అపార్ట్మెంట్లో ‘వాళ్లు’

అపార్ట్మెంట్లో

సింప్లెక్స్ డూప్లెక్స్ ట్రిప్లెక్స్

ఈ తారతమ్యాలని

వాళ్లు ఊడ్చిపారేస్తున్నారు

 

చుట్టూ గోడలే తారసపడుతున్న చోట

అందరిని కలిపే కారిడార్లో కనిపించని ఫాల్స్ ప్రెస్టేజ్ అడ్డుగోడలు పెరిగిపోతుంటే

ఉరుకుల పరుగులతో వాటిని

వాళ్లు ధ్వంసం చేస్తున్నారు

ఎదురెదురు రెండు ఫ్లాట్లు కీచులాడుకుంటుంటే

మధ్యలో రైలు బండి నడుపుతూ

ఆ రెండింటి చేతులు పట్టుకొని

ప్రశాంతనగరానికెళ్దాం రండని

వాళ్లు లాక్కుపోతున్నారు

ఓనర్లంతా అతికష్టం మీద

మీటింగుకని చేరితే

మీదీ ఒక మీటింగేనా

కలిస్తే మాలా కలవండని

అలవోకగా రోజూ

వాళ్లు కలుసుకుంటూ చూపిస్తున్నారు

వాళ్లెవరు?

ఇంకెవరు

ఎప్పటికీ

వాళ్లు వాళ్లుగానే

ఉండగలిగే

పిల్లలే..

 

-పాయల మురళీ కృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *