం వరకూ విధ్వంసక విధానాలు కేంద్రం అమలు చేస్తుంది.
ప్రకృతిని విధ్వంసం చేస్తూ ప్రజలకు పడేకట్టుతున్నారు. .ఇప్పటికే మధ్య భారత్‌లో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న కార్పొరేట్‌ కంపెనీలకు ఇప్పుడు మరింత ఫ్రీ హ్యాండ్ కేంద్రం ఇచ్చింది..అభివృద్ది పేరుతో పచ్చని అడవిని నరికివేస్తున్నారు.దండకారణ్యంలో అదానీ, అంబానీ, టాటా, బిర్లాలతో సహా మల్టీనేషనల్ కంపెనీలు విధ్వంసం కాండను కొనసాగిస్తున్నాయి.దేశాన్ని బొందల గడ్డగా మార్చుతున్నారు.గాలి కాలుష్యం పెరుగుతుంది.నీటి కాలుష్యం భూ కాలుష్యం పెరుగుతుంది..భూ గర్భ జలాలు విషతుల్యం అవుతున్నారు. .కేంద్రం విధానాలతో దేశంలో ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి..ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎండాకాలం ఎండలు, వానాకాలం వరదలు, చలికాలం గడ్డ కంటే ఉష్టోగ్రతలతో పాటు ప్రజలు అనారోగ్యం పాలైతున్నారు..పిల్లలు పెద్దలు, విద్యార్థుల మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంది. జన్యులో వచ్చే మార్పిడిల కారణంగా కాలాలో సంబంధం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలు పిట్టాల్లా రాలుతున్నారు.
వాతావరణ మార్పులతో క్షణాకావేశాలు, ఇన్‌ స్టేట్‌ నిర్ణయాలు పెరుగుతున్నాయి. . ఇప్పటికే వాయుకాలుష్యంతో గ్యాస్‌ చాంబర్‌గా దిల్లీ మారింది.ఇక ముందు దేశం మొత్తం దిల్లీలా మారే ప్రమాదం పొంచి ఉండేలా నిర్ణయాలు తీసుకుంటుంది..ప్రకృతి వైఫరిత్యాలతో అల్లాడుతున్న దేశం ఇప్పుడు ఏకంగా ప్రకృతినే విధ్వంసం చేస్తూ ప్రమాదాన్ని మరింత పెంచేలా వ్యవరిస్తుంది. .దేశం మొత్తం కాంక్రీట్ జంగల్‌ గా మారింది..ఉన్న కాస్తా లంగ్ స్పేస్‌లను ఇప్పుడు అభివృద్ది ముసుగులో విధ్వంసం చేసేందుకు కేంద్రం కార్పొరేట్ల పంచన చేరింది..అరావలి ఒక్కటే కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో పర్వతాలను, ప్రకృతిని విధ్వంసం చేసేలా మైనింగ్‌లకు అనుమతులు ఇస్తుంది. పచ్చిమ, తూర్పు కనుమలు ప్రమాదంలో పడ్డాయి.పురాతన పర్వతాలను మైనింగ్‌ మాఫియా మింగేస్తుంది.హిమాలయాలు కరిగిపోతున్నాయి..సముద్ర జలాలు పెరిగి తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తుంది.ఇక సముద్ర కాలుష్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. కొండలను మింగేస్తున్నారు.జీవ నదులు చనిపోతున్నాయి.
అరావలే కాదు హైద్రాబాద్‌లో కూడా లంగ్‌ స్పెస్‌ తగ్గుతుంది. ప్రభుత్వం అభివృద్ది పేరుతో నగరానికి సహజ ఊపిరితిత్తులుగా ఉన్న వికారాబాద్ ఫారెస్ట్‌ను విధ్వంసం చేసింది..మూసి నదినీ చంపేస్తున్నారు..హైదరాబాద్ వర్సిటీలో భూములు ప్రభుత్వం అమ్మకాని పెట్టింది..బయోడైవర్సిటీని దెబ్బతీసే ప్రయత్నం చేసింది..అటు అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో వేల ఏకరాల్లో అడవులు తొలగిస్తున్నారు..మొత్తం ఉత్తర దక్షిణ భారత్ అన్న తేడా లేకుండా ప్రకృతి విధ్వంసకర పథకాలు కేంద్రం రచిస్తుంది. .దీంతో దేశ ప్రజలు ప్రమాదం ముంగిట్లో ఉంది..ప్రకృతి వైఫరిత్యాలు దేశాన్ని అతలాకుతలం చేస్తాయి..ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి..అతివృష్ట అనావృష్టితో దేశం అల్లాడుతుంది..కరువు కాటలు సంబవిస్తాయి.అన్నిటికి మించి శ్వాసకోశ వ్యాధులు, మానసిక ఆందోళనలు, విద్యార్థులు వృద్దులు, టీనేజర్లపై ఈ విధ్వంసం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
అరావలి నుంచి హైదరాబాద్‌, బస్తర్‌ నుంచి బెంగాల్‌ వరకూ, హిమాలయాల నుంచి హిందు సముద్రం వరకూ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంతో ఆప్పటి వరకూ దిల్లీకే పరిమితం అయిన వాయు కాలుష్యంతో దేశం మొత్తం గ్యాస్ చాంబర్‌గా మారుతుంది. .కేంద్రం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రజా పోరాటలు ఒక్క మార్గం..ప్రజలు చైనత్యమై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే తప్ప ఇండియా వాయు కాలుష్యం నుంచి బయటపడే అవకాశం లేదు..ఇప్పటికే దిల్లీలో ఇండియా కాంట్ బ్రీత్‌ ఉద్యమం మొదలైంది. అది దేశవ్యాప్తంగా వస్తేనే తప్ప దేశంలో కేంద్రం విధ్వంసం ఆగదు..ఇప్పటికే ఫ్రీగా ప్రకృతిలో లభించే నీరును ఇవాళా కొనుగోలు చేసే పరిస్థి ఏర్పడింది..కేంద్రం విధ్వంసం ఇలాగా కొనసాగితే గాలిని కూడా కొనుకునే పరిస్థితి వస్తుంది. .ప్రజలకు మంచి చేస్తున్నాం, దేశాన్ని అభివృద్ది చేస్తున్నామన్న ముసుగులో కొండలు గుట్టలు పర్వతాలు అడవులను విధ్వంసం నింగినేల ఆకాశం పాతాలాన్ని కాలుష్యం చేస్తూనే మరోవైపు ప్రజల అనారోగ్యలకు కారణం అవుతు ఇంకోవైపు ఎయిర్‌ ఫిల్టర్స్‌, వాటర్‌ ఫిల్టర్స్‌ పేరుతో బిజినెస్‌ చేస్తున్నారు..ఇప్పటికే ఢిల్లీలో ఎయిర్‌ ఫిల్టర్స్‌కు డిమాండ్ పెరిగిందంటేనే ప్రకృతి ప్రజలతో కార్పొరేట్‌ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. అభివృద్ది మరుగునా జరుగుతున్న విధ్వంసాన్ని ఆపకపోతే భవిష్యత్‌ భయంకర విధ్వంసమే అవుతుంది.
– తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *