భారతదేశంలో మహిళల రక్షణ చట్టాల సమర్థవంతమైన అమలుకు సంస్థాగత సామాజిక చర్యలు అవసరం. చట్టాల అమలును బలపరచడం ద్వారా మహిళలకు న్యాయం అందించవచ్చు. ఇందుకోసం మహిళలకు సంబంధించిన కేసులను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులకు లింగసున్నితమైన శిక్షణ ఇవ్వాలి. మహిళలపై జరిగే నేరాలపై త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రత్యేక కోర్టుల సంఖ్యను పెంచాలి. మహిళలు తమ హక్కులు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాల గురించి తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తు చేస్తుంది. లింగ సమానత్వం, మహిళల సాధికారత, విద్య, భద్రత, నాయకత్వం ఎంత ముఖ్యమో ఈ రోజు సమాజానికి గుర్తు చేస్తుంది. ప్రభుత్వాలు, సంస్థలు, సమాజాలు వివిధ రంగాల్లో మహిళల కృషిని గుర్తించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సమాజంలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, హింస అడ్డంకులను తొలగించాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తుంది.. 2026 సంవత్సరానికి నేపథ్యం (థీమ్) “లాభం కోసం ఇవ్వండి” (Give to Gain).అంటే వ్యక్తులు, సమాజాలు మహిళలకు మద్దతు, వనరులు, అవకాశాలు అందించినప్పుడు అందరికీ లాభం కలుగుతుందని ఈ భావన. ఈ థీమ్ ఉదారత, సహకారం, లింగ సమానత్వం కోసం సమిష్టి బాధ్యతను ప్రోత్సహిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులను గౌరవిస్తూ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది. మహిళల…