- సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ
- భక్తుల కోసం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి
- అధికారులకు మంత్రి ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ యేడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు రూ. 25 కోట్లు మంజూరు చేసినందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సరస్వతీ నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తుల కోసం మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు.
అన్ని శాఖల సమన్వ యంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 2013లో వొచ్చిన సరస్వతీ నది పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో గతంలో కంటే మిన్నగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా, అత్యంత వైభవోపేతంగా సరస్వతీ నది పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే