Day March 31, 2026

నలందలో ఆలయంలో వద్ద తొక్కిసలాట

– 8మంది మహిళా భక్తుల మృత్యువాత పాట్నా, మార్చి 31: బీహార్‌లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. నలంద జిల్లాలోని శీతలా మాత ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. అందరూ మహిళలే కావడం గమనార్హం.ఈ ఘటనలో…

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం

– తడిసి ముద్దయిన వరి, పసుపు పంటలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మామిడి పంటలకు తీవ్ర నస్టం వాటిల్లింది.  బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో వరి కోతలు చురుగ్గా సాగుతున్నాయి. చేతికి వచ్చిన ధాన్యాన్ని ఆరబోయగా తడిసి ముద్దవడంతో…

కూకట్‌పల్లిలో దారుణం

– ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31: కూకట్‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్‌ ‌రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా…

హైదరాబాద్‌లో జయలలిత ఇల్లు సీజ్

– ఇంటి పన్ను చెల్లించకపోవడంతో చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని ఇంటికి  పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు…

మావోయిస్టు భావజాలవ్యాప్తి  ఆగుతుందా?

– అణచివేత ఉన్న చోటనే తిరుగుబాటు పుడుతుంది – విప్లవోద్యమానికి ఆటుపోట్లు, పతనాలు సహజమే.. – సిద్ధార్థ శంకర్ రే అణచివేత నుంచే ఎగసిపడిన విప్లవ కెరటం – ఇప్పుడు ఆపరేషన్ కగార్ తో కనుమరుగవుతున్నా – ఇజం’ నిప్పు మండుతూనే ఉంటుంది – ఇది చరిత్ర చెప్తున్న సత్యం – కేఎస్ ‘ఆత్మవిమర్శ’తో ముందుకు?…

బెంగుళూరులో టెకీ దంపతుల ఆత్మహత్య

– యువకుడిది సిద్దిపేటగా గుర్తింపు – దర్యాప్తు చేస్తున్న పోలీసులు బెంగళూరు,మార్చి 31: బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణ సిద్దిపేటకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. సిద్ధిపేట ప్రాంతానికి…

చిన్నారిపై అస‌భ్య దృశ్యాల చిత్రీకరణ‌

– వ‌రుస‌కు సోద‌రుడి అకృత్యం – నిందితుడి అరెస్ట్ – టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: ఐదేళ్ల చిన్నారిపై అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన ఉదంతంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దృశ్యాలను…

కేర‌ళంలో యూడిఎఫ్ సెంచ‌రీ ఖాయం

– మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31 : కేర‌ళంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సార‌థ్యంలో గ‌ల యూడిఎఫ్ 140 సీట్ల‌కు గాను 100కు పైగా సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి విశ్వాసం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న…

గ్రామ సభలకు సన్నద్ధం

– అమలులో ఉన్న, కొత్త పథకాలను వివరించాలి – ‘ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…