అంధుల అక్షర ప్రదాత బ్రెయిలీ
అతడు ఓ నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టాడు. విధి వక్రీకరించి కంటికి గాయమై ఐదేళ్లకే కంటిచూపు పోగొట్టుకున్నాడు. అందమైన లోకాన్ని తానిక చూడలేననే సంగతి తెలిసి కుమిలిపోయాడు. అయితే 15 ఏళ్లు వచ్చేసరికి ఆ బాలుడే అంధ విధ్యార్థులూ చదువుకునేలా ఓ లిపిని తయారు చేసి, దానిని మరింత ఆధునీకరించాడు. అతడే లూయీస్ బ్రెయిలీ లూయిస్ బ్రెయిలీ పేరు ప్రపంచంలోని అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయింది. ఆయన 1809 జనవరి 4న ఫ్రాన్స్ లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. చిన్ననాటి ప్రమాదంలో కంటి చూపు కోల్పోయినప్పటికీ, లూయిస్ తన అసాధారణ ప్రతిభతో అంధులకు విజ్ఞానానికి గేటువుగా మారే బ్రెయిల్ లిపిని ఆవిష్కరించారు. లూయిస్ బ్రెయిలీ పేరు సాహసికత, విజ్ఞానం, మరియు అంధుల సేవకు ప్రతీక. ఆయన అంధుల చదువు కోసం బ్రెయిల్ లిపిని ఆవిష్కరించి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
బాల్యం – కష్టాలలో స్ఫూర్తి
లూయిస్ బ్రెయిలీ బాల్యంలోనే ఒక చర్మకారుడి కుమారుడిగా సాధారణ కుటుంబంలో జన్మించారు. లూయిస్ బ్రెయిలీ మూడు సంవత్సరాల వయసులో తండ్రి వర్క్ షాప్‌లో ఆడుతూ ప్రమాదవశాత్తూ కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయారు. చిన్న వయసులోనే తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని కేవలం భావనల ద్వారా గ్రహించాల్సి వచ్చింది. అయితే, ఇది ఆయనను దిగ్భ్రాంతికి గురి చేయలేదు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఆయన జీవితం కోసం కొత్త మార్గాలను అన్వేషించారు.
విద్యార్జనలో ప్రతిభ
అంధుల పాఠశాల అయిన ‘‘రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్’’లో చేరిన లూయిస్, విద్యాభ్యాసం కొనసాగించారు. అప్పట్లో అంధులకు పఠనానికి అవసరమైన సామగ్రి తక్కువగా ఉండేది. ఈ సమస్యను గుర్తించిన లూయిస్, తాను దీనికి పరిష్కారం చూపాలని సంకల్పించారు. అంధుల కోసం ప్రత్యేకమైన పఠన విధానాల కొరతను గుర్తించి వాటిని మెరుగుపరచడం గురించి ఆలోచించారు.
బ్రెయిల్ లిపి ఆవిష్కరణ
1819లో లూయిస్, నెపోలియన్ ఆర్మీ కోసం రూపొందించిన నైట్ రైటింగ్ సిస్టమ్‌ను గురించి తెలిసి, దానిని ఆధారంగా చేసుకొని అంధుల కోసం సులభమైన బ్రెయిల్ లిపిని రూపొందించారు. లూయిస్ బ్రెయిలీ అంధులకు సులభంగా పఠనం మరియు రచన చేసేందుకు బ్రెయిల్ లిపిని 1824లో ఆవిష్కరించారు. ఇది ఒక ప్రత్యేకమైన అక్షరమాల పద్ధతి, ఇందులో ఆరు పాయింట్ల నుండి వివిధ సమీకరణల ద్వారా అక్షరాలు, అంకెలు, మరియు ఇతర చిహ్నాలను సృష్టించవచ్చు. ఈ పద్ధతి అంధులకు తాము చదవగలగడం, రచన చేయగలగడం అనే స్వేచ్ఛను అందించింది.
బ్రెయిల్ లిపి ప్రత్యేకత
బ్రెయిల్ లిపి కేవలం పఠనానికి మాత్రమే కాదు, సంగీత నోటేషన్లు, గణిత సూచనలు, మరియు శాస్త్రీయ సమాచారాన్ని అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది అంధులకు ప్రపంచ విజ్ఞానానికి తలుపులు తెరిచింది. లూయిస్ బ్రెయిలీ ఆవిష్కరణ అంధులకు స్వతంత్ర పఠనం, రచనల సామర్థ్యాలను అందించింది. ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడింది మరియు ప్రస్తుతం ప్రతి అంధుల విద్యా వ్యవస్థలో ఉపయోగించబడుతోంది.
లూయిస్ బ్రెయిలీ సేవల ప్రభావం
లూయిస్ బ్రెయిలీ ఆవిష్కరణ ఎక్కడా నిలిపివే యబడలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడింది. ప్రత్యేకించి విద్యా వ్యవస్థలో ఈ లిపి అంధుల జీవితాలను సమూలంగా మార్చింది. బ్రెయిల్ లిపి ద్వారా వాళ్లు చదవడం, తమ ఆలోచనలను వ్యక్తపరచడం, మరియు స్వతంత్రంగా జీవించగలగడం సాధ్యమైంది.
మరణం తర్వాత గుర్తింపు
లూయిస్ బ్రెయిలీ 1852లో క్షయవ్యాధి కారణంగా 43 ఏళ్ల వయసులో మరణించారు. కానీ, ఆయన సృష్టించిన బ్రెయిల్ లిపి ఆయనకు చిరస్థాయి గుర్తి ంపును అందించింది. లూయిస్ బతికుండగా ఈ లిపి గురించి ఎవరూ పట్టించుకోలేదు గానీ.. ఆయన మరణించిన రెండేళ్లకే 1854లో లూయిస్ రూపొందించిన ఆల్ఫాబెట్ సిస్టమ్‌ని ఫ్రెంచి ప్రభుత్వం గుర్తించి, అక్కడి అంధ విద్యార్థులకు దానిని అందుబాటులోకి తెచ్చింది. 1982లో ఎలక్ట్రానిక్ బ్రెయిలీ డిస్‌ప్లే వచ్చింది. ఆ తదుపరి ఎలక్ట్రానిక్ నోట్స్, డిజిటల్ ఆడియో బుక్స్, కంప్యూటర్ స్క్రీన్ రీడర్స్, వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ లైబ్రరీలు వచ్చాయి. ఫ్రాన్స్ చరిత్రలో మహనీయులుగా గుర్తింపు పొందిన వారి స్మృతి నిమిత్తం నిర్మించిన పాంథియన్ మ్యూజియంలో లూయీ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఆయన జన్మించిన ఇంటిని ప్రభుత్వం స్మారకంగా మార్చింది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఆయన పేరున ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయగా, మనదేశం బ్రెయిలీ పేరిట 2 రూపాయల నాణెం విడుదల చేసింది.
అంధులలో ఆత్మస్థైర్యం నింపిన లూయిస్ బ్రెయిలీ
లూయిస్ బ్రెయిలీ జీవిత కథ అంధుల కోసం మాత్రమే కాదు, సాధారణ వ్యక్తులకు కూడా పెద్ద ప్రేరణగా నిలుస్తుంది. కష్టాలను అధిగమించి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం ఏమిటో ఆయన తన జీవితంతో నిరూపించారు. ఆయన బ్రెయిల్ ఆవిష్కరణతో కోట్లాది అంధులు విద్య, విజ్ఞానం, మరియు ఆత్మస్థైర్యాన్ని పొందారు. లూయిస్ బ్రెయిలీ జీవితం కష్టాలను గెలిచి, ఇతరులకు వెలుగునిచ్చే శక్తిని అందించింది. అంధుల కోసం ఆయన చేసిన సేవలు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన ఆవిష్కరించిన బ్రెయిల్ లిపి అంధుల జీవితాలను మరింత గొప్పగా తీర్చిదిద్దిన అద్భుతమైన వారసత్వం.
డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి,
స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్,
సైకాలజిస్ట్
ఫ్యామిలీ కౌన్సెలర్
సెల్: 9703935321





