ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి

అంతర్జాతీయ మహిళా దశాబ్దం ప్రకటించి యాభై సంవత్సరాలు దాటిన సందర్భంగా మనం స్త్రీ వాదం ఇప్పుడు ఏ దశలో వుందని కాక ఇంతకాలం స్త్రీ వాదులు చేసిన కృషిని, పంచిన జ్ఞానాన్ని, పరిచయం చేసిన తాత్విక దృక్పథాన్ని సమాజం ఏ మేరకు అర్థం చేసుకుని స్వీకరించిందని ప్రశ్నించుకోవాలి .స్త్రీ రక్షణ కోసం తెచ్చిన చట్టాలు, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు  అమానుష చర్యలను  ఏ మాత్రం అరికట్టలేకపోయాయి. మూఢనమ్మకాలు, అట్టహాసాలు, ఆడంబరాలు నిలిచి వెలుగుతున్నాయి. జీవితాలను మతమూ మార్కెట్టే శాసిస్తున్నాయి. కనుక ఇప్పుడు మనం స్త్రీవాదపు దశ గురించి కాదు అడగాల్సింది. స్త్రీవాదులు చెప్పిన విషయాలను ఒక సమాజంగా మనం ఎంతవరకు ఆచరణలోకి తీసుకున్నామని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *