“రాష్ట్రంలోని ఆర్ధిక వనరులను బట్టి ఖర్చును కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వము శాసన సభకి అధికారంలోని వ్యవహారం అయిన కేంద్రీయ సాధారణ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కొత్త రాష్రం నిధులన్నీ రెండు ప్రాంతాల మధ్య నిష్పత్తి ప్రకారం తెలంగాణ ఆదాయంలో మిగులును తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఉంచాలని ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల పతినిధులు అంగీకరించి ఉన్నారు. కాబట్టి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం పాటించవచ్చు. ముఖ్యంగా ఈ ఒప్పందం గురించిన అంశాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని భారత ప్రభుత్వ ఉద్దేశిస్తున్నది. ఇది అమలు పరచడానికి కూడా భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్త పరుస్తున్నది.”
(సం.) బి. రామకృష్ణరావు, ముఖ్యమంత్రి
14.8.1956
తెలంగాణ ప్రయోజనాలను నష్టపడకుండా ఆంధ్ర నాయకులు హామీ ఇచ్చారు. కాని హామీలు ఉత్త గ్యారంటీలే. ఇప్పడికీ తెలంగాణకి ఇప్పడికీ ఉత్తవే ఈ హామీలు. ఇదీ మన ఘనులు, ఉత్తములు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుండి 60 శాతం. తెలంగాణా ప్రాంతం నుండి 40 శాతం మేరకు మంత్రులు వుండాలి. 40 శాతం తెలంగాణా మంత్రులలో ఒకరు తెలంగాణకు చెందిన ముస్లిం మంత్రి అయివుండాలి (12)వ నియమం లో ఉంది.
13) ముఖ్యమంత్రి ఆంధ్రప్రాంతం నుండి అయితే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి ఉండాలి. అలాగే ముఖ్యమంత్రి తెలంగాణము నుండి అయితే ఉపముఖ్య మంత్రి ఆంధ్ర ప్రాంతం నుండి ఉండాలి. దిగువ పేర్కొన్న ప్రభుత్వ శాఖలలో రెంటిని తెలంగాణా మంత్రులకు అప్పగించాం.
అ) హోం-
ఆ) ఆర్థికశాఖ
ఇ) రెవిన్యూశాఖలు
ఈ) ప్రణాళికలు అభివృద్ధి వ్యవహారాలు
ఉ) వాణిజ్య పరిశ్రమలశాఖ
- 14.1962సంవత్సరాంతం వరకూ తెలంగాణకు ప్రత్యేకంగా ప్రదేశ్ కాంగ్రెస్ సంఘం ఉండాలని హైదాబాదు ప్రదేశ్ కాంగ్రెసు సంఘం అధ్యక్షుడి అభిలషిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం అధ్యక్షునికి అభ్యంతరం లేదు.
ఈ పైన పేర్కొన్న అంశాలను 1956 ఫిబ్రవరి 30వ తేదీన పైన తెలిపిన రీతిన జరిగిన సమావేశంలో అంగీకరించబడింది. దిగువ రెండు అంశాలను గురించి ఈ వేళ మేము చర్చలు కొనసాగించాము. కాబట్టి అంగీకారం కుదరలేదు.
1) కొత్త రాష్ట్రానికి పేరు, కొత రాష్ట్రం పేరును (ముసాయిదా బిల్లులో ప్రస్తావించినట్లు) ఆంధ్ర తెలంగాణమని ఉండాలని తెలంగాణా’ ప్రతినిధులు కోరారు. సంయుక్త సెలెక్టు సంఘం సవరించినట్లు ఆంధ్రప్రదేశ్ అని ఉంచాలని ఆంధ్ర ప్రతినిధులు కోరారు. బెంచి గుంటూరులో ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. గుంటూరులో బెంచి ఉండనవసరం లేదని మొత్తం హైకోర్టు హైద్రాబాదులోనే ఉంచాలని ఆంధ్ర ప్రతినిధులు కోరారు.
తెలంగాణా ప్రాంతానికి ప్రతిపాదించిన రక్షణ పత్రం
1) ప్రాంతీయ స్థాయి సంఘం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఒక శానననభ ఉంటుంది. రాష్ట్రానికి అది చట్టాలు చేసే వ్యవస్థగా వుంటుంది. రాష్ట్రానికి ఒకే గవర్నరు ఉంటారు. మొత్తం పరిపాలనా రంగంలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తున్న మంత్రుల మండలి గవర్నరుకు సలహాలిస్తూ సహాయపడుతుంది.
2) కొన్ని ప్రత్యేక విషయాల్లో ప్రభుత్వం మరింత సులువుగా వ్యవహారాలు నిర్వహించడానికి తెలంగాణాను ఉమ్మడి ప్రాంతంగా పరిగణిస్తారు.
3) తెలంగాణ ప్రాంతానికి గాను ఒక ప్రాంతీయ స్థాయి సంఘం ఉండాలని తెలంగాణ ప్రాంతపు మంత్రులతో సహా తెలంగాణ శాసన సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి అందులో సభ్యులు కారు.
4) సమావేశాలను ప్రాంతీయ సంఘాలకి నివేదిస్తారు. ప్రత్యేక విషయాలకు సంబంధించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వ శాసన చర్యకు గాను ప్రాంతీయ సంఘం సూచించవచ్చు. లేదా రోజువారీ వ్యయానికి అవసర వ్యయానికి సంబంధించినది కాకుండా ఉన్న ఆర్థిక బాధ్యతలకు చెందిన సాధారణ ప్రభుత్వ విధానాల విషయాల్లో కూడా ప్రాంతీయ సంఘ ప్రతిపాదనలు చేయవచ్చు.
5) ప్రాంతీయ సంఘం ఇచ్చిన శ్రీ సలహాలను మామూలుగా ప్రభుత్వం ….. నభ ఆమోదిస్తాయి. అభిప్రాయభేదం వస్తే గవర్నరుకు నివేదించాలి. గవర్నరు నిర్ణయం ఖాయమైనదీ పాటించవలసిందీను.
6) ప్రాంతీయ సంఘం ఈ అంశాల్ని గురించి పరిశీలిస్తుంది.
అ) రాష్ట్ర శాసనసభ సాధాణాభివృద్ధి ఫలితాలు. విధానాలకు సంబంధించి రూపొందించిన చట్టానికి లోబడిన అభివృద్ధి ఆర్ధిక ప్రణాళికా వ్యవహారాలు.
ఆ) స్థానిక స్వపరిపాలనా వ్యవహారాలు అంటె మున్సిపల్ కార్పొరేషన్ల రాజ్యాంగాధికారాలు: అభివృద్ధి ట్రస్టులు జిల్లా బోర్డులు స్థానిక స్వపరివాలన లేదా గ్రామ పరిపాలనా వ్యవరాలకు చెందిన ఇతర అధికారాలు.
ఇ) ప్రజారోగ్యం పారిశుద్ధ్యం స్థానిక ఆసుపత్రులు చికిత్స శాలలు
ఈ) ప్రాథమిక: మాధ్యమిక విద్య
ఉ) తెలంగాణ ప్రాంతంలో విద్యా సంస్థలకు ప్రదేశాలను క్రమపరచడం.
ఊ) మద్య నిషేదం
ఎ) వ్యవసాయ భూమి అమ్మకం
ఏ) అభివద్ది కార్యక్రకమాలు, లఘు పరిశ్రమలు
ఐ). వ్యవహారాల సహకార సంఘాలు అంగళ్లు, సంతలు
బి. నివాస నిబంధనలు:
తాత్కాలికపు ఏర్పాటు ఐదేళ్ల కాలానికి తెలంగాణ ప్రాంతపు సబార్డినేట్ ఉద్యోగాలకు రిక్రూటుమెంటు విషయంలో తెలంగాణాను ఒక యూనిట్ గా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉత్పన్నమయిన పెదవులను ప్రస్తుతం హైద్రాబాదు నిబంధనలలో నిర్ణీతమయిన మేరక నివాసపు షరతులకు అనుగుణంగా ఉన్న వారితో భర్తీ చేయడానికి కేటాయించాలి.
సి. ఉర్దూభాష స్థాయి: రాష్ట్రంలో ప్రస్తుత పరిశీలనా న్యాయ వ్యవస్థల్లో ఉర్దూ భాషకు ఉన్న స్థానాన్ని ఐదేళ్లపాటు కొనసాగించేందుకు తగు చర్యలు గైకొనుటకుగాను భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి.
డి. కొత్త రాష్ట్రంలో అదనంగా ఉన్న ఉద్యోగులు రిట్రెంచిమెంటు
ఉద్యోగాల్లో ఉన్న వారిని తొలగించవలసి వస్తుందని. రిట్రెంచిమెంటు అవసరమౌతుందని భారత ప్రభుత్వం భావించడం లేదు. ఎటువంటి వడపోత కార్యక్రమాలు లేకుండానే హైదరాబాదు రాష్ట్ర ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర ఉద్యోగాల్లోకి సాధ్యమయినంత వరకూ చేర్చుకోవాలన్నదే ఉద్దేశం. ఒకవేళ రిట్రెంచిమెంటు అవసరమయితే యావత్తు విశాల రాష్ట్ర ఉద్యోగులందరకి అది ఒకే తీరుని వర్తించేట్లు చూడబడుతుంది.
ఇ. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు మధ్య ఖర్చు పంపిణి:
రాష్ట్రంలోని ఆర్ధిక వనరులను బట్టి ఖర్చును కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వము శాసన సభకి అధికారంలోని వ్యవహారం అయిన కేంద్రీయ సాధారణ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కొత్త రాష్రం నిధులన్నీ రెండు ప్రాంతాల మధ్య నిష్పత్తి ప్రకారం తెలంగాణ ఆదాయంలో మిగులును తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఉంచాలని ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల పతినిధులు అంగీకరించి ఉన్నారు. కాబట్టి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం పాటించవచ్చు. ముఖ్యంగా ఈ ఒప్పందం గురించిన అంశాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి దృష్టికి తేవాలని భారత ప్రభుత్వ ఉద్దేశిస్తున్నది. ఇది అమలు పరచడానికి కూడా భారత ప్రభుత్వం ఆశాభావం వ్యక్త పరుస్తున్నది.
(సం.) బి. రామకృష్ణరావు, ముఖ్యమంత్రి
14.8.1956
విచిత్రమేమంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఆంధ్ర కృషి చేస్తుందని హైదరాబాద్ ముఖ్యమంత్రి బి రామకృష్ణారావు సంతకం చేస్తున్నాడు. ఇదీ మోసం కాదా? దారుణంతో మొదలై దానికి పెద్దమనుషులు, వారికి ఒప్పందం.





సత్యాన్ని సమాధి చేసే కుట్రలు