-ఏటూరి నాగేంద్రరావు
ఎక్కడో పట్టు జారిపోతుంది
వెలుగును ఊహించుకొనే
పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది
ఒకరిశోకం మరొకరిని కదిలించటంలేదు
కాలం కరాళ నృత్యం చేస్తూనే వుంది
ప్రతివాడు స్పర్శను మరిచిపోయి
సుదీర్ఘ మౌనాన్ని కరిగిస్తూనే వున్నాడు
మనలోని శక్తి మనల్ని
అజ్ఞాన తిమిరాంధకారంలోనికి నెట్టేసి
కడుపులో అడ్డం తిరిగిన
బిడ్డ రూపాన్ని ప్రదర్శిస్తోంది
నిశ్శబ్దంగా నీలో చొచ్చుకుపోయిన
నీ శక్తి నడుగు
కడలిలో వుండే అలల ఘోష నీది కాదా?
ఆకాశంలోని మేఘఘర్జన
నీలోంచి ఉద్భవించలేదా?
ధ్వంస రచనల్ని చేసి చదివిన వాడా
దుఃఖపు పాటని ఎన్నాళ్ళని పాడతావ్
బహుముఖ స్వేచ్ఛతో ఒక ప్రశ్నగా మారు
ఏ క్షణాలు ఎవరి కన్నీటి చెమ్మను
పలకరిస్తాయో తెలియదు.
బాధను స్వరంగా మార్చి
శతాబ్దాలగాయాల ఘర్షణను విప్పార్చి వెదజల్లు
పోరాటంలో నువ్వూ, నేనూ అందరం
సంఘర్షణా రూపాలమే!
వెలుగును ఊహించుకొనే
పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది
ఒకరిశోకం మరొకరిని కదిలించటంలేదు
కాలం కరాళ నృత్యం చేస్తూనే వుంది
ప్రతివాడు స్పర్శను మరిచిపోయి
సుదీర్ఘ మౌనాన్ని కరిగిస్తూనే వున్నాడు
మనలోని శక్తి మనల్ని
అజ్ఞాన తిమిరాంధకారంలోనికి నెట్టేసి
కడుపులో అడ్డం తిరిగిన
బిడ్డ రూపాన్ని ప్రదర్శిస్తోంది
నిశ్శబ్దంగా నీలో చొచ్చుకుపోయిన
నీ శక్తి నడుగు
కడలిలో వుండే అలల ఘోష నీది కాదా?
ఆకాశంలోని మేఘఘర్జన
నీలోంచి ఉద్భవించలేదా?
ధ్వంస రచనల్ని చేసి చదివిన వాడా
దుఃఖపు పాటని ఎన్నాళ్ళని పాడతావ్
బహుముఖ స్వేచ్ఛతో ఒక ప్రశ్నగా మారు
ఏ క్షణాలు ఎవరి కన్నీటి చెమ్మను
పలకరిస్తాయో తెలియదు.
బాధను స్వరంగా మార్చి
శతాబ్దాలగాయాల ఘర్షణను విప్పార్చి వెదజల్లు
పోరాటంలో నువ్వూ, నేనూ అందరం
సంఘర్షణా రూపాలమే!




