సంచారజాతుల సంక్షేమం తుంగలో తొక్కిన ప్రభుత్వాలు

దేశంలో  ఎత్తైన  ఆకాశాన్ని  తాకే ఎత్తైన  విగ్రహాలు నెలకొల్పడానికి  అడవులను  ఛిద్రం చేసి, పర్యావరణాన్ని బ్రష్టు పట్టించి  వేల కోట్లు  ఖర్చు చేస్తున్న  ప్రభుత్వం,  ఈ  దేశ మూలవాసులైన  వారి సంక్షేమం  పూర్తిగా  తుంగలో  తొక్కింది.  భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. అనేక దేశాల్లో రక్షణ కోసం అనేక నమూనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వర్గాలకు చెందిన భాషలు. భారతదేశం భాషాపరంగా ప్రసిద్ధి చెందింది సాంస్కృతిక వైవిధ్యం. అయితే అధికారిక గణాంకాలు లేవు. ఇప్పటివరకుఎన్టీ /ఎస్ఎన్టీ / డిఎన్టీ  కమ్యూనిటీల భాష మాట్లాడేవారికి సంబంధించినది.  కొన్ని అంచనాల ప్రకారం  ఎన్టీ / ఎస్ఎన్టీ  కి చెందిన 198 సంఘాలు ఉన్నాయి. డిఎన్టీ కమ్యూనిటీలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వాటిపై విస్తరించాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 59 సెక్షన్లు ఉన్నాయి.

వారి స్వంత మాండలికాలతో ఎన్టీ / ఎస్ఎన్టీ / డిఎన్టీ సంఘాలు. ప్రతి సంఘం ఉంది విస్తారమైన జ్ఞానం, వారి ఔషధ అభ్యాసం, పర్యావరణ జ్ఞానం,  వాతావరణ నమూనాలు, ఆధ్యాత్మిక వైఖరులు, కళాత్మక మరియు పౌరాణిక కథలు. వీరి కళలు ఇంతకు ముందు జంగం కథలుగా ఈనాడు, బుర్రకథ గా పిలువబడుతుంది. ఒకనాడు మత ప్రబోధానికి, దేశభక్తికి ప్రతిబింబంగా నిలబడిన జంగం కథా కళారూపం రాను రాను యాచనకు, ఉదర పోషణ కూ ఉపయోగపడి తిరిగి ఈ నాడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది. జంగం కథలు చెప్పే వారిని బుడిగె జంగాలని పిలుస్తారు. బుడికెను కంచుతో గానీ ఇత్తడితో గానీ తయారు చేస్తారు. గుమ్మెట కు ఒక వైపు బెత్తపు చత్రాన్ని బిగించి, తోలుతో మూస్తారు. రెండవ పక్కన కూజామూతిలాగా, అనాచ్ఛాతీతంగా వుంటుంది. కథకునికి ఇరు ప్రక్కల వున్న వంత గాళ్ళు ఒక్కొక్కరూ తమ గుమ్మెటను చంకకు తగిలించుకుంటారు. కుడి చేతి వ్రేళ్ళతో, చర్మము పైన వాయిస్తూ రెండో ప్రక్క మూస్తూ గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు. కథ చెప్పె బుడిగె జంగం నిలువుటంగీ తొడిగి, తలపాగా చుట్టి, కాళ్ళకు గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజం మీద తంబురాను ధరించి, చేతి వేలికి అందెలు తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ రెండవ చేతితో తంబురా తీగను మీటుతూ కథను ప్రారంభిస్తారు.

కథకునికి వంతలుగా వున్న వారు గుమ్మెటలు ధరించి కథకునికి పంత పాడుతూ, పాట వరుస ననుసరించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య మధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని కుమ్మరిస్తూ, ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు.  ఆంధ్రప్రదేశ్‌లోని  షెడ్యూల్డ్ తెగలు, సంచార  డీనోటిఫైడ్ తెగలు ప్రధానమైనవి  వారు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.  కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు  వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. జటాపు, కొండ దొర, మూక దొర, మన్నె దొర, సవర, గదబ, చెంచు, కోయ, గొంది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఆదిమ గిరిజన సమూహాలు  ఉన్నాయి.  దాసరి, ఎరుకల, యానాది, సుగాలి, కొరవ, కొరచ, కైడై  నక్కలా  ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని డినోటిఫైడ్ తెగలు. ఇంకా, వడ్డెర, పాముల, నిర్షికారి, బుడబుక్కల, మందుల, పూసల, గంగి, రెడ్దుల, బోయ, దొమ్మర, జోగి సంచార  పాక్షిక సంచార తెగలలో కొన్ని.  సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం ప్రధాన అర్హత కలిగిన షెడ్యూల్ కులాల్లో  ఇంకా అణగారిన, ఏమాత్రం గుర్తింపు లేని జంగమ దేవర, డక్కలి, కిన్నెర జోగులు, బేడ బుడగ జంగాల కులాలు నేడు కనుమరుగై పోతున్నాయి. జంగమోళ్లు   వీరిని జంగం దేవర అని కూడ అంటారు.

వీరు శివ భక్తులు. నొసటన వీభూతి ధరించి చేతిలో పెద్ద గంట పట్టుకొని వాయిస్తూ సంక్రాంతి ససందర్భంగా ఆ నెల అంతా తెల్ల వారు జామున వీదుల్లో తిరుగుతు శివ కీర్తనలు చేస్తూ, ఆ రోజు తిథివారనక్షత్ర పలాలను తెలిపి తెల్లవారాక ప్రతి ఇంటికి వచ్చి సంభావన తీసుకునే వారు. అప్పటికే వీరు అంతిమ దిశలో వుండే వారు. వీరు అంతరించి చాల కాలమే అయింది. జంగం వారి జనాభా అతి తక్కువ. ముఖ్యంగా వీరు శివ భక్తులు. వీర భద్రుని ఆలయాల్లో పూజారులు వీరే వుంటారు. గతంలో వీరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తీక మాస నెలంతా తెల్లవారు జామున తిరిగుతూ గంట వాయిస్తూ, శివనామ స్తుతి చేస్తూ తిథి, వార, నక్షత్రాలను చెప్పి,  తెల్లవారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంబావన పొందుతారు. ఇలా తిరిగే వారిని జంగం దేవర అని అంటారు. వీరు శుభాశుభాలు చెప్పుతారు. వీరికి సమాజంలో బ్రాహ్మణుల తరువాత గౌరవ స్థానం వీరిదే. వీరి వేష ధారణ కూడ గౌరవ ప్రదంగా వుంటుంది.

కాషాయ వస్త్రాలు ధరించి, తలపాగా కట్టి, భుజాన కావడి లేదా జోలే, ఒక చేతిలో గంట, రెండో చేతిలో శంఖం ఉంటుంది. శివ స్తుతి చేస్తూ గంట వాయిస్తూ, మధ్య మధ్యలో శంఖాన్ని పూర్తిస్తారు. వీరిని పల్లె ప్రజలు శుభప్రదంగా భావించేవారు. వీరు కుల వృత్తి ఏనాడో మంటగలిసింది. ఎక్కడో కొందరు మిగిలిన వారు తమ పూర్వీకులు నేర్పిన విద్య భిక్షాటనకు ఉపయోగించుకుని జీవనం సాగిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో 9వ కులం బేడ బుడగ జంగం. బుడిగ, బేడ ఇలా రెండు రకాలుగా పిలువబడతారు.వీరు బుర్ర కథలు చెబుతారు. పగటివేషాలు . భిక్షాటన ఇవన్నీ వీరి కుల వృత్తులు. వీరికి సొంత భాష ఉంది.  పెరుగుతున్న సాంకేతిక తో  పోటీ పడలేక తమ తెగలు  తరుగుతున్నది అని  వాపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం పౌర సమాజం తమ కళను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ కూలీలు కార్మికులు, తాపీ మేస్త్రి గా రూపాంతరం చెందారు. ఉన్న కొద్ది మంది కడుపు నింపుకోడానికి  చిన్న చిన్న  కమతాలలో పోడు సేద్యం చేసుకొని జీవిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *