ఆధునిక భారతీయ రంగస్థలానికి మైలురాయి

ఖాదిర్ అలీ బైగ్ థియేటర్ ఫౌండేషన్, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న నాటకం‘1857: టుర్రెబాజ్ ఖాన్’ను ఈ శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శించనుంది. ఎడిన్‌బరో ఫెస్టివల్ ఫ్రింజ్ లో ప్రపంచ ప్రీమియర్‌గా, లండన్‌లో యూకే ప్రీమియర్‌గా ప్రదర్శించి విశేషమైన ఆదరణ పొందిన ఈ నాటకం, హైదరాబాద్‌ వీక్షకులకు ప్రత్యేకంగా అందించబడుతోంది. ఈ నాటకం 1857 సిపాయీల తిరుగుబాటు కాలంలో భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన హైదరాబాద్ వీరుడు తుర్రెబాజ్ ఖాన్ జీవిత ఆధారంగా రూపొందించబడింది. అసాధారణ ధైర్యసాహసాలతో ప్రసిద్ధి చెందిన ఆయన చివరిక్షణాలను, తన ప్రత్యర్థి అయిన కుర్బాన్ అలీతో గడిపిన ఊహాజనిత సంభాషణగా ఈ నాటకం ఆకట్టుకుంటుంది. నాటకానికి మసూద్ అఖ్తర్ మోహమ్మద్ అలీ బైగ్ వంటి ప్రఖ్యాత కళాకారులు శక్తివంతమైన నటనతో ప్రాణం పోశారు.

సజీవ భారతీయ సాంప్రదాయ వాద్యాలతో నిండిన ఈ నాటకానికి, ప్రపంచ విమర్శకులు “హైలైట్ ఆఫ్ ది ఫెస్టివల్”, “ఆధునిక భారతీయ రంగస్థలానికి మైలురాయి” అని ప్రశంసలు కురిపించారు. బేగం రజియా బైగ్ నిర్మాణంలో, పద్మశ్రీ మోహమ్మద్ అలీ బైగ్ రచన దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రదర్శనను తెలంగాణ టూరిజం, హెచ్‌ఎండీఏతో కలిసి అందిస్తున్నారు. వివరాలు: తేదీ: 23 ఆగస్ట్ 2025 సమయం: సాయంత్రం 7 గంటలకు వేదిక: తారామతి బారాదరి ఇండోర్ ఆడిటోరియం, హైదరాబాద్, మొబైల్ : 040-23530791,98490 66522

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *