“క్షణం క్షణం తెలంగాణ ద్రోహం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2026లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కన ఉన్న ఆంధ్రప్రభుత్వం ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అందుకు బలీయమైన ద్రోహాలు కావాలని చేస్తున్నారు. ఇక ఎవరు పెద్దమనుషులు ఎవరు, జెంటిల్మెన్ వారెవరు? ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి వివాదంలో కోర్టులో సవాలుచేసుకుంటే పై బలం కలిగిన వాడు బలహీనుడైన వాడిని దోపిడీ చేస్తున్నారు.”
38.జనధర్మో విజయతే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దశాబ్దాల పాటు జరిగిన పోరాటంలో ‘పెద్ద మనుషుల ఒప్పందం‘ (Gentlemen’s Agreement) ఉల్లంఘనలే ప్రధాన భూమిక పోషించాయి. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందంపై అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంత నాయకులు సంతకాలు చేశారు. కానీ, అది అమలులోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఉల్లంఘనలు ప్రారంభమయ్యాయి.
అసలు జెంటిల్మెన్ అగ్రీమెంట్ అంటే ఏమిటి?
అంటే ఈ ఎనిమిదిమంది చిత్తశుద్ధితో తెలంగాణ ఉనికిని గుర్తించడానికి, ఉద్యోగాలు ఇచ్చే బతికే అవకాశాలు కల్పించడానికి పనిచేయాలని. అంటే చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు ప్రకారం ఇటువంటి పెద్దమనుషులు వారి ఒప్పందాలు అని రాజ్యాంగంలో ఉండదు. లేదు. రావడం సాధ్యం కాదు. ఈ అంశాలు కోర్టుకు పోకూడదు. తెలంగాణకు ద్రోహం చేయడం జరిగినా సుప్రీంకోర్టు లేదా మరొక కోర్టు ద్రోహానికి పరిష్కారం ఉండదు. దాన్నే పెద్ద మనుషులు స్వయంగా అమలు చేయవలసిన అంశాలని నమ్మకంగా పనిచేయాలి. క్షణం క్షణం తెలంగాణ ద్రోహం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2026లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కన ఉన్న ఆంధ్రప్రభుత్వం ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
అందుకు బలీయమైన ద్రోహాలు కావాలని చేస్తున్నారు. ఇక ఎవరు పెద్దమనుషులు ఎవరు, జెంటిల్మెన్ వారెవరు? ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి వివాదంలో కోర్టులో సవాలుచేసుకుంటే పై బలం కలిగిన వాడు బలహీనుడైన వాడిని దోపిడీ చేస్తున్నారు. ఇద్దరూ మాట్లాడుకుని, పెద్దమనుషుల ముందు రాజీ చేసుకోవాలి కాని, ఆస్తి సొమ్ము అంతా కోర్టులకు లాయర్లకు వృధాచేయడం వేరు. అదే ద్రోహం. దానికి పరిష్కారం లేదు. కనుక సుప్రీంకోర్టులో ద్వారా పరిష్కారం ఇవ్వలేదు. నిష్పాక్షకంగా జడ్జిలు కూడా ద్రోహమే చేసిన సందర్భం ఉందని మామూలు మాటల్లో ఒప్పుకుంటారు. కాని బయట ఏదీ చెప్పరు. కనుక పరిష్కారంలేని ఈ ద్రోహాలపై పోరాటాలు, ఆత్మహత్యలు, వేర్పాట్లు, ఏర్పాట్లు విడిగా ఉంటాయి. అసలు పెద్దమనుషులు అనేవారెవరూ లేరు. ఉండరు. భార్యభర్తల మధ్య నేరాలుచేస్తూ కొట్టి, దోపిడీచేసి, వారి డబ్బంతా దోచుకుంటూ ఉంటే, పెద్దమనుషులు ఎవరు? పోలీసుస్టేషన్లో బెదిరించి, లంచం తీసుకుని ‘పరిష్కారం’ చేస్తున్నా, లంచాలు, జడ్జిలు, లాయర్లు కూడా నిష్పాక్షంగా పనిచేసేవారెవరు?
‘తెలంగాణ వార్తలు’ పేరుతో ఈ మ్యాప్ తయారు చేసారు (ఫేస్ బుక్ లో) 1865లోనే హైదరాబాద్ రాజ్యం (హైదరాబాద్ డొమినియన్స్) తన ప్రాంతాలను భాషా ప్రాతిపదికంగా పునర్వ్యవస్థీకరించింది. అది • తెలంగాణ: తెలుగువారి కోసం, • మరాఠ్వాడ: మరాఠీవారి కోసం
కర్ణాటక (హైదరాబాద్ కర్ణాటక): కన్నడిగుల కోసం సృష్టించారు. ఇదీ భాష ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చేసారు. భారతదేశంలో1956లో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ (States Reorganisation Act)కు చాలా ముందే, నిజాం హైదరాబాద్ రాజ్యం భాషల ఆధారంగా దాని ఉపాంత్రాలను (సుబాలు: వరంగల్, మెదక్ – తెలంగాణ; ఔరంగాబాద్ – మరాఠ్వాడ; గుల్బర్గా – కర్ణాటక) విభజించింది. వేణు గోసాయ్ గారు ఫేస్ బుక్ లో ‘‘ముఖ్యంగా నడిగడ్డగా పిలువబడే గద్వాల ప్రాంతం బాషా ప్రయుక్త రాష్ట్రల వల్ల చాలా చాలా నష్టపోయింది. రాయచూర్ నుండి రావలసిన ఎగువకృష్ణ కాలువ ఆగిపోయింది. ఇంకా 370/J ఆర్టికల్ అమలు చేయబడలేదు.వాల్మీకి వారు ST హోదా కోల్పోయారు. ఎప్పుడో రావలసిన గద్వాల్ రైల్వే జంక్షన్ చాలా ఆలస్యం అయినది. అదేవిదంగా రోడ్డు రవాణా సౌకర్యాలు అనేకం కోల్పోవడం జరిగిందని’’ రాసారు.
ఆ ఉల్లంఘనలు ఏమిటి? అవి ఎందుకు?
ప్రధానమైన ఉల్లంఘనలు
ఉప ముఖ్యమంత్రి పదవి: ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాడు కావాలి. దీనివల్ల తెలంగాణకు పాలనలో కీలక భాగస్వామ్యం దక్కలేదు. ఒప్పందం తరువాత ఉపముఖ్యమంత్రిని నియమించారు. కానీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, “ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఆరో వేలు లాంటిది” అని వ్యాఖ్యానిస్తూ ఆ పదవిని భర్తీ చేయలేదు. 1972లో జె వి నరసింగరావు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విధంగా ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రనాయకులు అయిన తరువాత కూడా ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ కు ఇవ్వలేదు. డాక్టర్ ఎం చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నదశలో ఆంధ్ర నాయకులలో ఉప ముఖ్యమంత్రి గా లేరు. ఉపముఖ్యమంత్రులు చాలా సందర్భాలలో నియమించలేదు. ఒక వేళ ఉన్నా వారికి ఏ ప్రాథాన్యత ఉండదు, చాలా మందికి ఉపముఖ్యమంత్రి ఎవరు అంటే తెలియదు కూడా. ఇదీ గతి తెలంగాణ రాష్ట్రం వచ్చినా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి పెద్ద ప్రయోజనం లేని పదవులే. కనుక ఆరో నెలలు అనడంలో తప్పేమీ లేదు. అప్పుడూ ఇప్పుడూ వృధాయే.
ముల్కీ నిబంధనలు (ఉద్యోగాలు): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు 12 ఏళ్ల నివాస అర్హత (ముల్కీ) ఉండాలి. కానీ, నిబంధనలను తుంగలో తొక్కి వేల సంఖ్యలో ఆంధ్ర ప్రాంతం వారు దొంగ సర్టిఫికెట్లతో ఇక్కడ ఉద్యోగాలు పొందారు. ఇది నిరుద్యోగ తెలంగాణ యువతలో తీవ్ర అశాంతికి కారణమైంది. ఎప్పడికీ ఏదో రకంగా దొంగతనంగా ఉద్యోగాలు కొట్టేసారు. కొట్టేస్తున్నారు కూడా. ఆంధ్ర నాయకులకు, ప్రభుత్వాలకు ఈ విషయం తెలుసు. అధికారులు అండదండలతో అక్రమాల ద్వారా తెలంగాణకు నష్టం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంటే, తెలంగాణ వచ్చిన తరువాతా, ఏ పార్టీ ఉన్నా, 2026లో కూడా ఇదే గతి.
మిగులు నిధులు (Revenue Surplus): తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని ఒప్పందంలో ఉంది. కానీ, తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు (ఉదాహరణకు: కృష్ణా డెల్టా కాలువలు) మళ్లించారు. దీనివల్ల తెలంగాణ నిధులతో ఆంధ్ర అభివృద్ధి చెందిందనే భావన పెరిగింది.
తెలంగాణ ప్రాంతీయ కమిటీ (TRC): తెలంగాణ ప్రయోజనాల రక్షణ కోసం ఒక చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ దానికి సరైన అధికారాలు ఇవ్వలేదు. కేబినెట్ తీసుకునే నిర్ణయాలను అడ్డుకునే శక్తి ఆ కమిటీకి లేకుండా చేశారు.
మద్యపాన నిషేధం & ఎక్సైజ్ ఆదాయం: తెలంగాణలో అప్పట్లో మద్యం అమ్మకాలు ఉండేవి, ఆంధ్రలో నిషేధం ఉండేది. తెలంగాణ నుంచి వచ్చే ఆబ్కారీ ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేయాలన్న నిబంధనను కూడా పాటించలేదు.





