మూడు పంక్తుల కవిత్వం

ఇల్లు లేకపోతేనేం

చాలామంది హృదయాల్లో

చోటుంది నాకు

*

image.png

వానై కురిస్తేనే

నీలోని మలినాల్ని

కడిగేసుకోగలవు

*

image.png

పిల్లకాలువకో

కొత్త పాట నేర్పెళ్లింది

వాన

*

image.png

అద్దాలవోణీ

నన్నణువణువులో

నింపేసుకుంది

*

image.png

నా ఈ సిరా చుక్కలన్నీ

మా అమ్మానాన్నల

చెమట చుక్కలే

-చిత్తలూరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *