Day March 26, 2026

ఫైనాన్స్ నిధులు పోతాయనే ఎన్నికలకు వెళ్లాం

– పంచాయతీలకు ఇవ్వకుంటే దీపాలు ఎలా పెట్టాం – మీరు పెట్టిన ఈఎన్‌సీనే కొనసాగిస్తున్నాం – కల్యాణలక్ష్మి ఎవరికి రాలేదో వివరాలు ఇవ్వండి – అసెంబ్లీలో సీతక్క. సబిత, సునీతలకు మంత్రి సీతక్క కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: కేంద్రం నుండి రావాల్సిన 15వ ఫైనాన్స్ నిధులు సర్పంచ్‌లు లేరు కాబట్టి రాలేదు.. ఆ…

రాజస్థాన్ తరహాలో ‘ప్రజా సూచన్ పోర్టల్’

– సీఎంకు సామాజిక కార్యకర్త నిఖిల్ డే సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న జన్ సూచన పోర్టల్ తరహాలో తెలంగాణలోనూ ప్రజా సూచన పోర్టల్ ఏర్పాటు చేయాలని ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రిని  నిఖిల్ డే బృందం కలిసింది.…

తెల్ల కాకులు!

            -బమ్మిడి జగదీశ్వరరావు “ఆ యింటిమీది కాకి ఈ యింటిమీద వాలకూడదు అంటారు కదా?, మరి నువ్వేంటమ్మా ఆ యింటిమీదా యీ యింటిమీదా అన్ని చోట్లా వాలుతున్నావ్?” పిల్లకాకి అడిగింది. “ఈ యిల్లూ ఆ యిల్లూ వొకప్పుడు వొకటే యిల్లు…” తల్లికాకి తన తాతలు తండ్రులు చెప్పింది తలపోసినట్టు ఆగిపోయింది. “ఒక కుటుంబం రెండు కుటుంబాలు…

ముచ్చట్ల పందిరి ‘యాది’

చెమ్మ –వారాల ఆనంద్ సామల సదాశివ ఓ జ్ఞాపకాల గని, ముచ్చట్ల పందిరి, నడుస్తున్న సాహిత్యచరిత్ర, మరపురాని హిందుస్తానీ గానకచేరి తడిమేతేచాలు శరపరంపరగా అలవోకగా మాట్లాడుతూ వినేవాళ్ళని ముచ్చట్లతో ముగ్దుల్ని చేసే విశాలప్రపంచం ఆయనది. ఎలాంటి రెఫెరెన్సులు లేకుండా ఎక్కడెక్కటి విషయాలో ఎప్పటెప్పటి సంగతులో జాలువారే ప్రవాహం అయన. ‘నేను రాసేవి విమర్శలు, చెప్పేవి చారిత్రక అంశాలు కావు, అవి ముచ్చట్లు’ అన్నారాయన. వాస్తవంగా…

కొత్త ఎరుక కలిగించే కథలు

–సుధా మురళి ఎరుక అంటే ఏమిటి!? “ఎరుక” అంటే తెలుసుకోవడం కదా. అంచనా వేయడం అనే కదా. దూరాన్ని దగ్గరగా చూడగలిగే దృష్టి. భవిష్యత్తు గమనాన్ని గమనించే సామర్థ్యం ఇవే కదా ఎరుక కలిగి ఉండటం అంటే. మరి ఒకప్పుడు ఊర్ల మధ్య తిరుగుతూ జాతకాలు చెప్పిన ఒక వర్గం, ఇతరుల జీవితాలకు “ఎరుక” ఇచ్చిన ఒక…

శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు

– ప్రజలకు భట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్థించిన శ్రీరాముడి జన్మదినం మనకందరికీ పండుగ రోజు. ఆదర్శవతంమైన కుమారుడిగా, మంచి భర్తగా, రక్త సంబంధాలకు, కుటుంబ విలువలకు ఆదర్శవంతమైన వ్యక్తిగా శ్రీరాముడు మనకందరికీ ఆదర్శప్రాయుడు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శ్రీరాముడి పాలన ఆదర్శంగా తెలంగాణలో…

జీవాల ఆలయం

కాలం కడలి అలలలో మనసుల ముత్యాలు ఎక్కడో జారిపోయాయి. నగరాల నీలి కాంతుల్లో నిజమైన వెలుగు నీడై మిగిలింది. అద్దాల భవనాల మధ్య అద్దంలా పారదర్శకమైన హృదయాలు చీలికలు పడ్డాయి.. కానీ ఆ చీలికల్లోంచి రాలిన రక్తం ఎవరికి కనిపించలేదు. వేగం వేదమై మారిన ఈ యుగంలో వెన్నెల మాటలు వాడుక తప్పాయి. కన్నీరును కూడా కరెన్సీ లాగా విలువ తూచే త్రాసులో కొలుస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి పలుకులో పరమాత్మ ఉండేవాడు, పరాయివాడి బాధలో మనసు తడిచేది ఇప్పుడు.. తలుపులు పెద్దవయ్యాయి, కిటికీలు మూసుకుపోయాయి. కానరాని మానవతా ఆనవాళ్లు గుండెల గర్భంలో గుసగుసలాడుతున్నాయి. ఆశ్రయంలేని చూపుల్లో ఆర్తనాదాలై ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక చిన్న చిరునవ్వు ఒక చిత్తశుద్ధి గల మాట ఒక కరుణామయ దృష్టి.. ఇవి విప్లవాల కంటే గొప్పవి ఎందుకంటే మానవత్వం పుస్తకాలలో పుట్టదు, పోరాటాలలో పెరగదు.. మనసు మరో మనసుని తాకినప్పుడు మాత్రమే అది పువ్వులా వికసిస్తుంది. మనం మనల్ని మించిన మనిషిని మరో మనిషిలో చూసిన రోజు, కాలం చెరిపేసిన ఆనవాళ్లు కాంతులా తిరిగి రాసుకుంటాయి. అప్పుడు.. ఈ భూమి కేవలం జీవుల గూడెం కాదు,…

రేపు ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

– పశ్చిమాసియా పరిస్థితులపై వివరించే ఛాన్స్ న్యూదిల్లీ, మార్చి 26: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్టా ల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శుక్రవారం  వర్చువల్‌గా సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడనున్న ఆయన పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్…

చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం

– ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్‌తో సీఎం – సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాష్ట్రంలోని ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ రాష్ట్ర శాసనమండలి హాల్‌లో గురువారం భేటీ…