
లైబ్రేరియన్
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్,
వరంగల్. 9849375829
ఈ రోజుల్లో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వాడకం పెరుగుతుండటం ఆందోళనకరమైన విషయం. శారీరక-మానసిక ఆరోగ్యాన్ని, విద్యా ప్రగతిని, భవిష్యత్తును ప్రమాదంలో పెట్టే ఈ అలవాటు ఎందుకు కలుగుతుంది? దానికి సమాజం ఎలా స్పందించాలి? అన్న వాటికి సమగ్రంగా పరిశీలించాలి. చదువులో ఒత్తిడి, స్నేహితుల ప్రభావం, కొత్త అనుభవాలపై ఆసక్తి వంటి కారణాలు వారిని మాదక ద్రవ్యాల వినియోగం వైపు లాక్కెళుతున్నాయి. ఈ పరిస్థితి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. శారీరక-మానసిక ఆరోగ్యాన్ని, విద్యా ప్రగతిని, భవిష్యత్తును ప్రమాదంలో పెట్టే ఈ అలవాటు తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది.
కౌమారదశలో కొత్త అనుభవాలు ప్రయత్నించాలని ఉండే జిజ్ఞాస, స్నేహితుల ఒత్తిడి, కుటుంబంలో అనుకూల వాతావరణం లోపించడం, చదువుతో వచ్చే ఒత్తిడులు, అలాగే సినిమాలు-సోషల్ మీడియాలో మాదకద్రవ్యాలను ఆకర్షణీయంగా చూపించడం వంటి కారణాలు విద్యార్థులను ఈ ప్రమాదకర అలవాట్ల వైపు మళ్లిస్తాయి. చిన్న తప్పు నిర్ణయం వారి ఆరోగ్యం, స్వభావం, చదువు, భవిష్యత్తు అన్నింటినీ ప్రభావితం చేసే స్థితికి దారితీస్తుంది.
మాదకద్రవ్యాల వాడకం వల్ల శారీరకంగా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతిన డమే కాకుండా, మానసికంగా డిప్రెషన్, ఆందోళన, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు వచ్చేస్తాయి. చదువులో వెనుకబాటు, క్రమశిక్షణ లోపం, కుటుంబంతో గొడవ వంటి ప్రతికూల పరిణామాలు వారి జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తాయి. ఒకసారి అలవాటు పడితే దాని నుండి బయటపడటం కష్టతరమై, దీర్ఘకాలిక వ్యసనం, తీవ్ర ఆరోగ్య సమస్యలు, కొన్ని సందర్భాలలో మరణ ప్రమాదం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
మాదకద్రవ్యాల ఆకర్షణకు ప్రధాన కారణాలు:
1. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం: మాదకద్రవ్యాలను ఆకర్షణీయంగా చూపించడం వల్ల విద్యార్థుల్లో తప్పు సందేశం చేరుతుంది.
2. స్నేహితుల ఒత్తిడి: మాదకద్రవ్యాలు వాడే స్నేహితుల ప్రోత్సాహం లేదా ఒత్తిడి వల్ల చాలామంది విద్యార్థులు మొదటిసారి వాటిని ఉపయోగిస్తారు.
3. పాఠశాల/కళాశాల ఒత్తిడులు: విద్యలో పోటీ, మార్కుల ఆందోళన, భవిష్యత్తుపై భయం వంటి ఆందోళన ను తగ్గించుకోవడానికి విద్యార్థులను తప్ప మార్గాల వైపు నెడుతాయి.
4. సులభంగా అందుబాటులో ఉండటం: నిషేధిత పదార్థాలు కొన్ని ప్రాంతాల్లో సులభంగా లభించగల గడం కూడా ఒక కారణం.
5. జిజ్ఞాస లేదా కొత్త అనుభవాల పట్ల ఆసక్తి: కౌమారదశలో కొత్తవి ప్రయత్నించే ఉత్సుకత ఎక్కువ. ఒకసారి ప్రయత్నిస్తే అలవాటుగా మారే ప్రమాదం ఉంది.
