ఇక యుద్ధం మీ ఇష్టం

 
-పట్లొళ్ళ బక్కారెడ్డి
అవని ఏ జాగాలో అయినా
ఉసిగొలిపే నియంతల విద్వేషం
ఉన్మత్తుల ఉన్మాదం యుద్ధం
ప్రపంచ దేశాల ప్రవచనం
ప్రాదేశిక శాంతిభద్రతల ప్రాధాన్యం
గురివింద బోధనల చందం
శకుని మామల డెందం
అనుమాన బీజాల అడుగులు
అణుంగుదేశాల విధానాలు
ఆచరించని నీతి బోధనలు
ఆత్మ విమర్శ లేని గుణపాటాలు
యుగ యుగంలో జరిగిన యుద్ధం
న్యాయాన్యాయాల రాద్ధాంతం
కొలబద్ద కొలువ లేని విధ్వంసం
మానవజాతి వినాశ శాపం యుద్ధం
ఆధిపత్యాలు అణచివేతలు
దురాక్రమనలు దుశ్చర్యలు
ఏ యుద్ధం ఎవరికీ ఉద్దార్కం
గెలిచిన ఓడిన మిగిలేది నిర్వేదం
అంటుకుంటే యుద్ధం
ఆర్పలేని రావణ కష్టం
బ్రతకడం ఎవరికైనా భాగ్యం కాదా
అణువంత ఆలోచిస్తే
అవని అంతా శాంతి క్రాంతి
కాదంటే ఇక యుద్ధం మీ ఇష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *