సెప్టెంబర్ 17 వస్తోందంటే తెలంగాణలో పోటాపోటీ రాజకీయం జరిగేది. ఆ రోజును రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.ఆ రోజున మొండికేసిన నిజాం సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో దేశంలో విలీనం చేశారు. విలీనం అని ఒకరు.. విమోచన అని ఒకరు.. విద్రోహదినం అని మరొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా అనుకుని దానికి తగ్గట్లుగా రాజకీయాలు చేస్తూంటారు. అధికారికంగా నిర్వహించాలని బీజేపీ చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. చివరికి కేంద్రమే చేయడం ప్రారంభించింది. దాంతో వివాదం సమసిపోయింది. ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదు.ఈ సెప్టెంబర్ 17న కూడా అలాంటి రాజకీయం చేయాలని కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ వారి మాటలకు విలువ లేకుండా పోయింది.
బీజేపీ ఇలాంటి వివాదాలతో ఎక్కువ లాభపడుతూ వస్తోంది. ఇది ఖచ్చితంగా విమోచన దినోత్సవమేనని నిజాం ను తరిమేసి.. దేశంలో నిజా సంస్థానాన్ని భాగం చేశారు కాబట్టి విమోచనం అంటుంది. కాంగ్రెస్ పాలసీ ప్రకారం.. విలీనం జరిగింది. కమ్యూనిస్టుల భావజాలం ప్రకారం విద్రోహదినం అనుకోవాలి. కమ్యూనిస్టులు పలుచబడేకొద్దీ వారి వాయిస్ కూడా వినిపించడం తగ్గిపోయింది. విలీనమో.. విమోచనమో ఏదో ఒకటి జరిగిపోయింది.. కానీ దాని వెనుక ఇంత కాలం పెంచుకున్న సెంటిమెంట్ రాజకీయాలకు బ్రేక్ పడింది. ఈ రాజకీయాలు, భావోద్వేగాలపై ప్రజలు కూడా ఆసక్తి కోల్పోయారు. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదు. కానీ బీజేపీ, కమ్యూనిస్టులు లాంటి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కానీ మీడియా కూడా వాటిని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది.
“చరిత్ర అంటే స్వేచ్ఛా స్ఫూర్తి చైతన్యపూరితంగా స్వీయ, పరిపూర్ణతకి చేరుకునే ప్రక్రియ” అని హెగెల్ అభిప్రాయం. చైతన్యపూరితమైన ప్రయత్నంగా నిర్వచించబడిన రాజకీయాల ద్వారా ఒక దేశంలోని విబేధాలు, చీలికలు సంవాదం ద్వారా ఏకత్వం, సామరస్యం అనబడే అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి.నేడు తెలంగాణా విషయంలోనూ ఆ హెగెలియన్ సూత్రాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. తెలంగాణలో అరాచక పాలనతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడి, ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న రాజాకారులను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ. ఈ పోరాటంలో ఎంతో మంది అసువులుబాశారు. వారిని స్మరించుకునేందుకు తెలంగాణ విమోచన దినాన్ని జరుపుతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తూ వచ్చింది.
బీజేపీ నేతలు. నిజాం పాలన అదే విధంగా వారి వికృత చేష్టలు వెల్లగడుతూ ప్రత్యేక స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. వారి పాలన ఏ విధంగా ఉందనేది అద్దం పట్టే విధంగా ఆ ఫోటో ఎగ్జిబిషన్ లో కనిపించేది. అయితే గత పదేళ్ల నుండి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉత్సవాలకు దూరంగా ఉండటంతో బీజేపీ ఆధ్వర్యంలోనే జరిపించారు.గత ఏడాది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..సెప్టెంబరు 17ను ఏ పేరుతో నిర్వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తెరదించుతూ.. తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అదే స్పూర్తితో ఈ సంవత్సరం ఏర్పాట్లకు కూడా సర్కారు స్పష్టత ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాలో ఏర్పాట్లు చేయాలని సర్కులర్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా జిల్లాకు ఇంచార్జ్‌లుగా మంత్రులను నియమించారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయయించడం ముదావహం.
విమోచన’ అనే పదం వినడానికి నిర్మాణాత్మకమైన పదంగానే అనిపించినా హైదరాబాద్ నేపథ్యంలో దానికంటూ ఒక ప్రతికూలమైన భావననే అంటగట్టారు.1948లో జరిగింది నైజాం పాలన నుంచి విమోచన అని చెప్పేవారు హైదరాబాద్ రాజ్యంలోని మిగతా విషయాలను విస్మరించి కేవలం హైదరాబాద్ పాలకుడి మతాన్నే ఉద్ఘాటిస్తున్నారు. ఈ అభిప్రాయం ప్రకారం నైజాం పాలన కేవలం అధిక సంఖ్యాక హిందువులను ముస్లింలు అణిచివేసిన పాలన. కాబట్టి 1948లో ముస్లిం పాలన నుంచి హిందువులు విమోచన పొందారు. కొంతకాలం మతకల్లోలాలు జరిగిన చంద్రబాబు, వైఎస్సార్ , కేసీఆర్ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా మతతత్వ ఘర్షణలు కనుమరుగైనాయి.
ఈ వాస్తవానంతర కాలంలో అటువంటి బాధాకరమైన జ్ఞాపకాలనే రాజేయ్యటం వల్లన ఘర్షణలు కొత్తగా మొదలయ్యే అవకాశం లేకపోలేదు.ఇక ఎన్నికలలో మతతత్వ కార్డుని వాడుకునే రాజకీయ శక్తులు తరచూ గొడవలు సృష్టించే పరిస్థితి లేకుండా పోయింది. ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను ఎత్తి చూపుతూ, బాధాకరమైన జ్ఞాపకాలను పాతిపెట్టవలసిన బాధ్యత నేడు లౌకిక, పౌర, సామాజిక శక్తులపై ఉన్నది.’గంగా జమునా సంస్కృతి’కి ఒకప్పుడు పేరుగాంచిన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింతగా నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ ప్రభుత్వం నేడు ప్రజాపాలన దినోత్సవం సామాజిక సామరస్యాన్ని నిలబెట్టి, ఈ రాష్ట్ర శాంతియుత అభివృద్దికి దోహదం చెయ్యగలదనే భావం అందరిలో నెలకొంది.
సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో పాలిటికల్ హిట్ రాజేస్తున్న డే కూడాను.. విమోచనమా? విలీనమా? విద్రోహమా? అనే కాంట్రవర్సీ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇలా సెప్టెంబర్ 17ను ఎవరికీ నచ్చిన విధంగా వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచీ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌ను వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఆయా పార్టీల కార్యాలయాల్లో వేర్వేరు పేర్లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. కానీ, గత ఎన్నికలకు ముందు మాత్రం సెప్టెంబరు 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. బీజేపీ దీన్ని ముస్లింలపై సాధించిన విజయంగా చూపడానికి విముక్తి దినంగా ప్రచారం చేసుకునేందుకు తహతహ లాడుతుంది.
నాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది చనిపోయారు. బీజేపీ మాత్రం కమ్యూనిస్టుల పోరాటాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మగ్దూం మొహినొద్దీన్,బద్దం ఎల్లారెడ్డి ,రవి నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధపోరాటం ప్రారంభమైన తరుణంలో నిజాం నవాబు సెప్టెంబర్ 17న విధిలేక గత్యంతరం అయినా పరిస్థితుల్లో బ్రతికి ఉంటే బలుసు ఆకూ తినొచ్చని కేంద్రానికి లొంగిపోయారు. అందుకే విలీనదినంగా కమ్యూనిస్టులు భావిస్తున్నారు.మరోవైపు కేంద్రంలోని బీజేపీ కుల,మతాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురాశతో తెలంగాణ విమోచన దినోత్సవం ఆడంబరంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నది. సెప్టెంబర్ 17 ను రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా ,ఎన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు కాదనేది నిర్వివాదాంశం.





