కొడవలి గొడ్డలి కత్తి ఆరే రంపే
పదునారిపోయిన ఆయుధాలకు
పదును పెట్టే పండ్రాయి పుస్తకం
ముక్క పోయిన మొద్దుగైన
ఆయుధాలను కొత్తగా చేసే కొలిమి
పుస్తకం
వంకరి కట్టెను చక్కగా చెక్కే
పెద్ద బాడిసే పుస్తకం
నింగిలో మేఘం నేలన చినుకు
పుడమి తల్లి పులకింత పుస్తకం
ఆరని సూర్య కిరణాలు అక్షరాల
ఒకట్య రెండా వేల పుస్తకాలు
ఏదో ఒక పుస్తకం మనసుకు నచ్చి
మార్చే మార్గం
పుస్తకం జ్ఞాన జ్ఞాపకాల గుర్తింపు
అక్షరాల అల్లిక పొద
అక్షరాల అర్థాల సూచిక
అజ్ఞానానికి విజ్ఞాన దివిటి
చదవాలి పుస్తకం సమాజం కోసం
మానవ హృదయాన్ని మలిచే ఆయుధం
గత గమన గమ్యం
వర్తమానం భవిష్యత్తు బతుకు
ఎరక చేస్తుంది వెనుకబాటు తనం
ప్రపంచ మేధావుల పరిచయమే పుస్తకం
– దేవరపాగ కృష్ణయ్య
99 63449579
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా





