కింగ్‌ఫిషర్‌ బీర్‌ ప్రియులకు షాక్‌..

స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: ఇది బీర్‌ ప్రియులకు పెద్ద షాక్‌.. ముఖ్యంగా కింగ్ ఫిష‌ర్‌ బీర్ ప్రేమికులకు మింగుడు పడదు. తెలంగాణకు కింగ్‌ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ కంపెనీ స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూబీఎల్‌ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలను పెంచింది కానీ.. తయారీదారులకు చెల్లించే బేస్‌ ధరను పెంచకపోవడంతో భారీ నష్టాలు వొస్తున్నాయని యూబీఎల్‌ తెలిపింది.

బీర్ల సరఫరా నిలిపివేతకు ఇది కూడా ఒక కారణమని కంపెనీ పేర్కొంది. తెలంగాణ నుంచి రూ. 900 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ జాప్యం కూడా కంపెనీ నష్టాలకు కారణమైందని తెలిపింది. ఈ విషయాన్ని సెబీకి లేఖ దారా తెలిపింది. కింగ్‌ ఫిషర్‌, కింగ్‌ ఫిషర్‌ స్ట్రాంగ్‌, కింగ్‌ ఫిషర్‌ అల్ట్రా, కింగ్‌ ఫిషర్‌ అల్ట్రా మ్యాక్స్‌తో పాటు ఇతర బ్రాండ్లను నిలిపివేస్తున్నట్లు యూబీఎల్‌ స్పష్టం చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలను పరిశీలిస్తే కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్స్‌ 60 నుంచి 70 శాతం అధికంగా విక్రయం అవుతున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *