తెలంగాణాసమస్య-ఆందోళనలపై వంద కోట్లు నిధులు మిగిలినవా లేదా?

“అనన్య మేధావి, రాజనీతి చతురుడు, అపర చాణక్యుడు, వాసికెక్కిన రాజకీయవేత్తలలో ప్రముఖుడు కాసు బ్రహ్మానంద రెడ్డి  (జూలై 28, 1909 – మే 20, 1994). ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే అని ప్రసిధ్ది నాయకుడు.”

31. జనధర్మో విజయతే

జనధర్మ ప్రత్యేక సంచిక (సంపుటి 13 సంచిక 7: తేదీ 5.6.1969) సంపాదకీయం లో రేడియో ఇంటర్వ్యూ కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రశ్నలకు కొన్ని జవాబులు ఈ విధంగా ఉన్నాయి.

ప్రశ్న- వంద కోట్లు నిధులు మిగిలినవి. వాటిని యెక్కడికో తరలించి వేశారు అని చేసే ఆందోళన గురించి మీరు ఏమి చెప్తారు?

ముఖ్యమంత్రి: తరలించడమన్న ప్రశ్నే లేదండి. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టినప్పుడు నాలుగైదు రకాలుగా ఖర్చు పెడతానని కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి వచ్చే అప్పులూ ప్రజలవద్ద నుండి ప్రతి సంవత్సరం తీసుకొనే అప్పులూ.. ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ తదితర డిపాజిట్లు- యిలా ఈ నిధులన్నీ ప్రభుత్వ కోశాగరంలో అనేక రూపాలలో ఉంటాయి. ఈ నిధుల్ని ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఏడాది ఒకచోట యెక్కడన్నా రెండుకోట్లు రూపాయలు ఎక్కువ ఖర్చు కావచ్చు.

ఇంకోచోట రెండు కోటు తక్కువ కావచ్చు, ఇప్పుడు తెలంగాణా ప్రాంతంలో ఖర్చుకూడా వారు చూచినట్లయితే ఈ 12 సంవత్సరాలలోనూ రెండు మూడు సంవత్సరాలలో అసలు మిగులు నిధులు అనే మాటే లేకుండా అంతకన్న ఇంకా యెక్కువగానే ఖర్చు పెటడం జరిగిన సంగతి మనకు విదితమౌతుంది కాబట్టి ఖర్చు జరగడమనేది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది ఐతే ఎప్పుడైనా ఒకచోట ఏదైనా ఇబ్బందులు గాసి కలిగితే అది కేవలం పరిపాలనా సంబంధమైన ఇబ్బందులే .

ప్రశ్న-ముఖ్యంగా 1966–67, 1967–68 సంవత్సరాలలో నేను చూసిన అంకెలను బట్టి తెలంగాణా ప్రాంతంలో ఖర్చు పెట్టవలసిన దానికన్న ఎక్కువగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తోంది. అవునంటారా.

ముఖ్యమంత్రి: అవునండి. 1/3 కంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టడం జరిగింది. అలా చేసినందుకు ప్రభుత్వం తప్పు చేసినట్లుగా అనుకోవడం లేదు మరి. ప్రభుత్వం తప్పులు చేసింది..

ప్రశ్న- ఐతే ఇప్పుడు వచ్చిన చిక్కంతా ప్రభుత్వం తప్పులు జరిగాయని ఒప్పుకోవడం వల్లనే అని మీరు అనుకుంటున్నారా?’

ముఖ్యమంత్రి: నేను అలా ఒప్పుకున్న మాట వాస్తవమే. అది గాంధీగారి పద్ధతి అనుకున్నాను. లోపం పెద్దదైనా చిన్నదైనా అది కనిపించినప్పుడు దాన్ని ఒప్పుకొని సరిదిద్దుకోవడం పెద్దమనిషి తరహా అనుకున్నాను. ఒప్పుకున్నాను కనుక దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపిస్తే అది దీర్ఘకాలం కుదరదు. నిజం నిలకడ మీద తెలియక మానదు.

ఆంధ్ర ప్రాంతం పెత్తనం

ప్రశ్న- ఈ ఆందోళన గురించి మాట్లాడేప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు అనే ఆరోపణ జరుగుతోంది దానిని గూర్చి మీరు ఏం చెబుతారు?

ముఖ్యమంత్రి: ఒక ఆరోపణ ఉన్నమాట నిజమేకాని పెత్తనం మాత్రం చెలాయించడం అన్న దానికి ఆస్కారం లేదు. ఎవ్వరయినా అతను ఆంధ్ర ప్రాంతం వాడైనా, మరే ప్రాంతం వాడైనా యెప్పుడయినా ఒక మాదిరిగా ప్రవర్తించినప్పటికీ దానివల్ల దేశంలో వారంతా అదే మనస్తత్వం కలవారనీ అనుకోవడం యెంతో పొరపాటు ఎవరిపైనైనా దౌర్జన్యం చేసినా. చెడుగా మాటలు అన్నా. ఒక రాయి విసిరినా ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలలోని ప్రజలందరూ రాళ్లు వేసే వారిని అనుకోవడం పొరపాటు నీకు ఏమైనా అటువంటి మనస్తత్వం ఏ ఒక్కరిలోనూ ఉండకూడదు.

పోచంపాడు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది

యం యస్ ఆచార్య ప్రశ్న: తెలంగాణా జిల్లాలకు వరప్రసాదం అనుకుంటున్న పోచంపాడు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది. ఈనాల్గవ ప్రణాళికా కాలంలో పూర్తి కాదని కొంతమంది అనుకుంటున్నారు అయ్యే కాశం ఉందా? ఒక వేళ అవసరమయినట్లయితే, ప్రణాళిక కేటాంపు నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ కూడా డబ్బు ఖర్చుపెట్టి పూర్తి చేయిస్తుందా!

ముఖ్యమంత్రి పోచంపాడు ప్రాజెక్టుకు 1..63లో పండిత్ జవహర్ లాల్ నెహ్రూగారు శంఖుస్థాపన చేశారు. దానికి అప్పట్లో 28 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అనుకున్నాం. కాని అనేక ప్రాజెక్టుల మాదిరి దీనికి కూడా ఇప్పడు ఖర్చు 55 కోట్ల రూపాయల పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏమిటంటే మనకు ఎంత నీరు లభ్యమయితుందో అంత నీరును మనం వాడుకోవాలి. పోచంపాడు ప్రాజెక్టును శీఘ్రంగా అమలు జరపడమే కాకుండా అవసరమయితే కొన్ని మార్పులు కూడా చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పం.

నాల్గవ ప్రణాళిక పూర్తి అయ్యేసరికల్లా పోచంపాడు ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. శాసనసభలో కూడా ప్రభుత్వపక్షాన ఇది వరకే చెప్పడం జరిగింది. ప్రాజెక్టు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు ప్రజలకు లభింపజేయాలని సంకల్పం పోచంపాడు ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్టు. నాగార్జునసాగర్ మాదిరి కాకుండా. ఈ ప్రాజెక్టువల్ల 20.21 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత వెంటనే ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు మా అంచనా ప్రకారం వచ్చే సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ లోపు 40 వేల యెకరాలకు నీరు ఆందించాలని ప్రయత్నం చేస్తున్నాం.

బహుశః దేవుని దయవల్ల యిది సాధ్యం కావచ్చు. అదేవిధంగా 55 కోట్లకు పెరిగిన ఈ ప్రాజెక్టు ఖర్చు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దిగువ మానేరు నదిపైన ఒక అక్విడెక్టు కట్టాలని అనుకున్నాం. ఇప్పుడు ఇది వరకు అక్విడెక్టు బదులు డామ్ కట్టాలని ప్రభుత్వము సంకల్పిస్తున్నది.

ప్రశ్న- నాలుగో ప్రణాళిక కాలంలోనా?

ముఖ్యమంత్రి: అవును కొద్ది మాసాలలోనే దానికి పునాది వేయాలని కూడా అనుకుంటున్నాం. దీనివల్ల మానేరు నది నీటిని యెక్కుగా వాడుకోడానికీ. ఇది వరకు అనుకున్న దానికంటే అదనంగా కొన్ని లక్షల యెకరాలకు నీరు అందించడానికీ వీలుంటుంది. దీనివల 55 కోట్ల ఖర్చు 68–67 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టును శీఘ్రంగా పూర్తిచేయడమే కాకుండా యీలోగానే దాని ఫలితాలను ప్రజలకు ఎంత వరకు వీలైతే అంతవరకు అందించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.

దీనికి అవసరమయిని కేటాయింపులు ప్రణాళికలో చేస్తున్నాం. ఇంకా ఏదైనా అదనముగా కావలసివచ్చినా చేసుకుంటాం. ఇటువంటి పెద్ద ప్రాజెక్టుల గురించి ఆలోచించేటప్పుడు 3 సంవత్సరాల తరువాత ఏమవుతుందని ఆలోచించడం కొంచం కష్టం. కాబట్టి దానికి కావలసిన సహాయం కేంద్రం నుంచికూడా ఆర్జించి తీసుకువచ్చి దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *