కాళేశ్వరంపై నేటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌22:  ‌కాళేశ్వరం వ్యవహారంలో బుధవారం నుంచి మళ్లీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌జరగనుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌విచారించనున్నారు. గతంలో విచారణ చేసిన వారిని కూడా మళ్లీ పిలవనున్నారు. ఈనెల 29 వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌కొనసాగనుంది. మంగళవారం నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమావేశ మయ్యారు.

వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ ‌డీజీని జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ఆదేశించారు. ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులనూ జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌విచారించనున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సంస్థల లావాదేవీల వివరాలను కమిషన్‌ ‌పరిశీలించనుంది. అఫిడవిట్‌ ‌దాఖలు చేసిన వి. ప్రకాశ్‌ను కూడా విచారించనుంది. ఎన్డీఎస్‌ఏ, ‌కాగ్‌ ‌నివేదికల ఆధారణంగా విచారణ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *