అభిరుచి, ఆసక్తి కీలకం
పదో తరగతి తర్వాత ఏదైనా కోర్సును ఎంచుకునే ముందు, విద్యార్ధి ఆసక్తిని, అభిరుచిని ముందుగా అంచనా వేయాలి. ఎందుకంటే ఆసక్తికి సరిపోలని స్ట్రీమ్ ను ఎంచుకుంటే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. విద్యార్థులు ఏదైనా స్ట్రీమ్ ను ఎంచుకునే ముందు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కెరీర్ కౌన్సెలర్ల నుంచి కూడా సహాయం పొందవచ్చు. ఇక్కడ పదో తరగతి తర్వాత తీసుకోదగిన కొన్ని కోర్సుల వివరాలను అందిస్తున్నాం
డిప్లొమా కోర్సులు
డిప్లొమా, డిప్లొమాలు విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ సంస్థలు నిర్వహించే స్వల్పకాలిక కోర్సులివి. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత నేరుగా బిటెక్. లేదా బిఈ కోర్సులో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరం అడ్మిషన్ పొందవచ్చు. ఈ కోర్సులకు కనీస అర్హత పదో తరగతి వరకు గణితం, సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండటం మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సులు ఇవే. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్ తో డిప్లొమా, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిప్లొమా,ఫ్యాషన్ డిజైన్లో డిప్లొమా,డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ,గార్మెంట్ టెక్నాలజీలో డిప్లొమా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్ లో డిప్లొమా, లెదర్ టెక్నాలజీలో డిప్లొమా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ లో డిప్లొమా, మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, మెరైన్ ఇంజనీరింగ్ లో డిప్లొమా, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ టెక్స్ టైల్ డిజైన్, డిప్లొమా,టెక్స్ టైల్ ప్రాసెసింగ్ లో డిప్లొమా, టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా (స్పిన్నింగ్),
ఐటీఐ కోర్సులు
వివిధ ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ రంగాల నుంచి వివిధ సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఐటీఐ కోర్సులను ఏర్పాటు చేశాయి. ఈ కోర్సులు విద్యార్థులు ఉద్యోగం సంపాదించడానికి లేదంటే స్వయం ఉపాధి పొందేందుకు సహాయపడతాయి. అందుకే ఈ కోర్సులను వృత్తి విద్యా కోర్సులు అని కూడా అంటారు. ఈ కోర్సుల కాల వ్యవధి ఒకటి లేదా రెండేళ్లు. కొన్ని ఐటిఐ కోర్సుల వివరాలు మీ కోసం ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, సర్వేయర్, ఐటీ టెక్నీషియన్, టూల్ అండ్ డై మేకర్, డ్రాఫ్ట్ మన్ (మెకానికల్), డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్ మన్ (సివిల్), పంప్ ఆపరేటర్ మోటార్ డ్రైవింగ్ అండ్ మెకానిక్. టర్నర్, ఫుట్ వేర్ మేకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, మెషినిస్ట్ హెయిర్ అండ్ స్కిన్ కేర్, రిఫ్రిజిరేషన్ ఇంజనీర్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రాసెసింగ్, మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీర్, బ్లీచింగ్ డైయింగ్ అండ్ కాలికో ప్రింటింగ్, వెసెల్ నావిగేటర్, వేవింగ్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్, క్యాబిన్ లేదా రూమ్ అటెండెంట్ కంప్యూటర్-ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ అండ్ డిజైనింగ్ కార్పొరేట్ హౌస్ కీపింగ్ కౌన్సెలింగ్, క్రెచ్ మేనేజ్మెంట్, డ్రైవర్ అండ్ మెకానిక్ (లైట్ మోటార్ వెహికల్), డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ హౌస్ కీపింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, హాస్పిటల్ వేస్ట్
సర్టిఫికేట్ కోర్సులు రెండు, మూడు లేదా ఆరు నెలల పాటు ఉండే స్వల్పకాలిక కోర్సులు. పదో తరగతి తర్వాత తీసుకోదగిన కొన్ని సర్టిఫికెట్ కోర్సులు ఇవే.. ఫుడ్ ప్రాసెసర్ టెక్నీషియన్, కార్డియాక్ కేర్ టెక్నీషియన్, చిల్లింగ్ ప్లాంట్ టెక్నీషియన్, హోమ్ హెల్త్ ఎయిడ్ శిక్షణ, టూరిస్ట్ గైడ్ శిక్షణ, ప్లంబింగ్ కార్పెంటరీ తాపీ పని, బార్ బెండర్ ట్రాక్టర్ మెకానిక్, కారు మెకానిక్, డేటా ఆపరేటర్, గ్రీన్ హౌస్ ఫిట్టర్, సెట్ టాప్ బాక్స్ టెక్నీషియన్, బ్యూటీ అండ్ మేకప్, బుక్ కీపింగ్, పౌల్ట్రీ ఫార్మింగ్.
ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్కరి కల పదో తరగతి అర్హతతో.. చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడాలని తపన పడుతుంటారు. అలాంటి వారికి రూ.30 వేల వరకు వేతనంతో ఉండే ఉద్యోగ అవకాశాలు ఏమితో చూద్దాం.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కేంద్ర పోలీసు బలగాలతో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, జనరల్ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్ మన్ పోస్టుల భర్తీకి దాదాపు యేటా ప్రకటన విడుదల చేస్తోంది. ఒక్కో విడతలోనూ భారీ సంఖ్యలో ఖాలీలను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఈ పరీక్షతోనే లభిస్తున్నాయి ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సశస్త్ర సీమబల్ (ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ లో ఉద్యోగ అవకాశాలు అందుకోవచ్చు. కేంద్రంలో వివిధ విభాగాలకు అవసరమైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18-25 ఏళ్ల వయసున్న వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. కేంద్ర సంస్థల్లో రూ.30వేల వేతనంతో వీరు సేవలు అందించవచ్చు. పదో తరగతి విద్యార్హతతో రైల్వేలో పలు ఉద్యోగాలు లభిస్తున్నాయి. పోస్టల్ శాఖలో పోస్టుమ్యాన్, మెయిల్ గార్డు ఉద్యోగాలకు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు అందువల్ల పదో తరగతితోనే జీవన ప్రయాణం మలుపు తిరుగుతుంది అనడంలో సందేహం లేదు..
డాక్టర్ కృష్ణ సామల్ల,
ప్రొఫెసర్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
9705890045