6. కుటుంబంలో సమస్యలు: కుటుంబ కలహాలు, ప్రేమాభావం, దృష్టిపెడని తల్లిదండ్రులు, లేదా మద్యం/మాదకద్రవ్యాలు వాడే పెద్దలను చూడటం కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పటి తరానికి అవకాశాలు అమితంగా పెరిగాయి. టెక్నాలజీ, విజ్ఞానం, విద్య ప్రతి దారినీ ప్రపంచం యువతకు తెరవుతోంది. అయితే ఇదే సమయంలో వారిని తప్ప దారిలోకి నడిపించే ప్రమాదకర శక్తి కూడా పెరుగుతోంది అదే మాదకద్రవ్యాల ఆకర్షణ. విద్యార్థుల జీవితంలో అత్యంత విలువైన సమయం చదువుకునే ఏళ్లు. ఈ సమయంలో డ్రగ్స్ వైపు చిన్న అడుగు కూడా వారి భవిష్యత్తుకు పెద్ద నష్టం. అందుకే ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకోవాల్సిన గొప్ప సందేశం “డ్రగ్స్ కాదు డ్రీమ్స్ సాధించు!”
డ్రగ్స్ ఎందుకు ప్రమాదకరం?
మాదకద్రవ్యాలు మొదట్లో “తాత్కాలిక ఆనందం” ఇస్తాయనే భ్రమను కలిగిస్తాయి. కాని ఆ ఆనందం కేవలం కొన్ని నిమిషాల వ్యవధి కలిగిన మాయ. ఆ మాయలో మనసు చిక్కుకుంటే ఆపడం చాలా కష్టం. శరీరంలోని ప్రధాన అవయవాలు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. మానసికంగా ఆందోళన, డిప్రెషన్, కోపం, స్థిమితం కోల్పోవడం మొదలవుతాయి. కొన్నిసార్లు చదవడం మీద ఆసక్తి లేకపోవడం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, కొన్ని సందర్భాల్లో సరదాగా ప్రయత్నించడం ఇలాంటివి డ్రగ్స్ వైపు దారి తీస్తాయి. కానీ అవి అందించే ఆనందం కేవలం క్షణికం మాత్రమే; నష్టం మాత్రం జీవితాంతం ఉండేలా చేస్తాయి.
కలలు నిజం చేసుకోవాలి
కలలు మనిషిని ముందుకు నడిపించే ముఖ్యమైన శక్తి. కలలు జీవితం పట్ల దిశానిర్దేశం చేస్తాయి. ఒక విద్యార్థి కలలతో ముందుకు సాగితే, అతను కష్టపడతాడు, లక్ష్యాలపై దృష్టి పెడతాడు, తన ప్రతిభను అభివృద్ధి చేసుకుంటాడు, జీవితం పట్ల సానుకూల దృక్పథం పెంపొందించు కుంటాడు. డ్రగ్స్ మనల్ని చీకటిలోకి నెడతాయి; కలలు మాత్రం వెలుగువైపు నడిపిస్తాయి. డ్రగ్స్ మన విశ్వాసాన్ని పీల్చేస్తాయి; కలలు మాత్రం మనకు బలం ఇస్తాయి. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి; కలలు జీవితాన్ని నిర్మిస్తాయి.
అందుకే—డ్రగ్స్ కాదు – డ్రీమ్స్ సాధించు!
పరిష్కార మార్గాలు
1. యువత ఏం చేయాలి? తమపై నమ్మకం పెంపొందించుకోవాలి కష్టం వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. సానుకూల స్నేహితులను ఎంచుకోవాలి చెడు అలవాట్లను ప్రోత్సహించే వారిని దూరం పెట్టాలి. అభిరుచులు పెంపొందించుకోవాలి క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, పుస్తకాలు ఇవి మనసును శుభ్రంగా ఉంచుతాయి. సహాయం కోరడంలో వెనకడుగు వేయకూడదు తల్లిదండ్రులు, గురువులు, కౌన్సెలర్లు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా వుంటారు. ఒత్తిడిని తగ్గించే ఆరోగ్యకరమైన మార్గాలు నేర్చుకోవాలి – ధ్యానం, యోగా, వ్యాయామం వంటి అలవాట్లు మానసిక బలం ఇస్తాయి.
2. తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడటం, వారి సమస్యలు వినడం, ప్రేమ, సహనం, మార్గదర్శనం ఇవ్వడం, పిల్లల స్నేహితులు, కార్యకలాపాలు గురించి అవగాహన కలిగి ఉండటం, ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని నిర్మించాలి.
3. పాఠశాల/కళాశాల స్థాయిలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు,వ్యక్తిగత, విద్యాసంబంధిత కౌన్సెలింగ్, విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గమనించి తక్షణ చర్యలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సానుకూల మార్గదర్శనం చేయాలి.
4. విద్యార్థుల స్థాయిలో స్వీయ అవగాహన అంటే మాదకద్రవ్యాలు శాశ్వత సమస్యలకు తాత్కాలిక తప్పుదారి మాత్రమే అని గ్రహించడం, సానుకూల స్నేహిత వాతావరణం: చెడు అలవాట్లకు ప్రోత్సాహం ఇచ్చే స్నేహితులను దూరం పెట్టడం, వ్యక్తిగత లక్ష్యాలు, చదువు, క్రీడలు, కళలు వంటి శ్రద్ధ పెంచే పనుల్లో పాల్గొనడం.
5. సమాజం/ప్రభుత్వం స్థాయిలో నిషేధిత పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలి. రిహాబిలిటేషన్ కేంద్రాలు, హెల్ప్లైన్లు, మీడియా ద్వారా అవగాహన, స్థానిక సంఘాల సహకారంతో పర్యవేక్షణ జరపాలి.
6. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యను ఒక వ్యక్తి సమస్యగా కాకుండా, కుటుంబం-విద్యాసంస్థ-సమాజం అందరూ కలిసి ఎదుర్కొనాల్సిన సామూహిక బాధ్యతగా చూడాలి. సమష్టిగా చైతన్యం పెంచినప్పుడే విద్యార్థులను మాదకద్రవ్యాల ప్రమాదం నుండి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతాం.
కాబట్టి పుస్తకాలు పట్టుకో… డ్రగ్స్ పడేయ్! మనసు బలంగా ఉంచు డ్రగ్స్ ను దూరంగా నెట్టు. మాదకద్రవ్యాలరహిత సమాజమే నిజమైన అభివృద్ధి. డ్రగ్స్ వద్దు… నీ కలలను నమ్ము… కష్టపడు… డ్రీమ్స్ సాధించు! సమాజం మరియు ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రమాదకర పదార్థాల విక్రయాన్ని అరికట్టడంలో, రిహాబిలిటేషన్ కేంద్రాల ఏర్పాటులో, హెల్ప్లైన్ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించాలి. మీడియా ద్వారా దుష్ప్రభావాలపై జనజాగరణ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది.
కాబట్టి, మాదకద్రవ్యాల సమస్య ఒకరి సమస్య కాదు సమష్టి బాధ్యత. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ, మాదకద్రవ్య నివారణ సంస్థలు, లేదా ఎన్‌డీడీటీసీ/ఏఐఐఎంఎస్ లాంటి సంస్థలు,సమాజం అందరూ కలిసి కృషి చేస్తేనే ఈ సమస్యను అధిగమించగలుగుతాం. అవగాహన, ప్రేమ, మార్గదర్శనం, బాధ్యత ఈ నాలుగు విద్యార్థులను మాదకద్రవ్యాల ముప్పు నుండి రక్షించగల ముఖ్యమైన సాధనాలు. సమష్టిగా చైతన్యం పెంచినప్పుడే విద్యార్థులను మాదకద్రవ్యాల ప్రమాదం నుండి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందించగలుగుతాం.





