ఎన్ని ఇబ్బందులు వొచ్చినా ప్రజావాణి ఆగదు

కప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాం..
కపోడు సాగుకు సోలార్‌ పంపు సెట్లు
కడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 :  గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని, తమ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలను నెరవేర్చేం దుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో   డిప్యూటీ సీఎం మాట్లా డారు. ఫారెస్ట్‌ రైట్‌ యాక్ట్‌ ద్వారా పట్టాలు పొందిన పోడు రైతులకు  సోలార్‌ పంపు సెట్ల ద్వారా కరెంట్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోడు రైతులు సోలార్‌ పవర్‌ పెట్టుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడిరచారు. ప్రజల అవసరాలు వారి ఇబ్బందులను నేరుగా చెప్పుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రజావాణి ని ఏర్పాటు చేసిందన్నారు.

ఎన్ని ఇబ్బందులు వొచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని వెల్లడిరచారు. ప్రజావాణిలో పెట్టుకున్న దరఖాస్తులకు పరిష్కారం లభించిందని లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ప్రజల అవసరాలు తీర్చేందుకే పనిచేస్తున్నదని ప్రజావాణిలో వొచ్చిన ప్రతి దరఖాస్తును కంప్యూటరైజ్‌ చేసి సంబంధిత అధికారులకు ఆ దరఖాస్తులను పంపించి, ఆ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారి తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చెప్పే విధంగా పర్యవేక్షించడం వల్లే దరఖాస్తుదారులు సంతోషాన్ని వెలిబుచ్చు తున్నారని వివరించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పని చేస్తూ ప్రజాస్వామ్యానికి పునాదులు వేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలనే రాహుల్‌ గాంధీ ఆలోచనా విధానానికి అనుగుణంగా, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను తూచా తప్పకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యతతో ఇందిరమ్మ రాజ్యంలోని ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు.

బిఆర్‌ ఎస్‌ హయాంలో 70ఏళ్లు వెనక్కి..
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చకపోగా 70 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందని భట్టి విక్రమార్క విమర్శించారు, భావస్వేచ్ఛ, ప్రగతిశీల ఆలోచనలకు స్థానం లేకుండా గుప్పిట్లో బంధించి పాలన అందించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా పోడు రైతుల సమస్యలను గత బిఆర్‌ఎస్‌ పాలకులు పట్టించుకోలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వొస్తే తప్ప మన ఆకాంక్షలు నెరవేరవని భావించి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో ఒక వైపు భారీ బహిరంగ సభలు నిర్వహించగా, సిఎల్పీ నాయకుడిగా తాను ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్లామన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మన సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజలకు చెప్పడంతో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని దీవించి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *