తొలిసారి రైటర్స్ మీట్ కు 2017 లో ఒక విద్యార్థిగా, పాఠకుడిగా హాజరయ్యాను. సూర్యలంకలో జరిగిన ఆ మీట్ నా జీవితంలో గొప్ప మలుపు. గొప్ప గొప్ప కథకులను దగ్గరగా చూసే, వినే అదృష్టం, నేర్చుకునే వీలుతో పాటు సాహిత్యంలో స్నేహితులను సంపాదించుకోగలిగాను. ఆ ఉత్సాహంతో రాసిన మొదటి కథ చున్నీ. అక్కడినుండి ఈరోజు వరకు ఒక కథకుడిగా , సినీ రచయితగా, దర్శకుడిగా నా ప్రయాణం కొనసాగడంలో రైటర్స్ మీట్ పాత్ర కీలకం. నేను రైటర్స్ మీట్ ప్రొడక్ట్ అని గర్వంగా చెప్పుకుంటాను. 2017 నుండి ప్రతీ మీట్ లో నేను ఉన్నాను, కోర్ టీమ్ మెంబర్ అయ్యాను. రజతోత్సవ వేడుకకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.
నేను రైటర్స్ మీట్ ప్రొడక్ట్ -కరుణ కుమార్




