Day March 9, 2026

యంగ్ ఇండియా స్పోర్ట్సు వర్సిటీలో సకల సౌకర్యాలు

– అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు – క్రీడా శాఖపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై సోమవారం సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో…

యువతకు సివిల్ డిఫెన్స్ వలంటీర్ శిక్షణ

– ప్రారంభించిన ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ యువతను అత్యవసర సేవలకుచేరుకునే ముందు ప్రథమ స్పందనకారులుగా (ఫస్ట్ రెస్పాండర్స్) తయారు చేయడానికి సివిల్ డిఫెన్స్ వలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారం రోజులపాటు సాగే…

చమురు ధరలతో మార్కెట్ల కుదేలు

–  రూపాయి విలువ ప‌డిపోవ‌డంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం న్యూదిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ…

సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

– షాద్‌నగర్‌లో రహస్యంగా డ్రగ్ తయారీ – ఇద్దరి అరెస్ట్. మరికొందరి కోసం గాలింపు – ఈగిల్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి సంచలన విషయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణలో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్…

కుటుంబంతో వెంకన్నను దర్శించుకున్న భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలోని శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి దర్శనం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని ఆయన అన్నారు. నూతన దంపతులైన తన కుమారుడు, కోడలు సూర్య…