నేటి రాజ నీతిలో పౌరాణిక పాత్రలు

“ద్రబాబుది. అసెంబ్లీలో తెలంగాణ పదమే వాడొద్దని స్పీకర్ తో రూలింగ్ ఇప్పించాడు. నయీమ్ తో ప్రైవేటు సైన్యం ఏర్పాటుచేసి పోరాట యోధుల పై ఉసిగొల్పాడు. కోబ్రాలను సృష్టించి ప్రజాస్వామిక వాదులను, పౌర హక్కుల నేతలను హత్య చేయించాడు. ఆట పాట మాట బంద్ పట్టించి ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది బాబు హయాంలోనే. ఇటువంటి ఘోరాలు నేరాలు ప్రధానంగా జరిగింది తెలుగుదేశం పార్టీ హాయంలోనే. అంతటి చీకటి కాలం తెలంగాణ ప్రజల మనోఫలకం నుండి తొలగిపోయిందని భ్రమించడం ఆత్మహత్యా సదృశ్యమే కాగలదు. ఇవన్నీ మరచి కర్ణుడిలా మిత్ర ధర్మాన్ని, విధేయతను చాటుకున్నాడు .”

రమణాచారి

మన రాజకీయ నాయకులు పౌరాణిక పాత్రలలో పోల్చుకుంటూ మహానుభావులుగా కీర్తి పొందాలని చూస్తున్నారు. అందుకు ఒక ఉద్యోగుల సంఘ సన్మాన సభ వేదికయ్యింది. మనం ఏది, ఎలా ఆలోచిస్తున్నామో అదే ముఖంలో ప్రతిబింబిస్తుంది. హృదయంలో ఏమనుకుంటున్నామో, అదే మాటల్లో వ్యక్తీకరింపబడుతుంది. సరిగ్గా ఇదే విషయం ఎం.ఆర్.పి.ఎస్. ఉద్యోగ సంఘాల వేదికపై రేవంత్ రెడ్డి నోటి ద్వారా జాలువారింది. తాను మితృత్వంలో కర్ణుడి లాంటి వాడినని, బలహీన వర్గాలకు అండగా ఉండడంలో బర్భరీకుడిలా ఉంటానని ఉదాహరించారు. అనాలోచితంగా/ బాగా ఆలోచించే ఇలా మాట్లాడారా? అన్నది తెలియదు. కానీ, తన అంతరంగాన్ని ఆవిష్కరించారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

మహాభారతంలో గాని, మహాభారత యుద్ధంలో గాని అన్ని పాత్రలకంటే కృష్ణుడు, ద్రౌపది, శకుని, బర్బరీకుడు, ఘటోత్కజుడు పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో పాండవ, కౌరవుల మధ్య జూదం ప్రధాన చిచ్చుకు కారణమైంది. ధర్మరాజు సర్వం కోల్పోయిన తర్వాత ద్రౌపదిని పందెం గా పెట్టడంతో ధర్మ ప్రశ్నకు తావిచ్చినట్లయ్యింది. చెర బట్టడానికి, దుశ్శాసనుడు అంతఃపురానికి వెళ్ళినప్పుడు తానోడి నన్నోడేనా? లేక తన్నోడి తానోడెనా? అని ద్రౌపది ప్రశ్నిస్తుంది. అంటే ధర్మరాజు ముందే ఓడిపోతే తనను పందెంలో ఉంచే అర్హత లేదన్నది సారాంశం. బలం ఉంది కాబట్టి రెండు సభలో ద్రౌపదిని చీరలాగి అవమానిస్తారు. మొదటి న్యాయ సూత్రం ఇక్కడే దెబ్బతిన్నది. కర్ణుడి విషయానికొస్తే విలువ విద్యలో గెలుపొందినా, రాచరికమే గెలుపుకు గీటురాయిగా ప్రకటిస్తారు. దీనితో రారాజు సుయోధనుడు కర్ణుణ్ణి అంగ రాజ్యానికి రాజుగా ప్రకటించ పట్టాభిషేకం చేస్తాడు. మిత్ర ధర్మంగా మహాభారత యుద్ధంలో కర్ణుడు మిత్ర ధర్మం కోసం యుద్ధంలో చనిపోయారు. కౌరవుల ప్రక్కన నిలిచి పోరాడుతాడు.కౌరవుల పక్కన ఉంటూనే తప్పుడు సలహాలిస్తూ ఆ వంశ నాశనానికి తొడ్పడినవాడు శకుని.

బర్బరీకుడి విషయానికొస్తే భీముడి కుమారుడిగా, అత్యంత శక్తివంతుడైన ఆదివాసి/ మూలవాసి. తక్కువ సంఖ్య కలిగిన పాండవులను, ఇంత రక్తపాతం అవసరం లేకుండా క్షణాల్లో తమ తండ్రులను గెలిపిస్తానని ప్రకటిస్తాడు. కానీ, కృష్ణుడు, పాండవులే యుద్ధం చేసి గెలవాలని అడ్డుపడతాడు. యుద్ధ ప్రారంభంలో బలమైన పశువును బలివ్వడం ఆనాటి ఆనవాయితీ. పాండవులు యుద్ధంలో గెలవాలంటే అత్యంత శక్తివంతుడైన బర్బరీకుని, బలిగా ఉండమమని కృష్ణుడు కోరతాడు. అమాయకంగా అందుకు అంగీకరిస్తూనే, మొత్తం యుద్ధాన్ని చూసే అవకాశం కల్పించాలని షరతు పెడతాడు.. అంగీకరించిన కృష్ణుడు ఆకాశం నుండి గమనించేందుకు తలకు మాత్రమే అవకాశం కల్పిస్తాడు. ఇది ప్రచారంలో ఉన్న చరిత్ర. ప్రస్తుత విషయానికొస్తే రేవంత్ రెడ్డి ఈ రెండు పేర్లను తనకు ఆపాదించుకున్నాడు. మిత్ర ధర్మంగా ఎమ్మార్పీఎస్ . కు ఉద్యోగాలలో రిజర్వేషన్లు తొమ్మిది శాతం కల్పించి ఉద్యోగ సంఘాల మెప్పుపొందాడు. అదే కాలంలో బిజెపితో స్నేహబంధం ఉన్న ఎమ్మార్పీఎస్ అగ్రనేత కృష్ణ మాదిగకు/ బీజేపీ కి తెలంగాణలో చెక్ పెట్టాడు. ఈ దెబ్బకు ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్, బిజెపి అనుకూల శక్తులుగా విడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇప్పటికే ఆ విధమైన స్పందనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ నుండి దాదాపు కనుమరుగైన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు ఖమ్మంలో విధేయత ప్రకటించారు. ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులు తెలంగాణలో బలంగా ఉన్నారని, ప్రత్యర్థి బిఆర్ఎస్ ను గోతి తీసి పాతి పెట్టాలని, అందుకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు బహిరంగంగా పిలుపు నిచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిపి, మారోజు వీరన్నను బూటకపు కౌంటర్లో హతమార్చి, తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో కన్వీనర్ బెల్లి లలితను 17 ముక్కలుగా నరికి క్రూరంగా హత్య చేయించిన ఘనత చంద్రబాబుది. అసెంబ్లీలో తెలంగాణ పదమే వాడొద్దని స్పీకర్ తో రూలింగ్ ఇప్పించాడు. నయీమ్ తో ప్రైవేటు సైన్యం ఏర్పాటుచేసి పోరాట యోధుల పై ఉసిగొల్పాడు. కోబ్రాలను సృష్టించి ప్రజాస్వామిక వాదులను, పౌర హక్కుల నేతలను హత్య చేయించాడు. ఆట పాట మాట బంద్ పట్టించి ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది బాబు హయాంలోనే. ఇటువంటి ఘోరాలు నేరాలు ప్రధానంగా జరిగింది తెలుగుదేశం పార్టీ హాయంలోనే. అంతటి చీకటి కాలం తెలంగాణ ప్రజల మనోఫలకం నుండి తొలగిపోయిందని భ్రమించడం ఆత్మహత్యా సదృశ్యమే కాగలదు. ఇవన్నీ మరచి కర్ణుడిలా మిత్ర ధర్మాన్ని, విధేయతను చాటుకున్నాడు .

బర్భరీకుని విషయానికొస్తే, తన కుటుంబ విజయం కోసం, కృష్ణుని మాటలు విని యుద్ధానికి బలిపశువయ్యాడు. అంతే గాని బలహీనుల పక్కన నిలబడి పోరాటం చేయలేదు. పాండవులు యుద్ధo గెలిచిన తర్వాత అధర్మమైన, కుట్రలతో కూడిన విధానాలను, అతిక్రమించిన యుద్ధ నీతిని ప్రశ్నిస్తాడు. తనను బలి పశువును చేశారని చింతిస్తాడు. మరి రేవంత్ రెడ్డి పీడితుల పక్కన నిలబడ్డాడా? ప్రజా ఉద్యమాలలో/ పోరాటాలలో భాగస్వామి అయ్యాడా? త్యాగాలు చేశాడా? ఎవరి కోసం బలి పశువయ్యాడు ? ఘటోత్కచుడు కర్ణుడి అస్త్రాన్ని అడ్డుకునేందుకు, అర్జునుడి కాపాడేందుకు, పద్మవ్యూహాన్ని చేదించి బలవుతాడు. కేవలం రాజులకు అధికారం కోసం బలైన మూలవాసి / ఆదివాసులు బర్బరీకుడు, ఘటోత్కచుడు. తెలంగాణ ఉద్యమంలో ఇసుమంతైనా భాగస్వామ్యం లేకుండా, త్యాగం చెయ్యకుండానే తెలంగాణ రాష్ట్ర అధికార దక్కించుకున్నాడు. వోటుకు నోటు కేసులో దొరకబట్టిన బిఆర్ఎస్ పై ఉపన్యాసాల దాడి మాత్రమే చేసాడు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీసిపోని విధానాలను అమలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో కొంత ప్రజాస్వామికంగా,ఎన్కౌంటర్ లు చేయకుండా, లొంగుబాట్లకు వ్యూహాలు పన్నుతూ, నిర్దేశిత పరిధిలో ఉండాలనే ఆంక్షలు విధిస్తూ మావోయిస్ట్/ కమ్యూనిస్ట్ సిద్ధాంతం వైఫల్యం చెందిందనే ప్రచారానికి పావులుగా వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది వాస్తవ దృ శ్యం. జనజీవనం జీవితంలో కలిశామని వచ్చినవారిని పూర్తి స్వేచ్ఛగా జీవించనివ్వాలి.వారి భావాలను పూర్తిగా వ్యక్తీకరించే ప్రజాస్వామిక వాతావరణం కల్పించాలని డిమాండ్ చేయాలి. ఆంక్షలు విధించి కట్టడి చేయడం సరికాదు. నల్ల చట్టాలు ప్రజాస్వామిక ఉద్యమకారులపై అమలు చేసి నిర్బంధించేయమనే హామీని ప్రభుత్వం నుండి పొందగలగాలి. ఇలాంటి ప్రజాస్వామిక ఆకాంక్షల అమలు కై ప్రయత్నం చేయకుండా,పరిగణలోకి తీసుకోకుండా తమ వ్యక్తిగత స్వార్థం కోసం పాలకులను కీర్తించడం తగదు.ప్రజలారా! ఉద్యమకారులారా! పారా హుషార్! .

రమణాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *