˜టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎంవోయూ
హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికాకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నతాధికారులు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్‌లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్‌కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం హైదరాబాద్ స్థాయిని మరింత పెంచుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అధ్యక్షుడు సచిత్ అహుజా మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో రూ.5000 కోట్లతో ఏఐ డేటా సెంటర్
అమెరికా కంపెనీ ఉర్సా క్లస్టర్స్ తో ఒప్పందం
అమెరికాకు చెందిన మరో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ రాష్ట్రంలో అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించనుంది. దీనికి సంబంధించి దావోస్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. కంపెనీ సీవోవో సతీష్ అబ్బూరి, సీఆర్వో ఎరిక్ వార్నర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. హైదరాబాద్ లో 100 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈవో పెందుర్తి అన్నారు. ఇందులో హైబ్రిడ్ ఏఐ చిప్‌లను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ. 5000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు.ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఉర్సాతో భాగస్వామ్యం పంచుకోవటంతో అత్యాధునిక సాంకేతికత రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేస్తుందని అన్నారు.

హైదరాబాద్‌లో బ్లాక్ స్టోన్ ?4,500 కోట్ల పెట్టుబడులు
పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బ్లాక్‌స్టోన్ లూమినా (బ్లాక్‌స్టోన్ డేటా సెంటర్ విభాగం)తో పాటు జేసీకే ఇన్‌ఫ్రా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిపాదిత డేటా సెంటర్ రూ.4,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది.బ్లాక్‌స్టోన్ లుమినా ప్రపంచంలోని ప్రముఖ క్లౌడ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్లలో కీలకంగా ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటంతో మిగతా విదేశీ కంపెనీలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారనుంది.

సోలార్ సెల్స్ తయారీ యూనిట్
రూ.7000 కోట్ల పెట్టుబడులు
అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి లభిస్తుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్‌టెక్ తో (మైత్రా గ్రూప్) అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీ తరఫున డైరెక్టర్ గిరీష్ గెల్లి ఈ సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధన వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యం దిశగా ఈ ఒప్పందం మరో మైలు రాయిగా నిలుస్తుంది.