కొత్త పార్లమెంట్‌లో తొలిసారి ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌

బిల్లుకు అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149

న్యూదిల్లీ, డిసెంబర్‌ 17 : ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లును జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి పంపడానికి లోక్‌సభ  అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో వోటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 220 వోట్లు, వ్యతిరేకంగా 149 వోట్లు వొచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్ల్కెంది. పార్లమెంట్‌ నూతన భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ విధానం ద్వారా వోటింగ్‌ నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌పై అనుమానం ఉన్న వాళ్లు వోటింగ్‌ స్లిప్‌లతో క్రాస్‌ చెక్‌ చేసుకునేందుకు స్పీకర్‌ అనుమతించారు.

దేశంలో లోక్‌సభతోపాటే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహించడం కోసం వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లును తీసుకొచ్చారు. ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఫ్‌ువాల్‌ మంగళవారం ఉదయం వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సంపూర్ణ అధ్యయనం కోసం జేపీసీ పంపాలని భావిస్తున్నట్లు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై వోటింగ్‌ నిర్వహించగా మెజారిటీ సభ్యులు అనుకూలంగా వోటు వేశారు. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ అనుమతి లభించినట్లయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *