ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. 17 మంది ఊపిరాడక మరణించారు ఎనిమిది మంది కాలిన గాయాలతో మరణించగా, మరణానికి ప్రధాన కారణం పొగ పీల్చడమేనని అధికారులు తెలిపారు మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు . చార్మినార్ పక్కనే ఉన్న ఒక ఆభరణాల దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక అధికారుల ప్రకారం, ఆభరణాల దుకాణం ఉన్న మూడు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. అయితే, సీనియర్ అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, “సంఘటన గురించి సమాచారం అందిన 15 నిమిషాల్లోనే” అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 6.17 గంటలకు అగ్నిమాపక హెచ్చరిక అందింది. గుల్జార్ హౌజ్ ప్రాంతంలో కృష్ణ పెరల్స్ దుకాణం నివాస భవనంలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి.
మంటలను అదుపు చేయడానికి మొత్తం11 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి సరైన సమయంలో చేరుకున్నా ఫలితం లేదు.ప్రాథమిక పరీక్షలో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తేలింది. పొగ పీల్చడం వల్లే అందరూ మరణించారని, ఎవరికీ కాలిన గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ మాస్క్‌లు మరియు శ్వాస ఉపకరణాలను ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు. మంటలను అదుపు చేయడం, ప్రజలను రక్షించడంలో అగ్నిమాపక శాఖలో ఎటువంటి లోపం లేదు. భవనంలో సొరంగం లాంటి రెండు మీటర్ల ప్రవేశ మార్గం మాత్రమే ఉంది. మొదటి రెండవ అంతస్తులకు చేరుకోవడానికి ఒక మీటర్ మెట్ల దూరం మాత్రమే ఉంది. దీని వల్ల తప్పించుకోవడం అలాగే రక్షించడం చాలా కష్టంగా మారింది. భవనం లోపల మొత్తం 21 మంది ఉన్నారు. పొగ పీల్చడం వల్లే మరణానికి కారణం; ఎవరికీ కాలిన గాయాలు కాలేదు” అని అగ్నిమాపక అధికారి తెలిపారు.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలున్నట్లే, పిల్లల్ని నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు ఉన్నారు. భారం అని వదిలించుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అభం శుభం తెలియని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల చర్యల పట్ల అప్రమత్తత లేకపోతే అనర్థాలు మిగులుతాయి.
ఆదివారం ఏలూరు, చిత్తూరు విజయనగరం జిల్లాల్లో జరిగిన వేర్వేరు సంఘటనలలో తొమ్మిది మంది పిల్లలు నీటిలో మునిగిపోవడం మరియు ఊపిరాడక మరణించారు. మరో సంఘటన, విజయనగరంలో నలుగురు పిల్లలు ఊపిరాడక మరణించారు. ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలోని దొరమామిడి ప్రాజెక్టు జల్లేరు ప్రాజెక్టులో ఇద్దరు బాలురు మునిగిపోయారు. స్నానం చేయడానికి ప్రాజెక్టుకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారని స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమిక విచారణలో తేలింది. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి గ్రామంలో జరిగిన హృదయ విదారక సంఘటనలో, ఇద్దరు తోబుట్టువులు సహా నలుగురు పిల్లలు ఆపి ఉంచిన కారులో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు, అందరూ ద్వారపూడి గ్రామానికి చెందినవారు.
ఆదివారం ఉదయం, వారి తల్లిదండ్రులు తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉండగా, సమీపంలో ఆడుకుంటున్న పిల్లలు, అన్‌లాక్ చేయబడి ఉన్న పార్క్ చేసిన కారు తలుపు తెరిచి లోపలికి ఎక్కారు, దురదృష్టవశాత్తు, వారు లోపలికి వెళ్ళిన తర్వాత కారు తలుపులు స్వయంచాలకంగా లాక్ అయ్యాయి. సహాయం కోసం పిలిచినప్పటికీ, తలుపులు లాక్ చేయబడి ఉండటం, సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల వారి గొంతులు వినిపించలేదు అని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట వరకు పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభమైంది. వారి తల్లిదండ్రులు తోటలు, బంధువుల ఇళ్ళు, సమీపంలోని వ్యవసాయ బావులు వంటి వివిధ ప్రదేశాలలో వారి కోసం వెతికారు, కానీ ఫలితం లేకపోయింది. గంటల తరబడి వెతికిన తర్వాత పార్క్ చేసిన కారు లోపల పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్నట్లు వారు కనుగొన్నారు. కేవలం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి.
గత మూడు నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో 150 పైగా చిన్నారులు ఈతకు వెళ్లి, నీటి గుంటలలో చిక్కుకొని, చనిపోయిన సంఘటనలు . గత వారం నగరంలోని మదీనా గూడా చందా నగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెంట్రో ఫుట్ వేర్ గోదాము దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తూ అన్ని వివరాలు సేకరించి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హడావిడి చేస్తుంటారు. ఈ సంవత్సరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు పర్యాయాలు అగ్నిమాపక దళాలతో సమీక్షా సమావేశాలు నిర్వహించినా ఫలితం లేదు. గోడౌన్ల పై సర్వే చేసి రిపోర్టు అందివ్వాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు.
ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నందుకు ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం లేకపోలేదు. జనాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజల సహకారంతో ప్రమాద నివారణకు సరైన నిఘా, అప్రమత్తత లేక భారీ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఏర్పడుతోంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలున్నట్లే, పిల్లల్ని నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు ఉన్నారు. భారం అని వదిలించుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అభం శుభం తెలియని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల చర్యల పట్ల అప్రమత్తత లేకపోతే అనర్థాలు మిగులుతాయి.

9989988912





