పలకరించే పక్షులు పచ్చని చెట్లు
అలాయ్ బలాయ్ అరుచుకునే
ముచ్చట్లు
అన్నీ కరువై ఊరుమ్మడి బతుకుల్లో
కలహభోజనుల మందెక్కిన సందడి
అసలు కాకులే కరువైనని
ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద
ఎక్కడ వాలుతుంది కనుక
పక్షుల సంగీత కచేరీలో సైతం
శృతి లేని తీరొక్క తీరు గాత్రo
మన తత్వం మరిచి
మనస్తత్వం చంపుకొని
పీఠాల కోసం కొందరు
వాటాల కోసం కొందరు
తన్ను తానే చీల్చుకుంటూ
ఎదుటోడిని కాల్చుకు తింటూ
వాడిపోతూ మాడిపోతూ
మెట్టుకు మనమే అందరం
కోయల కంఠం లో కూడా
శస్త్రించిన షడ్రుచుల జాడ
అచ్చంగా విభజన రేఖలు
గీసుకున్న మనుషుల తరీక
స్వచ్ఛంగా పాడే కోయిలకూ
స్వేచ్ఛగా నింగినీ నేలనూ తాకే
నిస్పాక్షితా జలపాతాలకు
పాక్షిక దృష్టి లేపనా లెందుకు …..

హనుమకొండ
మొబైల్ :9849254078




