గత వారం అమెరికా అధ్యక్షుడు పలు దేశాల ఎగుమతుల పై విధించిన సుంకాల పై ప్రభావం చూపిన దేశాలలో నే కాక అమెరికా లో కూడా వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి . అమెరికా పలు నగరాల్లో ట్రంప్ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. భారత మీడియా కొంచం అతిగా చూపెడుతుందంటూ అమెరికాలో నివసి
దీని ద్వారా భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 2,000 కి పైగా ఉత్పత్తులపై డ్యూటీ ఫ్రీ అవకాశం కోల్పోయింది. ఒకవైపు దేశంలో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆందోళనకరంగా ఉండగా అమెరికా ఉద్యోగాల కోసం ఎక్కువగా ఆధారపడే భారత ఐటీ నిపుణులకు ట్రంప్ పాలనలో నిరాశ ఎదురైంది. హెచ్ -1 వీసా ప్రక్రియ కఠినతరం చేయడంతో, భారతీయ ఐటీ సంస్థలు తమ ఉద్యోగస్తులను అమెరికాకు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు . ఫలితంగా భారత ఐటీ రంగ ఆదాయంలో కొంత మేర తగ్గుదల అనివార్యం. అమెరికా వడ్డీ రేట్లు పెంచడం వల్ల డాలర్ బలపడి రూపాయి విలువ పడిపోయింది.
దిగుమతుల ఖర్చు పెరిగి, భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇది సామాన్య ప్రజలకు భారంగా మారనుంది. .ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడం వల్ల భారత్‌కు చమురు దిగుమతులలో సమస్యలు వచ్చాయి. భారతదేశం ఎక్కువగా ఇరాన్ చమురుపై ఆధారపడేది. ఆ దేశం నుంచి చమురు దిగుమతి తగ్గడంతో, ప్రత్యామ్నాయ దేశాల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. ట్రంప్ “అమెరికా లో ఉత్పత్తి చేయండి” అనే విధానం వల్ల, అమెరికా కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో వెనుకంజ వేస్తున్నాయి. ఇది భారతదేశానికి వొచ్చే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపనుంది . అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టే విషయంలో అప్రమత్తంగా మారడం, ఇండియన్ మార్కెట్ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది .
భారతదేశాన్ని 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మలచడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన ఆర్థిక లక్ష్యంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే, భారత్‌కు ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, మరియు అంతర్జాతీయ సహకారం కీలకంగా మారతాయి. అయితే అమెరికా పాలకులు – ముఖ్యంగా ట్రంప్ పాలన ప్రారంభించిన మరియు తదనంతరం కొనసాగుతున్న కొన్ని ఆర్థిక విధానాలు – ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. అమెరికా, భారత్ వంటి దేశాల నుండి దిగుమతులపై అధిక సుంకాలు విధించడం వలన భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్‌లో పోటీ అనుకూలంగా ఉండదు. ప్రత్యేకంగా ఉక్కు, అల్యూమినియం, టెక్స్‌టైల్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో అమెరికా దిగుమతి సుంకాలు పెంచడం వల్ల భారత కంపెనీలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇది ఎగుమతుల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది – ఇది 5 ట్రిలియన్ లక్ష్యానికి తీవ్రమైన సవాల్.
Generalized System of Preferences (GSP) నుంచి భారత్‌ను తొలగించిన కారణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్ ఎం ఈ ) తమ ఉత్పత్తులను డ్యూటీ ఫ్రీ గా అమెరికాలో విక్రయించలేని పరిస్థితి ఉంటుంది . ఎగుమతులు తగ్గిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గుతూ, జాతీయ స్థూల ఆదాయ వృద్ధికి బ్రేకులు పడే అవకాశం ఉంది.ట్రంప్ పాలనలో తీసుకువొచ్చిన “అమెరికాలో తయారీ చేయండి” (మేక్ ఇన్ అమెరికా ) విధానం వల్ల, అమెరికా కంపెనీలు తమ పెట్టుబడులను విదేశాల్లో పెట్టడం కన్నా, స్వదేశంలో పెట్టేందుకు మొగ్గు చూపుతాయి . దీని ఫలితంగా, అమెరికా నుండి భారత్‌కు వొచ్చే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ విదేశీ పెట్టుబడులు అవసరం. పరిశ్రమల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల విస్తరణకు, కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టికి ఎఫ్‌డీఐ కీలకం. అయితే అమెరికా పెట్టుబడుల తగ్గుదల వల్ల ఈ రంగాల్లో నిధుల కొరత ఏర్పడి, ఆర్థిక వృద్ధి నెమ్మదించే ప్రమాదం ఉంది.
ట్రంప్ ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు భారతదేశానికి తాత్కాలికంగా కొన్ని నష్టాలను కలిగించే ప్రమాదముంది . ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, ఐటీ రంగం, మరియు ఎగుమతిదారులు ఈ మార్పులకు ఎక్కువగా గురవుతారు . అయితే, దీన్ని భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించడం, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఎదుర్కొనటానికి ప్రయత్నించాలి . భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు ఎలా ఉండబోతున్నాయి దానిపై ఆధారపడి, భారత్ తన వ్యూహాలను సరిచేసుకుంటూ వెళ్ళాలి. ట్రంప్ పాలన భారత ఆర్థిక వ్యవస్థపై కొంత వ్యతిరేక ప్రభావం చూపినా , దీన్ని ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నదని చెప్పవొచ్చు.





